For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam.. ఆ సర్పాన్ని నా మెడలో వేసి.. చేతులు దులిపేసుకొన్నావు.. మోనితపై కార్తీక్ ఫైర్

  |

  తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ హవా కొనసాగిస్తున్నది. పెళ్లికాకుండానే గర్బవతిని అయ్యానంటూ బాంబు పేల్చిన మోనిత కార్తీక్‌ను ఇరుకున పెట్టేందుకు ప్లాన్ సిద్దం చేసింది. పెళ్లి చేసుకొనేందుకు కార్తీక్‌ను మోనిత రిజిస్ట్రార్ ఆఫీస్‌కు తీసుకెళ్లింది. రిజిస్ట్రార్‌తో మోనిత, కార్తీక్ సంభాషణ ఎమోషనల్‌గానే సాగింది. తాజా ఎపిసోడ్ 1078‌లో ఇంకా ఏం జరిగిందంటే...

  25 తేదీన పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలని..

  25 తేదీన పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాలని..

  రిజిస్టర్ మ్యారేజ్‌ చేసుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. కొన్ని పద్దతులు పాటించాలి. కాబట్టి వాటిని అనుసరించాల్సి ఉంటుంది అంటూ రిజిస్ట్రార్ సూచించాడు. కానీ అంతలోనే 25వ తేదీన పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. కానీ ఇద్దరు సాక్ష్యులు ఉండాలి అని రిజిస్ట్రార్ తెలిపారు. అందుకు కార్తీక్ తల్లి సౌందర్య, ఆయన మొదటి భార్య దీప గారు ఉన్నారు అని మోనిత చెప్పింది.

   నీపై మోజుపడి ఆ తప్పు చేయలేదు

  నీపై మోజుపడి ఆ తప్పు చేయలేదు

  మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్‌ను వచ్చిన కార్తీక్.. కారు వద్దనే దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఏం ఆలోచిస్తున్నావు అని మోనిత అంటే.. ఎంత దూరం తీసుకెళ్తావో అనే విషయాన్ని ఆలోచిస్తున్నాను అని కార్తీక్ సమాధానం చెప్పాడు. అయితే ఎంత దూరం తీసుకెళ్లడానికే అంత దగ్గరయ్యావా? అంటూ ప్రశ్నించింది. అయితే నీపై మోజు పడో లేదో.. సహజీవనం చేసో నీకు ఈ పరిస్థితి రానివ్వలేదు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానంటే.. నేను తప్పు చేశానని కాదు.. తప్పు ఎలా జరిగిందనే విషయం గురించి ఆలోచిస్తున్నాను. కేవలం నా వల్లే తప్పు జరగలేదు. ఈ తప్పకు కారణం ఇద్దరం అంటూ కార్తీక్ కోపంతో ఊగిపోయాడు.

   నీకు ఆ స్పృహ లేదా?

  నీకు ఆ స్పృహ లేదా?

  మోనిత ప్లాన్స్ అడ్డుకట్ట వేసేందుకు కార్తీక్ ప్రయత్నిస్తూ.. ఆ తప్పు జరిగినప్పుడు.. నేను స్పృహలో లేను. నీవు స్పృహలో ఉన్నావు. అప్పుడు నీకు ఈ పరిస్థితి వస్తుందనే స్పృహ లేదు. నన్ను స్పృహలోకి రప్పించాలనే ధ్యాసలేదు. ఆ మరుసటి రోజు ఈ విషయం చెప్పలేదు. ఈ సమస్య సర్పంగా మారి మెడకు చుట్టుకొందో అప్పుడు నీ మెడలో నుంచి తీసేసి.. నా మెడకు చుట్టేసి నీ చేతులు దులిపేసుకొన్నావు. ఆ సర్పం నా సంసారానికి చుట్టేసుకొన్నది. నా కాపురాన్ని కాటేసింది అంటూ మోనితను కార్తీక్ దులిపేశాడు.

   సౌందర్య, దీపను తీసుకురావాల్సిన..

  సౌందర్య, దీపను తీసుకురావాల్సిన..


  మోనితను కార్తీక్ ప్రశ్నిస్తూ తప్పు చేయడమే కాకుండా ఈ పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చింది నీవు.. ఇక్కడి దాకా వచ్చింది నీవు. సాక్ష్యం కోసం మా అమ్మ, భార్య వస్తావని ఎలా చెబుతున్నావు నీవు. వాళ్లు దేనికి సాక్ష్యం చెబుతారు. మనం చేసిన తప్పుకా? 25వ తేదీన చేయబోయే తప్పుకా? వాళ్లు ఎలా వస్తారని అంత ధైర్యంగా అనుకొన్నావు అని కార్తీక్ గట్టి ప్రశ్నిస్తే.. తెలియదు. కానీ వారిద్దరిని తీసుకురావాల్సిన బాధ్యత నీదే అంటూ మోనిత సమాధానం ఇచ్చింది.

  కలంకితగా నేను ఉండలేను...

  కలంకితగా నేను ఉండలేను...

  కార్తీక్ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. దీపను అనుమానిస్తే.. పదేళ్లు వేచి చూసింది. కానీ నేను అలా వెయిట్ చేసే ఉద్దేశం లేదు. కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా.. ఓ కలంకితగా నేను వ్యవహరించను. జరిగిన తప్పుగా సాక్ష్యంగా వారిని తీసుకు రమ్మని చెప్పడం లేదు. జరుగాల్సిన న్యాయానికి సాక్ష్యంగా వారిని తీసుకురమ్మంటున్నాను. కాబట్టి తీసుకురావాలి అంటున్నాను అని మోనిత అంటే.. నా భార్య ఎందుకు రావాలి. చేయని తప్పుకు పదేళ్లు నరకం అనుభవించి బలైపోయింది అని కార్తీక్ ఆవేదన చెందాడు.

  దీప కాపురానికి సమాధి కట్టమని...

  దీప కాపురానికి సమాధి కట్టమని...

  కార్తీక్ తన భార్య గురించి మాట్లాడుతూ.. దీప సహనానికి గుడి కట్టాలి. కానీ నీవేమో సమాధి కట్టమని చెబుతున్నావు అని అంటే.. నీవు గుడి కడుతావో.. లేదా తాజ్ మహల్ కడుతావో నీ ఇష్టం. నా బిడ్డను తండ్రి లేని బిడ్డగా పెంచను. కాబట్టి నీ తల్లి, భార్యను సాక్ష్యులుగా రప్పించే బాధ్యత నీదే. వారిని ఎలా రప్పిస్తావనే విషయం నీకు సంబంధించినది అంటూ మోనిత గట్టిగానే చెప్పేసింది. దాంతో అక్కడి నుంచి దీపతో కార్తీక్ కారులో బయలుదేరి వెళ్లిపోయాడు. కార్తీక్ మనసులో ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి అనే విషయం వెంటాడుతున్నది.

  English summary
  Karthika Deepam 29th June's Episode of 1078 goes with emotional content. Monitha went to Registar Marriage office with Karthik.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X