»   » దేవిశ్రీ ప్రసాద్ ఊహించని నిర్ణయం: హీరో కాదు.. జీలో!

దేవిశ్రీ ప్రసాద్ ఊహించని నిర్ణయం: హీరో కాదు.. జీలో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రెండు మూడూ రోజులుగా సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు హాట్ టాపిక్ అయ్యాయి. మీకు సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ దేవిశ్రీ ప్రసాద్ చెప్పడంతో అతను ఎలాంటి సర్‌ప్రైజింగ్ న్యూస్ చెబుతారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూసారు.

కొన్ని నెలల క్రితం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా సినిమా వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన న్యూస్ ఏదైనా చెబుతారేమోనని అంతా ఊహించారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ ప్రకటనలో అలాంటిదేమీ కనిపించలేదు. మరికొందరేమో తన పెళ్లి గురించిన వార్త చెబుతారేమో అనుకున్నారు... కానీ ఇటీవలే తండ్రి సత్యమూర్తి మరణించాడు కాబట్టి అలాంటిదేమీ అయ్యి ఉండదనే సరిపుచ్చుకున్నారు.

ఎట్టకేలకు ఈ రోజు మధ్య దేవిశ్రీ ప్రసాద్ తాను చెప్పదలుచుకున్నది చెప్పాడు. అయితే అది తాను హీరో అవ్వాలనే అంశానికి సంబంధించినది మాత్రం కాదు. జీలో... కాదు కాదు జీ తెలుగులో తాను మ్యూజికల్ ప్రోగ్రామ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని దేవిశ్రీ తెలిపారు.

స్లైడ్ షోలో జీతెలుగు కార్యక్రమానికి సంబంధించి పోస్టు చేసిన వీడియో...

జీ తెలుగులో

జీ తెలుగులో

జీ తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సంబంధించిన కార్యక్రమం చేయబోతున్నారు.

డాన్సర్ సింగర్ పెర్ఫార్మెన్స్

డాన్సర్ సింగర్ పెర్ఫార్మెన్స్

ఇంతకాలం తన పేరును అంతా షార్ట్ కట్‌లో డి.ఎస్.పి అనే పిలిచేవారు. ఇపుడు దానికి కొత్త అర్థం చెప్పాడు. డి అంటే డాన్సర్, ఎస్ అంటే సింగర్, పి అంటే పెర్ఫార్మర్.

టీ షో కూడా అలానే ఉంటుందా

టీ షో కూడా అలానే ఉంటుందా

పాట పాడుతూ డాన్స్ చేస్తూ పెర్ఫార్మెన్స్ ఇచ్చే టైపులో జీ తెలుగులో ప్రసారం అయ్యే దేవిశ్రీ ప్రసాద్ కార్యక్రమం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వీడియో

దేవిశ్రీ ప్రసాద్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో

English summary
‘Something that Lot of U have been asking me ! Musical extravaganza on Zee Telugu very soon. ‪‎DSP On ZeeTelugu‬ details coming soon.’ Devi Sri Prasad said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu