Just In
- 7 min ago
చివరి నిమిషంలో లెక్కలు మార్చిన వకీల్ సాబ్.. ఒక్కసారిగా పెరిగిన రేటు.. మంచి. లాభమే!
- 55 min ago
బాక్సాఫీస్ ఫైట్: అల్లుడు అదుర్స్ vs రెడ్.. థియేటర్స్ కోసం గొడవలు.. చివరికి ఎంత రాబట్టారంటే?
- 1 hr ago
RED Movie Day 1 Collections: రికార్డు స్థాయిలో వసూల్ చేసిన రామ్.. ఫస్ట్ డే ఎంత రాబట్టాడంటే!
- 1 hr ago
అభిజీత్‌కు రోహిత్ శర్మ కానుక: ఏకంగా ఆస్ట్రేలియా నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన టీమిండియా క్రికెటర్!
Don't Miss!
- News
పార్లమెంట్ భేటీకి ముహూర్తం ఫిక్స్: బడ్జెట్ ఎప్పుడంటే?: పేపర్ లెస్..నిర్మలమ్మ స్పెషాలిటీస్
- Finance
విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్‌పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
- Sports
బిగ్‌బాస్ విన్నర్ అభిజీత్‌కు రోహిత్ శర్మ గిఫ్ట్!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : అన్ని చింతలు మరిచిపోయి, ఈరోజు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలి...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లైవ్ చాట్‌లో మోనాల్ గజ్జర్‌కు ఊహించని షాక్: ఒకేసారి అంత మాట అనడంతో తట్టుకోలేక!
అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో టాలీవుడ్‌ను వదిలేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిందామె. ఆ హౌస్‌లో వ్యవహరించిన తీరుతో ఫుల్ పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఆఫర్లును కూడా అందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నిర్వహించిన లైవ్ చాట్‌లో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆ వివరాలు మీకోసం!

ముందు అతడితో.. తర్వాత ఇతడితో
ఇటీవల ప్రసారం అయిన నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. షో ఆరంభంలోనే అభిజీత్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అయిపోయింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ బాగా క్లోజ్ అయింది. దీంతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందన్న టాక్‌తో పాపులర్ అయింది. కొద్ది రోజులకు ఒక్కరితో ఫిక్స్ అవడంతో పాటు అతడి ప్రేమలో మునిగిపోయింది.

ఆట కంటే వాటినే ఫోకస్ చేయడంతో
మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌లో మిగిలిన వారితో పోలిస్తే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు. అందుకే చాలా టాస్కుల్లో ఆమె అంతగా ప్రదర్శన చేయలేదు. కానీ, ప్రేమ వ్యవహారంలో మాత్రం పర్‌ఫెక్ట్ అయింది. అఖిల్ సార్థక్‌తో లవ్ ట్రాక్ నడిపిన ఈ అమ్మడు.. బయటకు వచ్చే వరకూ అదే కంటిన్యూ చేసింది. హగ్గులు, ముద్దులు, రొమాన్స్‌తో రెచ్చిపోయింది. ఫలితంగా బాగా హైలైట్ అయింది.

ఫినాలేకు ముందు పెద్ద ఎదురుదెబ్బ
సరిగా ఆడడం లేదనో.. తమతో మంచిగా ఉండడం లేదనో చాలా మంది మోనాల్ గజ్జర్‌ను నామినేట్ చేసేవారు. దీంతో ఆమె చాలా సార్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. అయినప్పటికీ సేఫ్ అవుతూనే వచ్చింది. దీంతో ఆమె గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా టాప్-5లోకి చేరకుండానే మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిపోయింది.

హీరోయిన్‌పై ఆఫర్ల వర్షం... వరుసగా
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. గతంలో ఆఫర్లు దొరకక వెళ్లిపోయిన ఆమె.. ఇప్పుడు మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేసిన ఆమె.. ఓంకార్ నిర్వహిస్తున్న ‘డ్యాన్స్+' షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది.

లైవ్ చాట్‌లో ఆమెకు ఊహించని షాక్
తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు మోనాల్ గజ్జర్ చాలా రోజుల తర్వాత గుజరాత్ వెళ్లింది. ఎయిర్‌పోర్టు నుంచి అక్కడ దిగే వరకూ అప్‌డేట్స్ ఇచ్చింది. ఇక, అక్కడ అందరినీ కలిసిన అనంతరం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో లైవ్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే కొందరితో వీడియో చాట్ కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది.

ఫ్యాన్ ఒకేసారి అంత మాట అనడంతో
చాట్‌లో భాగంగా ఓ తెలుగు అమ్మాయి మాట్లాడుతూ.. ‘నేను నీకు పెద్ద ఫ్యాన్ దీదీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా నీలాగే ఎమోషనల్. కానీ, బిగ్ బాస్‌లో నువ్వు మానేసినట్లు.. నిన్ను ఆదర్శంగా తీసుకుని ఏడవడం తగ్గించుకుంటున్నా. నువ్వు ఎలిమినేట్ అయ్యాక అన్నం కూడా తినాలనిపించలేదు' అని చెప్పింది. దీంతో ఆమె అన్న మాటలకు మోనాల్ వెక్కి వెక్కి ఏడ్చేసింది.