»   » ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీ షో (వీడియో)

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీ షో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సూపర్ హిట్ హిందీ టీవీ కార్యక్రమం 'కౌన్ బనేగా కరోడ్ పతి' తెలుగు వెర్షన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు కార్యక్రమానికి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే పేరుతో సాగే ఈ కార్యక్రమం ఏఫ్రిల్ 18వ తేదీ నుండి మాటీవీలో మొదలు కానుంది.

హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో 'మీలో కోటీశ్వరులు ఎవరు' కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ద్వారా....నాగార్జున మంచి ఫ్యాన్సీ ఎమౌంట్ ని రెమ్యునేషన్ గా వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. మాటీవిలో తనకు షేర్స్ ఉన్నా రెమ్యునేషన్ విషయంలో రాజీ పడలేదని తెలుస్తోంది. నలభై ఎపిసోడ్స్ కి గానూ మూడు కోట్లు వరకూ తీసుకుంటున్నారని టీవి వర్గాల సమాచారం.

Meelo Evaru Koteeswarudu

మరో వైపు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా సినిమాలు నిర్మించడంతో పాటు....పలు తెలుగు సీరియల్స్‌ను కూడా నిర్మిస్తున్నారు. సీరియల్స్ నిర్మాణంలో మంచి లాభాలు ఉండటంతో నాగార్జున ఈ రంగంలోకి దిగారు. "పసుపు కుంకుమ'' "పుట్టింటి పట్టుచీర'' "శశిరేఖా పరిచయం'' వంటి సీరియల్ష్ ఆయన నిర్మిస్తున్నారు.

<center><iframe width="100%" height="390" src="//www.youtube.com/embed/ZhjWjHlRJX0" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Watch the promo of Akkineni Nagarjuna's Meelo everu koteeswarudu promo.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu