Just In
- 36 min ago
నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్
- 1 hr ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 2 hrs ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
Don't Miss!
- Finance
ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
- News
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- Sports
ఏదైనా చేసుకోండి.. మేం మాత్రం అక్కడికి వెళ్లం! బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక!
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్‌లో ఎలక్షన్ ఫీవర్.. పొలిటిషియన్స్‌గా అఖిల్, అవినాష్.. గెలిచింది ఎవరంటే!
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో హైడ్రామా నడిచింది. నామినేట్ అయిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. నామినేట్ అయిన సభ్యులకు ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఇవ్వనున్నట్టు తెలిపారు. అందుకోసం నామినేట్ అయిన ఇంటి సభ్యులు రెండు అంచెల గేమ్ ఆడాల్సి ఉంటుంది. అందులో గెలిచిన ఇంటి సభ్యులు రెండో రౌండ్ ఆడాల్సి ఉంటుంది అని గేమ్ రూల్ చెప్పారు. 79వ రోజున ఇంటిలో ఎలాంటి సంఘటనలు జరిగాయంటే..

తెరపైకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీ
ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీకి ముందుగా ఇంటిలో జెండాల సేకరణ గేమ్‌ను పెట్టారు. ఈ గేమ్‌లో భాగంగా పలు ప్రదేశాలో పెట్టిన జెండాలను సేకరించాలి. ఎవరు ఎక్కువ సేకరిస్తారో వారు తొలి రౌండ్ విజేతగా నిలుస్తారని చెప్పారు. గేమ్ బజర్ మోగగానే పోటీదారులు జెండాలు సేకరించారు. అందులో ఎక్కువగా సేకరించిన అఖిల్, అవినాష్ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

ఎన్నికల ప్రక్రియ కోసం పార్టీ, గుర్తులు
ఇక రెండో రౌండ్‌లో ఎన్నికలో పోటీ పడుతున్న అభ్యర్థులు తమ పార్టీ, ఎన్నికల గుర్తును ఏర్పాటు చేసుకోవాలి. ఆ పార్టీ ఎజెండాను రూపొందించుకొవాలి. అనంతరం ఓటర్లైన ఇంటి సభ్యులను తమ ప్రచారంతో ఆకట్టుకోవాలి. ఇలాంటి విధానాలతో ఎవిక్షన్ ప్రీ పాస్ కోసం జరిగిన ఎన్నిక కోసం అఖిల్, అవినాష్ ప్రచారంలోకి దిగారు.

బీబీ పార్టీతో అఖిల్.. గమ్యం చేరే వరకు పార్టీతో అవినాష్
బిగ్‌బాస్ నియోజకవర్గంలో ఓటర్లైన అభిజిత్, హారిక, అరియానా, మోనాల్, సోహెల్‌ను ఆకట్టుకొనేందుకు అఖిల్, అవినాష్ ప్రచారం చేశారు. అఖిల్ తన పార్టీ పేరు బిగ్‌బాస్ (బీబీ) అని, అవినాష్ పార్టీ పేరు గమ్యం చేరే వరకు, అలాగే గుర్రం బొమ్మను గుర్తుగా ఏర్పాటు చేసుకొన్నారు. ఇక తమదైన శైలిలో పార్టీ కోసం ప్రచారం చేపట్టారు.

అఖిల్, అవినాష్ మధ్య టై
ఇక ఇంటి సభ్యులు ఓటు వేయడానికి పూలదండలు ఇచ్చారు. ముందుగా అవినాష్‌కు అరియానా దండ వేయగా, అఖిల్‌కు మోనాల్ గజ్జర్ దండ వేసి ఓటు సమర్పించుకొన్నారు. ఆ తర్వాత అఖిల్‌కు సోహెల్ ఓటు వేసి మెజారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత అవినాష్‌కు అఖిల్ మద్దతు తెలుపుతూ గుర్రం గుర్తుకు ఓటు తెలుపుతూ మెడలో దండ వేశాడు. దాంతో చెరి రెండు ఓట్లు వచ్చాయి. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకొనే అవకాశం హారిక చేతిలోకి వెళ్లింది.

అవినాష్‌కు ఓటు వేసిన హారిక
బిగ్‌బాస్‌లో తమ జీవిత రేఖను మార్చే డిసైడింగ్ ఓటు హారిక చేతిలోకి రావడంతో అఖిల్, అవినాష్‌లో టెన్షన్ మొదలైంది. హారికి తన అభిప్రాయాన్ని చెబుతూ అఖిల్‌కు వేయాలని ఉన్నా.. నా మనసు అవినాష్‌కు వేయాలని అనిపిస్తుంది. కాబట్టి అవినాష్‌కు ఓటు వేస్తున్నాను అంటూ ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకొన్నారు. దాంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవినాష్ సొంతం అయింది.

రెండు వారాలపాటు రక్షగా ఎవిక్షన్ ఫ్రీ పాస్
ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎన్నికలో గెలిచిన అవినాష్‌కు పాస్ అందించాడు. అయితే రెండు వారాల పాటు దాని వాలిడిటి ఉంటుంది. రెండు వారాల్లో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాలి అని బిగ్‌బాస్ సూచించాడు. ఆ తర్వాత అవినాష్‌కు ఓ గిఫ్టు లభించింది. దీంతో మరో రెండు వారాలపాటు ఇంటిలో అవినాష్ ఉండేందుకు మార్గం సుగమమైంది.