Just In
- 9 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 10 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 11 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 12 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫైనల్ స్టేజ్‌లో మోనాల్ కన్నింగ్ ప్లాన్: ఆ కంటెస్టెంట్‌కు దగ్గరయ్యేందుకే ఇలా!
దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తూ.. ప్రతి భాషలోనూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అన్నింటి కంటే తెలుగులో ఈ షో ఎక్కువగా ప్రజాదరణను అందుకుంటూ దూసుకుపోతోంది. అందుకే మూడు సీజన్లు పూర్తి చేసి, నాలుగోది మొదలెట్టారు నిర్వహకులు. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ తుది అంకానికి చేరుకుంది. రెండు వారాల్లో ఫైనల్ ఎపిసోడ్ రాబోతుండడంతో ఆట రంజుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దూరమైన ఓ కంటెస్టెంట్‌కు దగ్గరయ్యేందుకు మోనాల్ గజ్జర్ ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ట్రైయాంగిల్ లవ్ ట్రాకుతో ఫేమస్
మోనాల్ గజ్జర్ తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి అడుగు పెట్టిన రోజు నుంచే అభిజీత్‌తో చనువుగా ఉంటూ హైలైట్ అయింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో వీళ్ల మధ్య ట్రైయాంగిల్ లవ్ నడుస్తుందంటూ ప్రచారం జరగడంతో ఫేమస్ అయింది.

అఖిల్‌కు ముద్దులు.. కిస్సులతో
రోజులు గడిచిన కొద్దీ మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్‌కు బాగా దగ్గరవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తన మనసులో A ఉన్నాడని నాగార్జునతోనే డైరెక్ట్‌గా చెప్పేసి షాకిచ్చింది. దీంతో ఆమె అఖిల్‌ను బాగా ఇష్టపడుతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత తరచూ కౌగిలించుకోవడం.. రొమాంటిక్‌గా మాట్లాడుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటి వాటితో మరింతగా హాట్ టాపిక్ అవుతోంది.

సొంతంగా ఆడి దూరం అయింది
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో దాదాపు రెండున్నర నెలల పాటు మోనాల్ గజ్జర్ అస్సలు టాస్కులు ఆడినట్లే కనిపించలేదు. ఈ కారణంగానే పలువురు కంటెస్టెంట్లు సైతం ఆమెను నామినేట్ చేశారు. కానీ, షో చివరి దశకు చేరుకున్న సమయంలో ఆటను ప్రారంభించిందామె. ఈ క్రమంలోనే సొంతంగా గేమ్ ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఫలితంగా అఖిల్‌కు దూరంగా జరుగుతోంది.

నామినేషన్స్‌లో అతడితో గొడవ
గత సోమవారం జరిగిన నామినేషన్ టాస్కులో మోనాల్ గజ్జర్ తనలోని ఫైర్ యాంగిల్ చూపించింది. అవినాష్, ఆరియానాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. అఖిల్ సార్థక్‌తోనూ గొడవకు దిగింది. అతడిని నామినేట్ చేసిందన్న కారణంతో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాతి రోజు కూడా ఈ గొడవ సర్ధుమనగలేదు. దీంతో మోనాల్.. అఖిల్‌కు సారీ కూడా చెప్పింది.

ఫినాలే టాస్కులో కన్నింగ్ ప్లాన్
ఇక, ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. మొదటి లెవెల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. బజర్ మోగిన సమయంలో ఎవరి దగ్గర తక్కువ పాట బాటిల్స్ ఉంటే వాళ్లు తప్పుకోవాలి. ఈ టాస్క్ సమయంలోనే మోనాల్ ఓ కన్నింగ్ ప్లాన్ చేసి ఆశ్చర్య పరిచింది.

ఆ కంటెస్టెంట్‌కు దగ్గరయ్యేందుకే
పాట బాటిళ్ల టాస్కులో మొదట అవినాష్, ఆ తర్వాత ఆరియానా ఓడిపోయారు. ఇక, మూడో బజర్ మోగిన సమయంలో అందరూ బాటిళ్లు లెక్కబెడుతున్నారు. అప్పుడు తాను ఓడిపోతానని గ్రహించిన మోనాల్.. తన దగ్గర ఉన్న బాటిల్ అఖిల్‌కు ఇవ్వాలనుకుంది. ఇదే విషయం అతడిని అడగగా ‘అందరి దగ్గరా 15 ఉన్నాయి. సో.. నాకు అవసరం లేదు' అని బదులిచ్చాడు.