ఊహించని ఆఫర్ పట్టేసిన మోనాల్ గజ్జర్: ఈ సారి ఏకంగా అలా.. షాకిస్తోన్న సీక్రెట్ న్యూస్
చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. అయితే, బిగ్ బాస్ షోలోకి ప్రవేశించిన తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అందులో ప్రేమాయణం అంటూ హల్‌చల్ చేయడంతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుని సత్తా చాటుతోంది. దీంతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పటికే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు చేసిన మోనాల్ గజ్జర్.. ఇప్పుడు మరో భారీ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటది? పూర్తి వివరాలు మీకోసం!
బికినీలో తడిసిన అందాల ఫొటోలతో షాకిచ్చిన సోనాలి

తెలుగులో అలా మెరిసిన మోనాల్
అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ తర్వాత టాలీవుడ్‌లో మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. అయితే, ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. అప్పటి నుంచి వేరే భాషల్లో నటిస్తూ వచ్చింది.

బిగ్ బాస్ ఎంట్రీ.. లవ్ ట్రాకుతో స్టార్ట్
తెలుగులో పెద్దగా సినిమాలు చేయకున్నా.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది మోనాల్ గజ్జర్. ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయిందామె. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ అమ్మడు ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

అక్కడే కాదు.. ఇక్కడ కూడా రచ్చే
బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తద్వారా జంటగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

షో తర్వాత దూసుకెళ్తోన్న మోనాల్
బిగ్ బాస్ షో పుణ్యమా అని మోనాల్ గజ్జర్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఒక్క దెబ్బతో ఆమె సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపిస్తోన్న 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో పర్మినెంట్ జడ్జ్‌గా చేస్తోంది.
Recommended Video

అందులో మాత్రం ఎప్పుడూ బిజీనే
వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నప్పటికీ మోనాల్ గజ్జర్ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హల్‌చల్ చేస్తోంది. తద్వారా ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

ఊహించని ఆఫర్ పట్టేసిన మోనాల్
బిగ్ బాస్ తర్వాత మోనాల్ గజ్జర్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో భీకరంగా పెరిగిపోయింది. అందుకే ఆమె 'డ్యాన్స్ ప్లస్' షో విజయంలో భాగం అయింది. ఈ నేపథ్యంలో గుజరాతీ బ్యూటీ డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ మా ఛానెల్ మోనాల్ గజ్జర్‌కు ఊహించని ఆఫర్ ఇచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ సారి ఏకంగా అలా కనిపిస్తుందట
తాజా సమాచారం ప్రకారం.. మోనాల్ గజ్జర్ స్టార్ మా ఛానెల్‌లో ఓ షో చేయడానికి సంతకం పెట్టేసిందట. అయితే, ఈ సారి ఆమె యాంకర్‌గా కనిపించబోతుందని తెలిసింది. కామెడీ ప్రధానంగా సాగే ఈ కార్యక్రమం ఎంతో గ్రాండ్‌గా మొదలవబోతుందని అంటున్నారు. ఇందులో చాలా మంది పెద్ద పెద్ద కమెడియన్లు భాగం కాబోతున్నారట. అందుకే మోనాల్‌ను ఎంపిక చేసుకున్నారని టాక్.


Click it and Unblock the Notifications











