ఓంకార్‌కు మోనాల్ గజ్జర్ పాదాభివందనం.. కన్నీటిపర్యంతమైన బిగ్‌బాస్ బ్యూటీ!
బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 21 వారాలపాటు ఆకట్టుకొన్న డ్యాన్సీ+ షో ముగిసినా.. ఆ షో ఫినాలేకు సంబంధించిన ఎపిసోడ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్‌పై హోస్ట్, డైరెక్టర్ ఓంకార్ చూపించిన ప్రేమానురాగాలు విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఎమోషనల్ అంశంగా మారాయి. ఈ షోలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనల్లోకి వెళితే...

ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్టు
తన తండ్రి అంటే ఇష్టమని.. 15 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. ఈ షోలో చెప్పి తన బాధను మోనాల్ పంచుకొన్నారు. మోనాల్ ఓ ఫోటోను చూపించి ఇది నా వద్ద ఏకైక ఫోటో అంటూ షేర్ చేసుకొన్నారు. ఆ వీడియోను చూసిన బెంగళూరు పెయింటర్ దీపక్ తాను భావోద్వేగానికి గురై మోనాల్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే పెయింటింగ్‌ను ఇవ్వాలని నిర్ణయించుకొన్నారు.

పెయింటర్ దీపక్ ప్రపోజల్‌ను
హోస్ట్ ఓంకార్‌ను సంప్రదించగా.. దీపక్ ప్రపోజల్‌కు సానుకూలంగా స్పందించి ఫోటోను వేయించారు. ఆ ఫోటోను ఫినాలే రోజున గిఫ్టుగా అందించి మోనాల్‌ను ఆశ్చర్యానికి, భావోద్వేగానికి గురిచేశారు. ఈ సందర్భంగా మోనాల్ కన్నీటి పర్యంతం అయ్యారు. అనంతరం దీపక్‌కు థ్యాంక్స్ చెప్పుకొన్నారు.

ఓంకార్ కాళ్లకు పాదాభివందనం
తనకు అపురూపమైన గిఫ్టును అందించిన ఓంకార్‌ను చూసి ఎమోషనల్ అయ్యారు. వెంటనే కాళ్లకు నమస్కరించారు. తన కాళ్లకు పాదాభివందనం చేసిన మోనాల్‌ను లేపి అప్యాయంగా తలపై ఓంకార్ నిమిరి ప్రేమను కురిపించారు. ఇలా ఇద్దరు భావోద్వేగమైన వర్షంలో తడిచారు.

అచ్చం మీ నాన్నలా ఉన్నారా?
మోనాల్‌తో మాట్లాడుతూ.. అచ్చం మీ నాన్నలా ఉన్నారా అని అడిగితే అవును అంటూ సమాధానం చెప్పింది. నిన్ను పెళ్లి కూతురిలా చేసి అప్పగింత చేసినట్టు ఫోటో ఉంది. ఆయన ఎంత చక్కగా ఉన్నరో చూడండి అంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ పెయింటింగ్‌లో నీకు అత్యంత ఇష్టమైన ఫోటో కూడా ఉంది అంటూ ఓంకార్ కామెంట్ చేశారు.

నాకు అతిపెద్ద గిఫ్ట్
ఓంకార్ గిఫ్టును తీసుకొంటూ థ్యాంక్యూ సార్... నా లైఫ్‌లో అతిపెద్ద గిఫ్ట్. ఇలాంటి గిఫ్టును ఇచ్చినందుకు రుణపడి ఉంటాను. అంటూ మోనాల్ కంటతడి పెట్టింది. నేను మొమొరీ షేర్ చేసుకొంటే.. ఇంతలా ఆలోచించి ఇలాంటి గిఫ్టు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా బెడ్ రూమ్‌లో మరో ఫోటో ఉంది. దాని ప్లేస్‌లో ఈ ఫోటోను పెడుతాను అంటూ కామెంట్ చేసింది.

ఫోటోను చూసి మురిసిపోయిన మోనాల్
హోస్ట్ ఓంకార్ చేతుల మీదుగా అందుకొన్న ఫోటోను తీసుకొని ఆనందంగా నవ్వుతూ నడుచుకొంటూ తన సీట్‌లోకి వెళ్లిపోయింది. తన సీట్ వెనుక పెట్టుకొని ఫోటో చూసి మురిసిపోయింది. మోనాల్ సంతోషాన్ని చూసి అందరూ చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయారు.
Recommended Video

శేఖర్ కామెంట్‌తో ఫన్‌గా...
ఇక మోనాల్ ఆనందాన్ని చూసి స్పెషల్ గెస్ట్ శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. ఎవరైనా నవ్వితే అందంగా ఉంటారు. కానీ మోనాల్ మాత్రం నవ్వినా.. ఏడ్చినా అందంగా ఉంటుంది అని కామెంట్ చేయడంతో అప్పటి వరకు బాధపడిన మోనాల్ ఆనందంలో మునిగిపోయింది. అందరూ ఓహో అంటూ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











