Bigg Boss Telugu 5 నుంచి లహరి షారి అవుట్.. సిరి హన్మంతు, షణ్ముఖ్‌ను కడిగి పడేసిన అమ్ము

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ నుంచి మూడో కంటెస్టెంట్‌ ఎలిమినేట్ అయింది. మూడోవారం నామినేషన్‌లో ఉన్న లహరి షారి మూడో కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయింది. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్తూ సిరికి ఏదో వార్నింగ్ ఇవ్వడం కంటెస్టెంట్స్‌లో కలవరం, గందరగోళం నెలకొన్నది. లహరి షారి ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగింది. హోస్ట్ నాగార్జునతో కలిసి ఎలాంటి గేమ్ ఆడింది. ఎవరిని టార్గెట్ చేసి ఎలాంటి అభిప్రాయాలను వెల్లడించింది. ఆ వివరాలల్లోకి వెళితే...

మ్యూజిక్, డ్యాన్స్, ఫన్

మ్యూజిక్, డ్యాన్స్, ఫన్

సండే ఫన్‌డే కావడంతో ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడించారు. మ్యూజిక్ గేమ్ ఆడించాడు. ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించి మ్యూజిక్‌ ప్లే చేసి.. ఆ పాటను గుర్తించాలి. ఆ పాటకు ఇద్దరు కంటెస్టెంట్లు డ్యాన్స్ చేయాలి. ఈ గేమ్‌లో పోటి పడి గేమ్‌లో పాల్గొనడమే కాకుండా డ్యాన్సులు చేస్తూ స్టెప్పులు వేశారు. ఈ గేమ్ ముగిసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో ఒకరిని సేఫ్ చేయడానికి ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు.

కారు స్టీరింగ్ చేతిలో పెట్టి..

కారు స్టీరింగ్ చేతిలో పెట్టి..

నామినేషన్‌లో ఉన్న మానస్, ప్రియ, లహరి షారిని నిలబెట్టి ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. కారు స్టీరింగ్‌ను చేతిలో పెట్టి.. ఎవరి చేతిలో ఉండగా యాక్సిడెంట్ అవుతుందో వారు అన్ సేఫ్ అవుతారు అని చెప్పారు. ప్రియ, లహరి షారి చేతిలో ఉండగా.. అన్ సేఫ్ అన్నారు. అయితే మానస్ చేతిలో స్టీరింగ్ ఉండగా.. మీరు సేఫ్ అని చెప్పడంతో ఇక ఎలిమినేషన్‌లో ముగ్గురు మిగిలారు.

ఇంటి సభ్యులతో బ్లైండ్ ఫోల్డ్ గేమ్

ఇంటి సభ్యులతో బ్లైండ్ ఫోల్డ్ గేమ్

ఆ తర్వాత ఇంటి సభ్యులతో టచ్ చేసి ఒక వస్తువును గుర్తించాలి. అయితే కంటెస్టెంట్ కళ్లకు బ్లైండ్ ఫోల్డ్ కట్టాలి. అలా గేమ్ ఆడించి ఇంటి సభ్యులకు హోస్ట్ ఫన్ క్రియేట్ చేశారు. అలా గేమ్ ముగించిన హోస్ట్ నాగార్జున మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. చేతిలో రెండు లైట్లను తీసుకొన్నారు. ఒక లైట్ మీద ప్రియ, మరో లైట్ మీద లహరి షారి పేర్లు రాశారు. ఎవరి పేరు ఉన్న లైట్ గ్రీన్ అవుతుందో వారు సేఫ్.. మరొకరు అన్ సేఫ్.. ఎలిమినేట్ అవుతారు అని రూల్స్ చెప్పారు.

లహరి షారికి డేంజర్ లైట్

లహరి షారికి డేంజర్ లైట్

ప్రియ, లహరి షారి పేర్లు ఉన్న లైట్స్‌ను నాగార్జున చేతిలోకి తీసుకొని ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న లైట్లను ఆఫ్ చేసి ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ప్రియా పేరు ఉన్న లైట్ గ్రీన్‌గా మారడంతో.. ఆమె సేఫ్ అయినట్టు చెప్పారు. దాంతో లహరి షారి ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు.

సిరి హన్మంతుతో వాడివేడిగా

సిరి హన్మంతుతో వాడివేడిగా


ఎలిమినేషన్ తర్వాత ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా యాంకర్ రవి బాధలో మునిగిపోయాడు. ఇఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పి వేదిక మీదకు వచ్చారు. ఇంటి నుంచి బయటకువచ్చే ముందు సిరి హన్మంతుతో ఘాటుగా డిస్కషన్ జరిగింది. వేదిక మీద నుంచి మాట్లాడుతా అంటూ లహరి షారి ఘాటుగా స్పందించింది.

Recommended Video

Bigg Boss Telugu 5, Episode 19 Highlights || Filmibeat Telugu
షణ్ముఖ్‌పై లహరి ఫైర్..

షణ్ముఖ్‌పై లహరి ఫైర్..

ఇక బిగ్‌బాస్ ఇంటి వేదిక మీదకు వచ్చిన లహరిషారి హోస్ట్ నాగార్జునతో కలిసి తన జర్నీ చూసింది. ఇలాంటి పెద్ద వేదిక మీద నా టాలెంట్‌ను చూపించుకోవాలనుకొన్నాను. కానీ మూడు వారాలే నా జర్నీ ఉంటుందని అనుకోలేదు అంటూ నాగ్‌తో లహరి షారి చెప్పింది. ఆ తర్వాత ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలను చెప్పింది. షణ్ముఖ్‌తో మాట్లాడుతూ.. సిరి మాటలు వినకు.. సిరి వేసిందని నీవు నన్ను నామినేట్ చేశావు.. ఏంటిదిరా అది.. ఆమె ఏది చేస్తే అది చేయకు అని లహరి అంటే.. అందుకే నీవు అక్కడ ఉన్నావు అని షణ్ముఖ్ కౌంటర్ ఇస్తే.. నీ మంచి గురించే చెబుతున్నాను అంటూ లహరి చెప్పింది. అలా బిగ్‌బాస్ జర్నీని ముగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X