మరోసారి అడ్డంగా దొరికిపోయిన సోహెల్, మెహబూబ్: ఆధారాలు బయటకు రావడంతో బుక్కైపోయారు

బిగ్ బాస్ నాలుగో సీజన్ గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో పూర్తయింది. ఇందులో అభిజీత్ ప్రేక్షకుల ఆదరణతో విజేతగా నిలిచాడు. అలాగే, యాంగ్రీ యంగ్ మ్యాన్ అఖిల్ సార్థక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. అంతకు ముందు మెహబూబ్, సయ్యద్ సోహెల్ రియాన్ మోసం చేశారంటూ ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇవ్వబోయారీ ఇద్దరు. ఈ క్రమంలోనే ఓ విషయాన్ని గురించి మాట్లాడుతూ మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. దీంతో వీళ్లు చీట్ చేసింది నిజమేనన్న టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు మీకోసం!

రూ. 25 లక్షలు తీసుకున్న సోహెల్

రూ. 25 లక్షలు తీసుకున్న సోహెల్


గ్రాండ్ ఫినాలేలో ముందుగా టాప్ -5 నుంచి ఇద్దరు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మిగిలారు. వీళ్లకు బిగ్ బాస్ రూ. 20 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. దీనికి ఎవరూ ఒప్పుకోకపోవడంతో మరో ఐదు పెంచి రూ. 25 లక్షలు చేశారు. నాగార్జున ప్రకటించిన ఈ ఆఫర్‌కు సోహెల్ టెంప్ట్ అయి బయటకు వచ్చేశాడు.

బయటకు వచ్చిన చీటింగ్ వీడియో

బయటకు వచ్చిన చీటింగ్ వీడియో

రీయూనియన్ పార్టీ కోసం మెహబూబ్ హౌస్‌లోకి వెళ్లాడు. లోపల అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సోహెల్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకో అని సైగలు చేశాడతను. అప్పుడే మూడు వేళ్లు కూడా చూపించాడు. అంటే మూడో స్థానంలో ఉన్నావు.. ఆఫర్‌కు ఒప్పుకో అన్నాడని ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో సోహెల్, మెహబూబ్ మోసం చేశారని ప్రచారం జరుగుతోంది.

అభిజీత్ మనీ కట్.. ఫ్యాన్స్ ఆగ్రహం

అభిజీత్ మనీ కట్.. ఫ్యాన్స్ ఆగ్రహం

గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ప్రకారం రూ. 25 లక్షలు తీసుకున్నాడు సయ్యద్ సోహెల్ రియాన్. దీంతో విన్నర్ అయిన అభిజీత్ ప్రైజ్ మనీ నుంచి రూ. 25 లక్షలు కట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సోహెల్ మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని అభిజీత్ ఫ్యాన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. మెహబూబ్‌తో పాటు అతడినీ చీటర్ చీటర్ అంటూ గేలి చేస్తున్నారు.

సోహెల్‌, మెహబూబ్ లైవ్‌లో క్లారిటీ

సోహెల్‌, మెహబూబ్ లైవ్‌లో క్లారిటీ

అభిజీత్ ఈ వీడియో గురించి హుందాగా స్పందించి స్టార్ మా వాళ్లకే వదిలేశాడు. అయితే, అతడి ఫ్యాన్స్ మాత్రం ఈ వ్యవహారంపై అస్సలు తగ్గడం లేదు. దీంతో సోహెల్ మీడియా వేదికగా ఈ గొడవలను ఆపమని అభిజీత్‌కు రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికీ ఆ కామెంట్లు ఆగకపోవడంతో తాజాగా సోహెల్‌, మెహబూబ్ సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించి క్లారిటీ ఇవ్వబోయారు.

మరోసారి అడ్డంగా దొరికిపోయారుగా

మరోసారి అడ్డంగా దొరికిపోయారుగా


సోహెల్ మాట్లాడుతూ.. ‘వాడు చెప్పింది డబ్బుల కోసం కాదు. అదే నిజమైతే రూ. 10 లక్షలో లేకపోతే రూ. 20 లక్షలో తీసుకునే వాడిని కదా' అని అన్నాడు. ఆ వెంటనే మెహబూబ్ స్పందిస్తూ.. ‘ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల గురించే ఆ సైగలు చేశాను. సోహెల్ గాడికి 300K అయ్యారని చూపించాను. అంతే తప్ప వాళ్లు ఏ పొజిషన్‌లో ఉన్నారో నాకేం తెలుసు' అంటూ మళ్లీ బుక్కయ్యారు.

ఆధారాలు బయటకు రావడంతో బుక్

ఆధారాలు బయటకు రావడంతో బుక్

మెహబూబ్ చెప్పింది నిజమే అనుకుంటే.. ఇప్పుడు సోహెల్ ఇన్‌స్టా ఫాలోవర్లు 487K ఉన్నారు. కాబట్టి ఇది పచ్చి అబద్ధం అని అభిజీత్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇది మాత్రమే కాదు.. తాజాగా జరిగిన లైవ్ చాట్‌లో సోహెల్ చెప్పేదానికి, మెహబూబ్ వివరించే దానికి అస్సలు పొంతన లేదు. దీంతో వీళ్లిద్దరూ చీట్ చేసింది నిజమేనేమో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X