Just In
Don't Miss!
- News
నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్
- Sports
మెరుపు రనౌట్.. జాంటీ రోడ్స్‌ని గుర్తుచేసిన పాకిస్థాన్ వికెట్ కీపర్!! వీడియో
- Finance
మార్కెట్ భారీ నష్టాలకు కారణాలివే! సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్
- Automobiles
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలిమినేటైన వెంటనే అఖిల్‌కు మోనాల్ షాక్: మనసులో ఉన్న A అంటే ఎవరో చెప్పేసింది!
మోనాల్ గజ్జర్.. తెలుగు ప్రేక్షకులకు ఈ మధ్య బాగా దగ్గరైన అమ్మాయి. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లిన తర్వాత ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అంతేకాదు, ఎలిమినేట్ అవుతుందనుకున్న చాలా సార్లు సేవ్ అయింది. దీంతో 14 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. తాజాగా ఎలిమినేట్ అయిన ఆమె... తన మనసులో ఉన్న A అంటే ఎవరో చెప్పేసింది. తద్వారా ప్రియుడు అఖిల్ సార్థక్‌కు కోలుకోలేని షాకిచ్చింది. ఆ సంగుతులేంటో చూద్దాం పదండి!

ఫస్ట్ అభిజీత్‌తో.. ఆ తర్వాత అఖిల్‌తో
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మోనాల్ గజ్జర్. ఎక్కువ సమయం అతడితోనే గడుపుతూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది. అయితే, ఊహించని విధంగా అతడిని దూరం చేసేసి.. అఖిల్ సార్థక్‌కు దగ్గరైంది. ఒకసారి అతడితో.. ఒకసారి ఇతడితో మాట్లాడుతూ హాట్ టాపిక్ అయిపోయింది.

నా మనసులో A ఉన్నాడని చెప్పింది
ఒకానొక సందర్భంలో హోస్ట్ అక్కినేని నాగార్జునతో తన మనసులో A ఉన్నాడని చెప్పింది మోనాల్ గజ్జర్. ఆ సమయంలో ఆ లెటర్‌తో బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్, అభిజీత్, అవినాష్ ఉన్నారు. వీరిలో ఆమె ప్రేమించేది అఖిల్‌నే అన్న విషయం అందరికీ అప్పుడే అర్థం అయింది. దీంతో వాళ్లిద్దరి మధ్య బంధం కూడా బాగా బలపడింది. అప్పటి నుంచి మరింతగా క్లోజ్ అయ్యారు.

అతడితో రొమాన్స్.. ముద్దులతో రచ్చ
రోజులు గడిచిన కొద్దీ అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ మధ్య లవ్ మరింత ఎక్కువైంది. తరచూ కలిసి మాట్లాడుకోవడం.. హగ్గులు ఇచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. ఒకరిని ఒకరు పొగుడుకోవడం వంటివి చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. అంతేకాదు, టాస్కులు సైతం ఒకరి కోసం ఒకరు ఆడుతుండేవారు. నామినేషన్స్‌లో సైతం సేఫ్ గేమ్ ప్లే చేస్తుండేవారు.

అనూహ్యంగా ఎలిమినేట్ అయిందిగా
మోనాల్ గజ్జర్ షో ఆరంభంలో అస్సలు గేమ్ ఆడేది కాదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కారణంగానే ఆమెను పలుమార్లు నామినేట్ చేశారు ఇంటి సభ్యులు. దీంతో చాలా సార్లు ఆమె ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా సేఫ్ అవుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఫినాలే ఎపిసోడ్‌కు ముందు మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

అఖిల్ సార్థక్‌కు మోనాల్ గజ్జర్ షాక్
ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిపోయింది. దీంతో అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, అభిజీత్, దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీలు ఫినాలేకు చేరుకున్నారు. ఇక, బయటకు వచ్చిన తర్వాత మోనాల్.. రాహుల్ సిప్లీగంజ్ యాంకరింగ్ చేస్తున్న ‘బిగ్ బాస్ బజ్' కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో అఖిల్ సార్థక్‌కు కోలుకోలేని షాకిచ్చిందామె.
మనసులో A అంటే ఎవరో చెప్పేసింది
షోలో భాగంగా ‘పాపం అఖిల్ బాగా బాధ పడినట్లు ఉన్నాడు.. నీ కోసం ఉండిపోరాదే అంటూ పాట కూడా పాడాడు' అని రాహుల్.. మోనాల్‌తో అనగా దానికి ఆమె మురిసిపోయింది. ఆ తర్వాత ‘నీ మనసులో ఉన్న A ఎవరు' అని ప్రశ్నించాడు. దానికి ఆమె ‘నా మనసులో ఉన్న A అభిజీత్ కాదు.. అఖిల్ కూడా కాదు' అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.