For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫామ్‌లో లేకున్నా ఊహించని ఆఫర్

  |

  బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ రియాలిటీ షో దాదాపు ఐదేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు భారీ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఉత్సాహంతోనే వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పటికే ఐదింటిని పూర్తి చేసుకున్న ఈ షో.. త్వరలోనే ఆరో సీజన్‌తో రాబోతుంది. ఇక, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు లీక్ అవుతున్నాయి. తాజాగా మరో సెలెబ్రిటీ వివరాలు బయటకొచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  సూపర్ హిట్... దానిపై ఆసక్తి

  సూపర్ హిట్... దానిపై ఆసక్తి

  ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే బిగ్ బాస్ భారీ స్థాయిలో రేటింగ్‌ను రాబడుతోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. దీంతో రెండు మూడు నెలల నుంచే దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

  Vikrant Rona Twitter Review: సుదీప్ మూవీకి అలాంటి టాక్.. కేజీఎఫ్‌ను మించేలా.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

  అప్పటి నుంచే.. ప్రోమో డన్

  అప్పటి నుంచే.. ప్రోమో డన్

  భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతుందని ఎప్పుడో ఓ న్యూస్ బయటకు వచ్చేసింది. ఇక, ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

  షార్ట్ లిస్ట్ రెడీ.. కామన్ మ్యాన్

  షార్ట్ లిస్ట్ రెడీ.. కామన్ మ్యాన్

  సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు ఎప్పుడో గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో ఒక రౌండ్‌ను కూడా పూర్తి చేసి షార్ట్ లిస్టును బిగ్ బాస్ టీమ్ రెడీ చేసిందనే టాక్ బాగానే వినిపిస్తోంది. అంతేకాదు, ఇప్పటికే ఈ సీజన్ కోసం ఒక కామన్ మ్యాన్‌ను కూడా ఎంపిక చేసేశారని ప్రచారం జరుగుతోంది.

  Eesha Rebba అందాల అరాచకం: అబ్బో ఆమె ఫోజులు చూస్తే!

  సెట్ వర్కుతో.. కొత్త కాన్సెప్ట్

  సెట్ వర్కుతో.. కొత్త కాన్సెప్ట్

  బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు పనులను వేగవంతం చేసేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కంటెస్టెంట్లను ఉంచేందుకు ఏర్పాటు చేసే సెట్ వర్క్‌ను కూడా చాలా వరకూ చేసుకుంటూ వచ్చారు. ఇది గతంలో చూడని విధంగా అత్యంత సుందరంగా ఉండబోతుందట. ఇక, ఈ సీజన్‌లో సరికొత్త కాన్సెప్టును తీసుకు వస్తున్నట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  ఎన్నో పేర్లు లీక్.. హైలైట్‌గా

  ఎన్నో పేర్లు లీక్.. హైలైట్‌గా

  మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి.. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, అసలు ఇందులో ఎవరు పాల్గొంటారన్న దానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. కానీ, ఈ పేర్లు ఉన్న వాళ్లు మాత్రం తెగ హైలైట్ అవుతున్నారు.

  దారుణమైన ఫొటోలు వదిలిన రష్మిక: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా!

  షోలోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్

  షోలోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్


  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, వాళ్ల సైడ్ నుంచి మాత్రం అస్సలు క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కంటెస్టెంట్ పేరు లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టు మాస్టర్ భరత్ కంటెస్టెంట్‌గా వస్తున్నాడట.

  ఫామ్‌లో లేకున్నా అవకాశం

  ఫామ్‌లో లేకున్నా అవకాశం


  చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయం అయిన భరత్.. ఎన్నో సినిమాల్లో అదిరిపోయే పాత్రలతో అలరించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కొన్నేళ్ల క్రితమే 'ABCD' అనే సినిమాలో కీలక పాత్రను పోషించాడు. అలా అప్పుడప్పుడూ తెరపై మెరుస్తున్నా అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ అతడికి భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu Team Planing for 6th Season From September. Recently Bigg Boss Team Approached Master Bharath For This Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X