»   » మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?

మీరూహించలేరు: ఖతర్నాక్ కామెడీ షో... కమెడియన్లకి అసలెంత ముడుతోందో తెలుసా..?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  జబర్దస్త్... ఖతర్నాక్ కామెడీ షో..., ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో తెలియని తెలుగు వాళ్ళెవరూ ఉండరేమో. ఇప్పటివరకూ తెలుగు చానెళ్ళలో వచ్చే కామెడీ షోలలోనే కాదు, రియాలిటీ, గేం, డాన్స్ షోలలో ఏదీ కూడా ఇంత పాపులర్ అవలేదేమో. బూతు కాంటెంట్ ఎక్కువ.., ఆడవాళ్ళను కించ పరుస్తున్నారూ అనుకుంటూ కూడా షో సమయానికి టీవీల ముందు కూచుంటున్నారు జనాలు....

  ఇక ఈ షో లో పాల్గొంటున్న కమెడియన్లకైతే సినిమాల్లో కూడా రానంత పారితోషికం, పేరూ వచ్చి పడ్డాయి. ఒక్క పెర్ఫార్మెన్స్ కి గిఫ్ట్ గా వచ్చే డబ్బు కేవలం కాంప్లిమెంతరీ మాత్రమే... వాళ్ళకి అసలు వచ్చే రెమ్యున రేషన్ వేరే ఉంది... ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలిస్తే ఒక్క సారి నోరు వెళ్లబెట్టేయతమే... వారానికి ఒక షో.. నెలకి కనీసం నాలుగు షోలు... ఒక్కో షోకి లక్షల్లో డబ్బు.... వాళ్ళు పంచే నవ్వులకి ఒక రకంగా ఆ డబ్బూ తక్కువే అనిపిస్తుంది గానీ... వెండి తెర పారితోషికానికే మాత్రం తగ్గటం లేదా మొత్తాలు. ఒక సారి ఒక్కో కమెడియన్ కి ఇచ్చే పారితోషికం ఎంతో ఒకసారి ఓ లుక్కేయండి...

  లైఫ్ ఇచ్చింది:

  లైఫ్ ఇచ్చింది:

  జబర్దస్త్... ఖతర్నాక్ కామెడీ షో చాలామంది కమేడియన్లకి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ మద్య వచ్చే అన్ని సినిమాల్లోనూ జబర్దస్త్ టీం నుంచి ఖచ్చితంగా కొందరు కమెడియన్లు ఉంటూనే ఉన్నారు.

  రేష్మి:

  రేష్మి:

  ఈ షో తో పైకి వచ్చిన హాట్ యాంకర్ల సంగతి సరే సరి. రేష్మికి అదివరకే సినిమాల్ల్లో చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క షో తో వచ్చేసింది.

  అప్పట్లో :

  అప్పట్లో :

  దేవా కట్టా తీసిన ప్రస్తానం లాంటి సినిమాలో కీలకమైన పాత్ర చేసిన రష్మి ని పట్టించుకున్న వాళ్ళే లేరు అప్పట్లో కానీ జబర్దస్త్ ఈ అమ్మడిని అమాంతం ఒక రేంజ్ కి తీస్కెళ్ళింది...

  నాగార్జున పక్కన:

  నాగార్జున పక్కన:

  అనసూయ కూడా అదివరకు చాలా ప్రోగ్రాములకి యాంకర్ గా చేసినా రాని గుర్తింపు ఈ షోతో వచ్చింది. వెండితెర మీద నాగార్జున పక్కన స్టెప్పులేసే దాకా తీసుకెళ్ళింది...

  ఫాలోయింగ్:

  ఫాలోయింగ్:

  ప్రతీ కమేడియన్ ఇప్పుడు సొంతంగా కొన్ని ప్రోగ్రాం లకి హోస్ట్ లుగా కూడా చేస్తున్నారు. జబర్దస్త్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ ఈ రకంగా కూడా పని చేస్తోంది.

