»   » 'మాటీవి' మార్పులు: లోగో మారింది, ఉద్యోగస్తుల పరిస్దితి ఏంటి,బాలయ్య ని అడుగుతాం

'మాటీవి' మార్పులు: లోగో మారింది, ఉద్యోగస్తుల పరిస్దితి ఏంటి,బాలయ్య ని అడుగుతాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మాటీవీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్స్‌ రీసెంట్ గా స్టార్‌ టీవీ నెట్‌వర్క్‌లో భాగం అయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున యజమానులుగా ఉన్న మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌కు చెందిన బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యాపారాన్నీ, బ్రాండ్‌, అసెట్స్‌తో సహా స్టార్‌ టీవీ ఏకమొత్తంగా కొనుగోలు చేసింది. దాంతో మాటీవి లోగో మారింది.

స్టార్ తో కలిసి కొత్త బ్రాండ్ లోగోతో ఇక కనపడుతోంది. ఈ లోగోని చిరంజీవి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి సంబంధించిన విషయాలను చిరంజీవి మీడియాతో పంచుకున్నారు.

మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌కు చెందిన నాలుగు చానళ్లు.... మాటీవీ, మా మ్యూజిక్‌, మా మూవీస్‌, మా గోల్ట్‌ను స్టార్‌ టీవీ గ్రూప్‌ సొంతం చేసుకుంటుంది. మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ కంపెనీ మాత్రం ప్రమోటర్ల చేతుల్లోనే ఉంటుంది.

మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌కు 65 శాతం వాటా ఉండగా చిరంజీవి కుటుంబానికి 20 శాతం, అక్కినేని నాగార్జునకు 10 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్ల చేతుల్లో 5 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ తన వ్యాపారాన్ని విక్రయిస్తున్నందున ఈ డీల్‌కు సంబంధించిన మొత్తం సొమ్ము మా టీవీ నెట్‌వర్క్‌ కంపెనీ ఖాతాల్లోకి వెళుతుంది.

అందుకే అమ్మకం

అందుకే అమ్మకం

విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2500 కోట్ల రూపాయలకు మాటీవీ, స్టార్‌ మధ్య డీల్‌ కుదిరినట్టు తెలిసింది. దేశీయ మీడియా రంగంలో ఇది అతిపెద్ద డీల్‌గా చెప్పవచ్చు. సీరియల్‌ ఎంటర్‌ప్రీన్యూర్‌గా పేరున్న నిమ్మగడ్డ ప్రసాద్‌, బహుశ ఈ వాల్యుయేషన్‌కారణంగానే చానెల్స్‌ అమ్మకానికి సిద్ధపడి ఉంటారని అంటున్నారు.

 అప్పట్లో అంతమందే

అప్పట్లో అంతమందే

2007లో ఆయన బల్క్‌డ్రగ్స్‌, ఇంటర్‌మీడియరీల సంస్థ మాట్రిక్స్‌ను భారీ వాల్యుయేషన్‌కు అమెరికా సంస్థ మైలాన్‌ లాబొరేటరీ్‌సకు విక్రయించా రు. మా టీవీని ఆరేడేళ్ల క్రితం తాము టేకోవర్‌ చేసినప్పుడు 170 మంది ఉద్యోగులుండగా ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య 500కు చేరిందని ప్రసాద్‌ చెప్పారు.

 పెంచి,పోషించి ఇచ్చేసాం

పెంచి,పోషించి ఇచ్చేసాం

ఒక వ్యాపారాన్ని టేకోవర్‌ చేసి, పెంచి, పోషించి ఒక స్థాయికి తీసుకువచ్చిన తర్వాత మరింత సమర్ధులైన వారికి విక్రయించడం వల్ల, సదురు వ్యాపారం మరింత ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఎమోషనల్ ఎటాచమెంట్

ఎమోషనల్ ఎటాచమెంట్

టీవీ చానళ్లను విక్రయిస్తూ, కంపెనీని మాత్రం అట్టేపెట్టుకోవడంపై ప్రశ్నించగా, కంపెనీతో తమకున్న ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ అందుకు కారణమని ప్రసాద్‌ చెప్పారు. ఈ డీల్‌ పూర్తయిన తర్వాత కొత్తగా మళ్లీ ఏం చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మొత్తం ప్రసారాల వ్యాల్యూ

మొత్తం ప్రసారాల వ్యాల్యూ

మీడియా మొగల్‌గా పేరున్న రూపర్డ్‌ మర్డోక్‌ ప్రమోట్‌ చేసిన స్టార్‌ టీవీ దేశీయ మార్కెట్‌లో దూకుడుగా విస్తరిస్తోంది. ప్రాంతీయ భాషా చానళ్ల కొనుగోలుతో నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకుంటున్నది. తెలుగులో ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ ప్రసారాల వ్యాపార విలువ 1800-2000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని స్టార్‌ సిఇఒ ఉదయ్‌శంకర్‌ చెప్పారు.

