For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లకు కౌశల్ వార్నింగ్.. దాన్ని వాడుకుంటే అంతే సంగతులంటూ పోస్ట్

  |
  Bigg Boss Telugu 3 : Kaushal Manda Warning To Bigg Boss Contestants || Filmibeat Telugu

  తెలుగు రియాలిటీ షో 'బిగ్‌బాస్' ద్వారా కౌశల్ మండా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. గత సంవత్సరం 'స్టార్ మా' చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లోఆయన స్టార్ అయిపోయాడు. ఈ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది.

   ‘బిగ్ బాస్’ షో గర్వంగా ఉందంటూ..

  ‘బిగ్ బాస్’ షో గర్వంగా ఉందంటూ..

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ వ్యయంతో వచ్చిన ‘బిగ్ బాస్' షోపై వచ్చిన వివాదంతో చాలా మంది దీన్ని నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు హైకోర్టులో పిల్ సైతం వేశారు. దీనిపై ఈ షో సీజన్ - 2 విన్నర్ కౌశల్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ‘‘బిగ్ బాస్ విన్నర్‌గా, సామాన్య సిటిజన్‌గా ఈ షోపై చాలా గౌరవం ఉంది'' అంటూ పోస్ట్ చేశాడు.

  ‘బిగ్ బాస్’కు మద్దతుగా..

  ‘బిగ్ బాస్’కు మద్దతుగా..

  ప్రస్తుతం ‘బిగ్ బాస్' సెలెక్షన్ ప్రాసెస్‌పై ఎంతో రాద్దాంతం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ఈ షోలోకి రావాలంటే బాస్‌ను ఎలా సంతృప్తి పరుస్తావు' అన్నారని ఒకరు.. ‘వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..? నీ సెక్స్ లైఫ్‌ను ఎలా మేనేజ్ చేసుకోగలవు..?' అన్నారని మరొకరు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ‘బిగ్ బాస్' ప్రాసెస్‌పై అందరిలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌశల్ ఈ రియాలిటీ షోలో సెలెక్షన్ ప్రాసెస్ జెన్యూన్‌గా ఉంటుందని పేర్కొనడం విశేషం.

  వాళ్లకు గుడ్ లక్ చెబుతూ..

  వాళ్లకు గుడ్ లక్ చెబుతూ..

  ఈ వివాదం జరుగుతున్నా ‘బిగ్ బాస్' ప్రారంభం కావడం పక్కా అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి షోలో పాల్గొనే కంటెస్టెంట్‌లు అందరికీ కౌశల్ శుభాకాంక్షలు తెలియ జేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ‘‘సీజన్ -3లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లందరికీ గుడ్ లక్ చెబుతున్నా. మీరంతా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు'' అంటూ ట్వీట్ చేశాడు.

   ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు

  ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు

  తాజాగా కంటెస్టెంట్లను ఉద్దేశిస్తూ కౌశల్ ఓ పోస్ట్ చేశాడు. ‘‘బిగ్‌బాస్' సీజన్ - 3లో నా పేరును వాడుకోవద్దు. షోలో పబ్లిసిటీ కోసమో.. ఇంటర్వ్యూల కోసమో.. నా పేరు కానీ, కౌశల్ పేరు కానీ ఎవరూ వాడుకోవద్దు'' అంటూ అందులో పేర్కొన్నాడు. దీనికి కౌశల్ ఆర్మీ కూడా మద్దతు తెలిపింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  ఆల్రెడీ కొన్ని ఆర్మీలు స్టార్ట్స్

  ఆల్రెడీ కొన్ని ఆర్మీలు స్టార్ట్స్

  సీజన్ - 3 ప్రారంభం కాకముందే ‘బిగ్ బాస్'లో పాల్గొనే వారి పేర్లు బయటకు వచ్చేశాయి. దీని ప్రకారం.. సోషల్ మీడియాలో పలువురు సెలెబ్రిటీల పేరిట ఫ్యాన్ పేజీలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగానే ప్రముఖ యాంకర్ శ్రీముఖి పేరిట ఆర్మీ ప్రారంభమైంది. అలాగే, పలువురు పేర్లతో కొన్ని పేజీలు దర్శనమిస్తున్నాయి.

  English summary
  Tollywood Senior Hero Akkineni Nagarjuna Host Bigg Boss Telugu season 3. This Show Started last Sunday. KAUSHAL MANDA Respond On Bigg Boss Show. And He Comments On contestants.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X