Karthika Deepam July 1st Episode: నీకు పాపం.. ఉసురు తగిలింది... కార్తీక్‌పై నిప్పులు చెరిగిన సౌందర్య

కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్ వల్లే గర్బవతిని అయినట్టు ఆరోపిస్తూ 25వ తేదీన పెళ్లికి ఏర్పాట్లు చేయడంతో దీప కాపురం, సౌందర్య ప్రతిష్ట మరింత ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో మోనిత పన్నిన ఉచ్చు నుంచి బయటపడేందుకు తల్లి సౌందర్య వద్దకు కార్తీక్ రాగా. ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. 1080 ఎపిసోడ్‌లో సౌందర్య, కార్తీక్ మధ్య జరిగిన సంభాషణ ఎమోషనల్‌గా ఎలా సాగిందంటే...

ఎవరికి చెడ్డవాడిలా?

ఎవరికి చెడ్డవాడిలా?

మోనిత వల్ల ఏర్పడిన సమస్యలకు ఎవరో జవాబు చెప్పరు.. ఆ ప్రశ్నలన్నింటికి నీవే సమాధానం చెప్పుకోవాలి అంటూ సౌందర్య నిలదీసింది. నైతికంగా, అనైతికంగా, సభ్యత, సంస్కారమా, బలహీనత, మా దౌర్బగ్యామా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి మంచి వాడిలా ఉంటావు? ఎవరికి చెడ్డవాడిలా ఉంటావు అని సౌందర్య ప్రశ్నిస్తే.. మమ్మీ.. ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటూ కార్తీక్ ధీనంగా సమాధానం ఇచ్చారు.

 ప్రతివతకు పదేళ్లు శిక్ష వేసినందుకే

ప్రతివతకు పదేళ్లు శిక్ష వేసినందుకే

నా జీవితంలో.. నాకే ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటూ కార్తీక్ మదనపడిపోతే.. నీకు పాపం తగిలింది. పతివ్రతను పదేళ్లు వెలేసినందుకు నీకు ఆ దోషం అంటింది. దాని ఉసురే నీకు తగలింది. అందుకే భగవంతుడు నీవు దీపకు వేసిన శిక్షే.. నీకు వేశాడు. నిన్ను అనుమానిస్తుందో లేదో.. ఆ మౌనం బద్దలైనరోజే నీకు తెలుస్తుంది. ఆ మౌనం నిన్ను ఎక్కడ భుగ్గిపాలు చేస్తుందనే భయం మమల్ని వెంటాడుతున్నది.

 మోనిత ఊబిలో కూరుకుపోయావు

మోనిత ఊబిలో కూరుకుపోయావు

మోనిత వల్ల ఏర్పడిన సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదు మమ్మీ అని కార్తీక్ అంటే.. సమస్య కాదు.. అదీ ఊబి.. 25వ తేదీన మోనిత పెట్టిన సుముహుర్తానికి ఆ ఊబిలో మునిగిపోతావు. ఆ ఊబి నుంచి బయటపడేందుకు చేతులు ఇవ్వకుండా మమల్ని కట్టేశావు. నా జీవితంలోనే ఇందంతా ఎందుకు జరుగుతున్నది అంటూ కార్తీక్ ఆవేదనకు లోనయ్యాడు.

ఎవరికి న్యాయం? ఎవరికి అన్యాయం?

ఎవరికి న్యాయం? ఎవరికి అన్యాయం?

కార్తీక్ తన తల్లితో ఆవేదనను పంచుకొంటూ ఎవరికి మంచి జరగబోతున్నది.. ఎవరికి చెడు జరగబోతున్నది? ఎవరికి అన్యాయం? ఎవరికి న్యాయం జరగబోతున్నది? మోనితకా? నాకా? దీపకా? అంటూ తనలో తాను ప్రశ్నలు వేసుకొన్నాడు. దాంతో ఇంకెవరికి నా ఇంటి కోడలు అయినందుకు ఆ అన్యాయం దీపకే జరగబోతున్నది. అన్యాయానికి బలైపోవడానికి వంటలక్క ఈ ఇంట్లో అడుగుపెట్టినట్టున్నది. ఆ అన్యాయం దీపకే జరుగబోతున్నది. దానిని అత్తగా, సాటి మహిళగా నేను హర్షించలేను అంటూ సౌందర్య ఆవేశంగా మాట్లాడారు.

నా ముందు నిర్దోషిలా...

నా ముందు నిర్దోషిలా...

కార్తీక్ చేసిన తప్పును మరోసారి సౌందర్య గుర్తు చేస్తూ.. జీవితానికి సరిపడిన తప్పు చేసి నా ముందు నిర్దోషిగా నిలబడితే నేను సపోర్ట్ చేయలేను. ఈ ఉపద్రవం గురించి దీపకు తెలియజేయాల్సిందే. ఒకవేళ చెప్పలేకపోతే అది అధర్మం. చెబితే ధర్మంగా ఉంటుంది. తనను పట్టి పీడిస్తున్న మోనిత వ్యవహారాన్ని తట్టుకోలేక కళ్లు బైర్లు గమ్మి.. అక్కడే ఉన్న కూర్చిలో కార్తీక్ తూలిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X