For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాడు పెద్ద తప్పు చేస్తున్నాడు: అవినాష్ క్యారెక్టర్‌పై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

  |

  జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒకడు. కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేసిన అతడు.. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా క్రేజ్‌ను సాంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు.. అవినాష్ క్యారెక్టర్‌ గురించి కొన్ని రహస్యాలు లీక్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

  జబర్ధస్త్ క్రేజ్‌తో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ

  జబర్ధస్త్ క్రేజ్‌తో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ

  జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యాడు అవినాష్. అంతేకాదు, అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో టీమ్ లీడర్‌గానూ ప్రమోషన్ పొందాడు. దీని ద్వారా వచ్చిన క్రేజ్‌తోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనను తాను జోకర్‌గా అభివర్ణించుకుంటూ హౌస్‌ లోపలికి ప్రవేశించాడీ జబర్ధస్త్ కమెడియన్.

  తన మార్క్ చూపిస్తున్న అవినాష్

  తన మార్క్ చూపిస్తున్న అవినాష్

  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే తనలోని టాలెంట్‌ను బయటకు తీసుకొస్తున్నాడు అవినాష్. తరచూ ఏదో రకమైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్నాడు. ఎదుటి కంటెస్టెంట్లపైనా కామెంట్లు చేస్తూ సరదాగా గడుపుతున్నాడు. వీకెండ్లలో రెచ్చిపోయి యాక్టింగ్ చేస్తున్న అవినాష్.. బిగ్ బాస్‌లోని కంటెస్టెంట్లలో బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకుంటున్నాడు.

   లవ్ ట్రాకుతో మరింత హాట్ టాపిక్

  లవ్ ట్రాకుతో మరింత హాట్ టాపిక్

  నాలుగో సీజన్‌లో లవ్ ట్రాకులు ఎంతగానో హైలైట్ అవుతోన్న విషయం తెలిసిందే. అందులో అవినాష్ - ఆరియానా జంట కూడా ఒకటి. ఆమెను పడేయడానికి ఈ జబర్ధస్త్ కమెడియన్ చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి. అలాగే, ఒకరిని ఒకరు పొగుడుకుంటూ, మద్దతు తెలుపుకుంటూ ఈ ఇద్దరూ సాగిపోతున్నారు. టాస్కులు సైతం కలిసే ఆడుతున్నారు.

  ఆ విషయంలో మాత్రం విమర్శలు

  ఆ విషయంలో మాత్రం విమర్శలు

  వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. అతడు ప్రవేశించగానే ఫైనల్ -5 మెంబర్లలో చోటు దక్కించుకుంటాడన్న టాక్ బాగా వినిపించింది. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఊహించని విధంగా అతడి ఆట తీరుతో విమర్శలు వస్తున్నాయి. అవినాష్ ఎక్కువగా సింపతీ గేమ్ ఆడుతున్నాడని, నామినేషన్‌లో ఉంటే తట్టుకోలేకపోతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.

  అవినాష్ ఆటపై నాగబాబు స్పందన

  అవినాష్ ఆటపై నాగబాబు స్పందన

  బిగ్ బాస్ షోలో అవినాష్ ఆడుతోన్న ఆట విషయంలో పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్ధస్త్‌లో అతడిని దగ్గరుండి చూసిన మెగా బ్రదర్ నాగబాబు.. దీనిపై స్పందించారు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియో రిలీజ్ చేసిన ఆయన.. బిగ్ బాస్‌లో అవినాష్ ఆటతీరుతో పాటు అతడి క్యారెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  Divi Vadthya Pic Goes Viral In Social Media
  తప్పు చేశాడని సెన్సేషనల్ కామెంట్స్

  తప్పు చేశాడని సెన్సేషనల్ కామెంట్స్

  అవినాష్ గురించి మాట్లాడుతూ.. ‘అవినాష్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే వాడు కొన్ని తప్పులు చేస్తున్నాడు. నిజానికి వాడు ఏడ్చే రకం కాదు. కానీ బిగ్ బాస్‌లో ఏడిస్తే తేడాగా అనిపిస్తుంది. అలాంటి గేమ్ ఆడితే వాడు నెగ్గుకురావడం కష్టం అవుతుంది' అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే పరోక్షంగా అవినాష్ సింపతీ గేమ్ ఆడుతున్నాడని అభిప్రాయపడ్డారాయన.

  English summary
  He acts mainly in supporting roles and villain roles, though he has also played the lead role in some films. He has acted in 143, Anji, Shock, Sri Ramadasu, Chandamama and Orange. He has produced several films with his brothers, Chiranjeevi and Pawan Kalyan under Anjana Productions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X