తీసేయం

తీసేయం

ఈ విభాగంలో మా టీవీ చానెళ్ల వాటా 27 శాతం ఉంది.. తెలుగులో ఉన్న అవకాశాలకు, ఇప్పుడున్న వృద్ధిరేటుకు మధ్య అంతరం ఉందనీ గట్టిగా ప్రయత్నిస్తే మరింత భారీ స్థాయిలో వృద్ధికి అవకాశం ఉందని స్టార్‌ టీవీ సిఇఒ ఉదయ్‌ శంకర్‌ చెప్పారు. మా టీవీలో అక్కినేని నాగార్జున నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల్లో కూడా ఎవరినీ తీసివేసే అవకాశం లేదని చెప్పారు.

కొత్తలోగో అవిష్కరణ

కొత్తలోగో అవిష్కరణ

మరో ప్రక్క ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లే సదావకాశం లభించిందన్నారు సినీ నటుడు చిరంజీవి. త్వరలో ‘స్టార్‌ మా' టెలివిజన్‌ ఛానల్‌లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం టెలివిజన్‌ కొత్త లోగోను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి సంబంధించిన విషయాలను చిరంజీవి మీడియాతో పంచుకున్నారు.

నాగ్ నుంచి ఆహ్వానం

నాగ్ నుంచి ఆహ్వానం

చిరంజీవి మాట్లాడుతూ..‘సినిమాలే నా ప్రపంచం. వ్యాపారం చేయాలన్న ఆలోచనే లేదు. కానీ మాటీవీ ఏర్పాటు చేసే సమయంలో నా మిత్రుడు నాగార్జున నుంచి ఆహ్వానం అందింది. మధ్యలో ఆ బంధం దూరమైందని అనుకున్నా. మళ్లీ ఇప్పుడు ఈ కార్యక్రమంతో అది కలిసింది.

 భావోద్వేగాల షో

భావోద్వేగాల షో

ప్రజల స్థితిగతులు అర్థం చేసుకోవడానికి ఈ షో ఎంతో ఉపయోగపడింది. ఇందులో మానవతాదృక్పథం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఓ భావోద్వేగల మధ్య జరిగే షో. ఓ ఎపిసోడ్‌లో ఓ మహిళ ఆమె అనుకున్న నగదును గెలవలేకపోయింది. ఆమె కష్టాల నుంచి బయటపడేందుకు నా చేతనైన సాయం చేశా.. ప్రతీ క్షణం ఆస్వాదించా. మొత్తం 60 ఎపిసోడ్‌లను రూపొందించాం' అని వివరించారు చిరంజీవి.

విమర్శలు వారి అభిప్రాయం

విమర్శలు వారి అభిప్రాయం

ఎవరైనా మిమ్మల్ని కించ పరిస్తే వాటిని పట్టించుకోకుండా విజయంపైనే దృష్టి పెట్టాలని చిరంజీవి అన్నారు. ‘అపజయాలు వస్తుంటాయి. పోతుంటాయి. వాటిని అంగీకరించాలి. ఇదే ఫిలాసఫీ. ఎవరైనా పొగిడితే సంతోషమే. కానీ ఎవరైనా నాపై విమర్శలు చేస్తే అది వారి అభిప్రాయం, వారిష్టం అని వదిలేస్తా అన్నారు చిరంజీవి.

అదే నా తరకమంత్రం

అదే నా తరకమంత్రం

ఏ విషయంలోనైనా పనిచేయడానికి సర్వశక్తులు ఒడ్డుతా. కానీ అది పనిలో ఉన్నంతసేపే. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంతో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తా. అదే నన్ను మరుసటి రోజుకి మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇదే నా తారక మంత్రం' అని చెప్పారు చిరు.

 రాధిక,సుహాసినిలు

రాధిక,సుహాసినిలు

‘మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సెలబ్రిటీలు వస్తారని చిరంజీవి పేర్కొన్నారు. నాగార్జున, వెంకటేష్‌, రాధిక, సుహాసినిలు వచ్చేందుకు సముఖత వ్యక్తం చేశారని తెలిపారు. బాలకృష్ణ కూడా వస్తారా అన్న ప్రశ్నకు ‘ఆయన నాకు మంచి మిత్రుడు. ఆహ్వానిస్తాం. తప్పకుండా వస్తారని ఆశిస్తున్నా' అంటూ సమాధానమిచ్చారు. ఇటీవలే ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని బిగ్‌ బి అమితాబ్‌ అభినందనలు తెలియజేశారని చిరంజీవి అన్నారు.

English summary
A new logo of MAA TV channel is being unveiled by none other than Chiranjeevi who is one of the directors of MAA. From now, MAA becomes Star MAA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu