»   » చిరంజీవి గురించిన ఈ న్యూస్ మీరు అస్సలు నమ్మలేరు

చిరంజీవి గురించిన ఈ న్యూస్ మీరు అస్సలు నమ్మలేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి మేము చెప్పబోయే న్యూస్ మీరు అస్సలు నమ్మలేరు. ఎందుకంటే ఆయన ఓ టీవీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ షో మరేదో కాదు. నాగార్జున వ్యాఖ్యాతగా చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. అమితాబ్ చేసిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోకు అనుకరణగా వచ్చిన ఈ గేమ్ షోను మొదటి మూడు సీజన్లలో అక్కినేని నాగార్జున లీడ్ చేశారు.

ఇక నాలుగవ సీజన్ ను మెగాస్టార్ లీడ్ చేయనున్నారు. ఈ షో 12 డిసెంబర్ నుండి ప్రసారం కానుంది. దీంతో మెగా అభిమానులంతా చిరంజీవిని ఎప్పుడెప్పుడు బుల్లి తెర మీద చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మాటీవీ యాజమాన్యం కూడా చిరంజీవి రాకతో షో మరింతగా జనాల్లోకి దూసుకు వెళ్లటం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గతంలో నాగార్జున, చిరంజీవి ఇద్దరూ మా టీవీ ఛానల్ లో స్టాక్ హోల్డర్స్ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి హీరో గా 150వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఖైదీ నంబర్‌ 150' అనే పేరును ఖరారు చేశారు. నిర్మాత రామ్‌చరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Megastar Chiranjeevi to host most popular TV show

కొణెదల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 'ఖైదీ నంబర్‌ 150'కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలుత ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అని ప్రచారం జరిగిన చివరకు 'ఖైదీ నంబర్‌ 150'కే చిత్ర బృందం పచ్చజెండా వూపింది.

తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 'ఖైదీ', విజయబాపినీడు దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 786' చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Chiranjeevi will be making his debut on the small screen. Latest update reveals that Chiranjeevi will host the fourth season of the cash-rich Meelo Evaru Koteswarudu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu