Just In
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్: కరోనాపై భారత్‌దే పైచేయి, మోడీ సర్కారు సక్సెస్, లాక్డౌన్ ఎఫెక్ట్, వ్యాక్సిన్‌కే మొగ్గు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండేళ్లకు బుల్లితెరపై ‘కేజీయఫ్’.. ఎంతకు కొన్నారంటే?.. రాకీ భాయ్ దెబ్బకు టీఆర్పీలు ఇక గల్లంతే!
కేజీయఫ్ సృష్టించిన సంచలనాలు మామూలువి కావు. ఒక్క సినిమాతో మొత్తం పరిశ్రమను తలెత్తుకునే చేశాడు. అప్పటి వరకు కన్నడ పరిశ్రమ అంటే బడ్జెట్, కలెక్షన్ల విషయంలో చిన్న చూపు ఉండేది. కానీ రాకీ భాయ్ రంగంలోకి దిగి బాక్సాఫీస్ లెక్కలన్నీ సరి చేశాడు. దేశ వ్యాప్తంగా దుమ్ములేపాడు. దాదాపు 250కోట్లు కొల్లగొట్టి శాండల్ వుడ్ సత్తా చాటాడు. కేజీయఫ్ అనే ఒక్క సినిమాతో ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు యశ్ అంటే కేవలం శాండల్ వుడ్‌కు చెందిన వాడు మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో యశ్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే కేజీయఫ్ ఛాప్టర్ 2ను అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

రికార్డులకు కేరాఫ్ అడ్రస్..
కేజీయఫ్ చిత్రంతో యశ్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. కేవలం డబ్బింగ్ చిత్రంతోనే హిందీ, తెలుగు, తమిళంలో భారీ కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎంతలా విజృంభిస్తుందో అంతలా కేజీయఫ్ ఇంపాక్ట్ చూపింది. కేజీయఫ్ ఏకంగా కన్నడ పరిశ్రమలో రికార్డులను కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.

బుల్లితెరపై ఆలస్యంగా..
వెండితెరపై విజృంభించిన రాకీ భాయ్..బుల్లితెరపై మాత్రం ఇంత వరకు కనిపించలేదు. సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా గానీ కేజీయఫ్ బుల్లితెరపై ప్రసారం కాలేదు. మామూలుగా అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ చిత్రం వెంటనే టెలికాస్ట్ చేసి రేటింగ్స్‌లోనూ రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తారు. అందుకు గానూ పెద్ద మొత్తంలో ఫ్యాన్సీ రేటును కూడా ఆఫర్ చేస్తారు.

ఆ మధ్య కేసు..
కేజీయఫ్ చిత్రాన్ని లోకల్ చానెల్ ప్రసారం చేయడంపై నిర్మాత ఫైర్ అయ్యాడు. తాము ఎవ్వరికీ హక్కులు అమ్మలేదని, అలాంటప్పుడు సినిమాను ఎలా ప్రసారం చేస్తారని సదరులోకల్ చానెల్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఎట్టకేలకు కేజీయఫ్ బుల్లితెరపై ప్రసారం కానుంది.

ఇక రేటింగ్స్‌లో రికార్డులే..
రెండేళ్ల తరువాత ప్రసారం అవుతున్నా.. కేజీయఫ్‌ను వీక్షించేందుకు అందరూ ఆసక్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా స్టార్ మా ఛానెల్ ఓ ప్రోమోను కూడా వదిలింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ త్వరలోనే ప్రసారం కానుందని తెలిపింది. ఈ దెబ్బతో రేటింగ్స్‌లోనూ రాకీ భాయ్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

‘కేజీయఫ్'కు మంచి రేటు..
కేజీయఫ్ తెలుగు శాటిలైట్‌కు మంచి రేటే వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా స్థాయి రేటు కాదని తెలుస్తోంది. ఈ చిత్రానికి 4.5కోట్ల మేర ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక టీఆర్పీలో రాకీ భాయ్ ఏ మేరకు హవా చూపిస్తాడో చూడాలి.