twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని కలిసిన తనీష్‌కు ఝలక్.. చంద్రబాబుతో కౌశల్ భేటీ.. రసపట్టులో ‘ఆర్మీ’ లొల్లి!

    |

    Recommended Video

    Kaushal Mets CM Chandrababu Naidu, And Joined In TDP | Filmibeat Telugu

    కౌశల్ ఆర్మీ సభ్యుల ఆరోపణల వివాదం బిగ్‌బాస్ సెలబ్రిటీలు తనీష్, కౌశల్ మధ్య చిచ్చుపెట్టింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మీడియా దద్దరిల్లిన సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ నిధుల దుర్వినియోగ వివాదం అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వివాదం ఎటువైపుకు దారి తీస్తుందో అనే చర్చ సినీ, రాజకీయ వర్గాల్లో మొదలైంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కౌశల్‌ కలువడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

     నిధుల దుర్వినియోగం ఆరోపణలు

    నిధుల దుర్వినియోగం ఆరోపణలు

    బిగ్‌బాస్ విజేత కౌశల్‌ నిలువడానికి సహకరించిన కౌశల్ ఆర్మీ సభ్యులు ఏకంగా ఆయనపైనే నిధుల దుర్వినియోగం ఆరోపణలు చేయడం మీడియాలో సంచలనం రేగింది. దాంతో తన వద్ద కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నిధుల వివరాలకు పక్కాగా రుజువులు ఉన్నాయి. కౌశల్ ఆర్మీ సభ్యులను తనీష్, బాబు గోగినేని తదితరులు రెచ్చగొడుతున్నారు అని కౌశల్ ఆరోపించారు.

     కౌశల్‌పై భగ్గుమన్న తనీష్

    కౌశల్‌పై భగ్గుమన్న తనీష్

    కౌశల్ ఆరోపణలపై ఓ టెలివిజన్ ఛానెల్ చర్చ సందర్భంగా తనీష్ భగ్గుమన్నారు. తనపై అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని తనీష్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటానని కౌశల్‌ను హెచ్చరించారు. దాంతో ఈ వివాదం మరింత ముదిరింది.

    చిరంజీవితో తనీష్ భేటీ

    చిరంజీవితో తనీష్ భేటీ

    కౌశల్, కౌశల్ ఆర్మీ వివాదం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని తనీష్ కలవడం మరో సెన్సేషన్‌కు దారి తీసింది. తనపై కౌశల్ చేస్తున్న ఆరోపణలను, వివాదాన్ని చిరంజీవి దృష్టికి తనీష్ తీసుకెళ్లినట్టు వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవిని తనీష్ కలువడం వెనుక ఏం జరిగిందనే విషయం బయటకు రాకపోవడం అనేక ఊహాగానాలకు దారి తీసింది.

    చంద్రబాబును కలిసిన కౌశల్

    చంద్రబాబును కలిసిన కౌశల్

    ఇక చిరంజీవిని తనీష్‌ కలిసిన నేపథ్యంలో కౌశల్ మరో ఎత్తు వేశాడు. ఏపీ సీఎం చంద్రబాబును కలువడంతో ఈ వివాదంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నట్టు సంకేతాలు అందాయి. చంద్రబాబును ఎందుకు కలిశాడన్నది ఇంకా సస్పెన్స్ గానీ ఉంది. ఈ భేటి వెనుక రాజకీయ కోణమేమైనా ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

    రాజకీయాల్లోకి కౌశల్

    రాజకీయాల్లోకి కౌశల్

    ఇదిలా ఉండగా, కౌశల్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు మీడియాలో వెలుగు చూశాయి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కౌశల్ విశాఖపట్టణం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును కౌశల్ కలిశాడా అనే అనుమానాలు, రూమర్లు మీడియాలో వస్తున్నాయి. వీటికి కౌశల్ సమాధానం ఇస్తే తప్ప రూమర్లకు అడ్డుకట్ట పడదనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Kaushal Army Contraversy still rising in media. After Tanish meeting Chiranjeevi, Kaushal mets AP CM Chandrababu Naidu. This incident takes issue another level.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X