»   » శివగామి అందుకే దక్కింది.. రమ్యకృష్ణపై మధుబాల సెన్సేషనల్ కామెంట్స్

శివగామి అందుకే దక్కింది.. రమ్యకృష్ణపై మధుబాల సెన్సేషనల్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  దక్షిణాది సినీ నటి మధుబాల మరోసారి శివగామి పాత్రను మీడియాలోకి లాక్కొచ్చింది. ఓ ప్రాజెక్ట్ ఫైనల్ కావడానికి ముందు ఓ పాత్రను పలువురికి ఆఫర్ చేస్తారని, తమ అంచనాలకు లోబడి ఉన్నవారికి ఆ పాత్రను ఇవ్వజూపుతారనే అభిప్రాయాన్ని మధుబాల వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన బాహుబలి చిత్రంలోని శివగామి పాత్రను తొలుత శ్రీదేవికి ఆఫర్ చేయగా.. ఆమె పెట్టిన డిమాండ్లకు భయపడి ఆ పాత్రను రమ్యకృష్ణకు ఇచ్చామని దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి శివగామి పాత్రపై మధుబాల వ్యాఖ్యలు చేయడం మరోసారి ప్రాధాన్యత సంతరించుకొన్నది.

  అందుకే ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది..

  అందుకే ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది..

  శివగామి పాత్రను పది మందికి ఆఫర్ చేసి ఉండవచ్చేమో. కానీ అది ప్రధాన విషయం కాదు. ఆ పాత్ర రమ్యకృష్ణ చేయాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఆమె ఆ పాత్ర దక్కింది. శివగామి పాత్రకు మరెవరూ సరిపోరనే విధంగా ఆ పాత్రకు రమ్యకృష్ణ న్యాయం చేసింది. ఆమె కోసమే ఆ పాత్ర పుట్టిందా అనే అభిప్రాయాన్ని మధుబాల వ్యక్తం చేసింది.

  పాత్రను ఆఫర్ చేయడం సర్వసాధారణం

  పాత్రను ఆఫర్ చేయడం సర్వసాధారణం

  సినిమా పరిశ్రమలో ఓ పాత్ర కోసం పలువురిని సంప్రదించడం చాలా సర్వసాధారణం. ఓ పాత్రను ఒప్పుకొంటారు. మరికొందరు ఒప్పుకోరు. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత బాగా న్యాయం చేకూర్చారు అనేదే పట్టించుకోవాల్సిన అంశం అని ఆమె అన్నారు.

  ఆ పాత్రకు ముందు వేరొకరిని అనుకొన్నారంట..

  ఆ పాత్రకు ముందు వేరొకరిని అనుకొన్నారంట..

  1991లో పూల్ ఔర్ కాంటే సినిమాతో నేను సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాను. ఆ పాత్రకు ముందు వేరెకరిని అనుకొన్నారట. మరికొంత మందికి ఆడిషన్ నిర్వహించారనే విషయం ఆ తర్వాత తెలిసింది. నాకు ఆ పాత్రను పోషించే అవకాశం దక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది అని మధుబాల అన్నారు.

  శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా

  శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా

  బాహుబలి సినిమాలో శివగామి పాత్రను రమ్యకృష్ణ అద్భుతంగా పోషించింది. ఎలాంటి పాత్రనైనా ఆసక్తికరంగా మలిచే టాలెంట్ ఆమెకు ఉంది. రమ్యకృష్ణ నాకు క్లోజ్ ఫ్రెండ్ అని పొగడటం లేదు. ఏ పాత్రకైనా న్యాయం చేసే సత్తా ఆమెకే సొంతం అని మధుబాల పేర్కొన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అల్లరిప్రియుడు చిత్రంలో రమ్యకృష్ణ, మధుబాల కలిసి నటించిన సంగతి తెలిసిందే.

  బుల్లితెరపై శివగామిగా మధుబాల

  బుల్లితెరపై శివగామిగా మధుబాల

  బాహుబలి సినిమా కథ ఆధారంగా టీవీలో ప్రసారమవుతున్న ఆరంభ్ సీరియల్‌లో మధుబాల శివగామి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రను పోషించామని ఆఫర్ వచ్చినప్పుడు రమ్యకృష్ణతో మాట్లాడాను. అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకొని నవ్వుకున్నాం. రమ్యకృష్ణ పోషించిన పాత్రను చేయాల్సి రావడం సంతోషం కలిగించింది. నా పాత్రకు, రమ్య పాత్రను పోల్చి చూడకూడదు అని మధుబాల పేర్కొన్నది.

  English summary
  Roja actor Madhubala says it’s common for a role to be offered to many actors before an artist is finalised for the project, adds that not Sridevi but her friend Ramya Krishnan was destined to be Sivagami in Baahubali. All praise for Ramya, Madhoo says that she is a brilliant actor who can turn any character interesting. I am not saying this because she is a friend, but it goes without saying that Ramya is a stupendous actor'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more