For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్‌పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: స్వలాభం కోసమే వాళ్లను బ్యాడ్ చేస్తున్నాడట.!

  By Manoj Kumar P
  |

  తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. స్టాండప్ కామెడీ షోగా పరిచయమైన దీనికి మొదటి నుంచీ మంచి స్పందన వస్తూనే ఉంది. ఈ కారణంగానే దాదాపు ఏడేళ్లుగా ఇది విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఇంతటి పేరున్న ఈ కామెడీ షో వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో ముక్కు అవినాష్ ఒకడు. చాలా కాలంగా ఆ షోలో కొనసాగుతోన్న అతడు.. ఇటీవల బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జబర్ధస్త్‌పై అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తాజాగా ఓ చర్చ తెరపైకి వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

  మిమిక్రీ ఆర్టిస్టు నుంచి జబర్థస్త్ కమెడియన్

  మిమిక్రీ ఆర్టిస్టు నుంచి జబర్థస్త్ కమెడియన్

  అవినాష్ కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో స్టేజ్ షోలతో పాటు ఈవెంట్లలోనూ ప్రదర్శన ఇచ్చాడు. అలా అలా జబర్థస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో.. అందులో చేసే అవకాశాన్ని అందుకున్నాడు. మొదట్లో పలు టీమ్‌లలో పని చేసిన అవినాష్... అత్యుత్తమ టాలెంట్‌ను చూపించడంతో లీడర్‌గా ప్రమోట్ అయ్యాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదతడు.

  జబర్ధస్త్‌ను వీడి.. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు

  జబర్ధస్త్‌ను వీడి.. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు

  దాదాపు ఐదేళ్ల పాటు జబర్ధస్త్‌లో పని చేశాడు అవినాష్. తనదైన శైలి కామెడీకి తోడు కొందరు నటులను ఇమిటేట్ చేయడంతో ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరీర్ మాంచి ఊపు మీదున్న సమయంలో ఈ కామెడీ షోకు గుడ్‌బై చెప్పేశాడతను. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో వెలుగొందుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.

  ఎంటర్‌టైనర్‌గా పేరు.. ప్రముఖుల ప్రశంసలు

  ఎంటర్‌టైనర్‌గా పేరు.. ప్రముఖుల ప్రశంసలు

  బిగ్ బాస్ హౌస్‌లోకి జోకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రాణమిస్తానంటూ చెప్పుకొచ్చిన అతడు.. హౌస్‌లోనూ తనదైన రీతిలో కామెడీని పంచుతున్నాడు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను నవ్విస్తూ ఎంటర్‌టైనర్‌గా పేరందుకున్నాడు. ఇదిలాఉండగా, అవినాష్‌ను నాగార్జునతో పాటు సమంత, అక్కినేని అఖిల్ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే.

  లవ్ ట్రాక్.. చిల్లర కామెడీ.. అవినాష్ తీరిది

  లవ్ ట్రాక్.. చిల్లర కామెడీ.. అవినాష్ తీరిది

  బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పెళ్లి గురించి పదే పదే కామెంట్లు చేస్తున్నాడు అవినాష్. అదే సమయంలో తోటి కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో సన్నిహితంగా ఉంటూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. అలాగే, నోయల్‌తో జరిగిన ‘చిల్లర కామెడీ' గొడవతో అతడిలోని మరో యాంగిల్ బయటకు వచ్చింది. అప్పటి నుంచి అవినాష్ కొత్తగా కనిపిస్తున్నాడు.

  జబర్ధస్త్‌పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు

  జబర్ధస్త్‌పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు

  బిగ్ బాస్ షోలోకి రావడానికి ముందు అవినాష్ జబర్ధస్త్‌లో పని చేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ షో లేకుంటే అతడు ఎవరికీ తెలియదు. అలాంటిది సదరు షోపై ఈ కమెడియన్ తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ముక్కు అవినాష్.. జబర్ధస్త్ షోను, ఆ నిర్వహకులను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో హాట్ టాపిక్ అవుతున్నాడు.

  స్వలాభం కోసమే బ్యాడ్ చేస్తున్నాడట

  స్వలాభం కోసమే బ్యాడ్ చేస్తున్నాడట

  బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్ ‘జబర్ధస్త్ వాళ్లు నన్ను తీసేశారు. బిగ్ బాస్‌లోకి వస్తే అందులో రీఎంట్రీ ఇవ్వకూడదని చెప్పేశారు. అందుకే దీన్ని సీరియస్‌గా తీసుకున్నా' అని తరచూ కామెంట్ చేస్తున్నాడు. శనివారం జరిగిన ఇమ్యూనిటీ టాస్క్‌లోనూ పదే పదే ఇది చెప్పాడు. దీంతో సింపతీ, స్వలాభం కోసమే అతడు జబర్ధస్త్‌పై కామెంట్లు చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

  English summary
  Avinash Kalla of Jabardasth fame is a self-made comedian and mimicry artist, who shot with his performances on the comedy show 'Jabardasth' especially the 'Mukku skit' in 2015. Avinash's family hails from Raghavapatnam, a village near Jagtial, Telangana and he completed his B.tech in Civil Engineering.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X