  ఒక్కో షోకి లక్షల్లో డబ్బు:

  ఒక్కో షోకి లక్షల్లో డబ్బు:

  వారానికి ఒక షో.. నెలకి కనీసం నాలుగు షోలు... ఒక్కో షోకి లక్షల్లో డబ్బు.... వాళ్ళు పంచే నవ్వులకి ఒక రకంగా ఆ డబ్బూ తక్కువే అనిపిస్తుంది గానీ... వెండి తెర పారితోషికానికే మాత్రం తగ్గటం లేదా మొత్తాలు. ఒక సారి ఒక్కో కమెడియన్ కి ఇచ్చే పారితోషికం ఎంతో తెలుసా..?

  చమ్మక్ చంద్ర :

  చమ్మక్ చంద్ర :

  ఒకరకంగా జబర్దస్త్ స్టార్ కమేడియన్ అయిన చంద్ర కి ఒక్క పెర్ఫార్మెన్స్ కి గానూ 2.5 - 3 లక్షలు ముడుతోంది.

  సుధీర్ :

  సుధీర్ :

  చిన్న చితక పాత్రలతో అసలు పెరౌకూడా తెలియకుండా ఉన్న సుదీర్ సారీ సుడిగాలి సుధీర్ 2.5 - 3 లక్షలు అందుకుంటున్నాడు.

  అభి:

  అభి:

  సాఫ్ట్ వేర్ ఉధ్యోగి అయి ఉండికూడా నతన మీద ఇష్టం తో ఈ రంగం లోకి వచ్చిన అదిరే అభి టీం లీడర్ గా 2.5 - 3 లక్షలు తీసుకుంటున్నాడు.

  శంకర్ :

  శంకర్ :

  సినిమాలలో కూడా మంచి కమేడియన్ గా రాణించే షకలక శంకర్ 2.5 - 3 లక్షలు అందుకుంటున్నాడు. ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ లో అవకాసం వచ్చినా... కొన్ని చిలిపి చేష్టలతో పవన్ తో వార్నింగ్ కూడా ఇప్పించుకున్నాడని వార్తలొచ్చాయ్.

  వేణు :

  వేణు :

  టిల్లు గా ఇదివరకే వెండితెర మీద మనకు పరిచయం ఉన్న వేణు జబర్దస్త్ తర్వాత సినిమా అవకాశాలను వదులుకొని మరీ ఇక్కడే ఎక్కువ ఉంటున్నాడు. ఈయన పారితోషికం 2.5 - 3 లక్షలు

  రాం ప్రసాద్ :

  రాం ప్రసాద్ :

  ఆటో పంచ్ ల రాం ప్రసాద్ జబర్దస్త్ తోనే తన కెరీర్ మొదలు పెట్టాడు. టీం లీడర్ కాకున్నా తనకున్న కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ లో కీలకంగా మారాడు.ఇతనికి అందేది 1 - 1.8 లక్షలు...

  శ్రీను :

  శ్రీను :

  గెటప్ సీను గా జబర్దస్త్ కమల్ హసన్ ని అని కామెడీగా చెప్పుకునే శ్రీను కి 1 - 1.8 లక్షలు

  అందరికీ :

  అందరికీ :

  రవి,ఫణి, జీవన్, రాకేష్, సన్నీ, అప్పారావు, సుధాకర్, రామూ., ఆర్పీ ఇలా అందరికీ ఒకటినుంచీ ఒకటిన్నరదాకా ఎవరి పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్లకి అందుతున్నాయి.

  విరగబడి నవ్వుకుంటున్నారు:

  విరగబడి నవ్వుకుంటున్నారు:

  బూతు కాంటెంట్ ఎక్కువ.., ఆడవాళ్ళను కించ పరుస్తున్నారూ అనుకుంటూ కూడా షో సమయానికి టీవీల ముందు కూచుని విరగబడి నవ్వుకుంటున్నారు జనాలు. ఇక జడ్జీలకూ ఒక్కో షోకి బాగానె గిడుతోందట...

  English summary
  Mallemaala Entertainments are the makers for this comedy show and they will offer mind-blowing remuneration to ‘Jabardasth’ Comedians.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more