Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Jabardasth: నాగబాబు కంటే రోజా రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేది.. అసలు కారణం ఇదే!
ఇటీవల కాలంలో జబర్దస్త్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న కిర్రాక్ ఆర్పీ కూడా ఆ కామెడీ షో పై ఊహించిన విధంగా నెగటివ్ కామెంట్స్ చేయడంతో మిగతా జబర్దస్త్ కమెడియన్స్ కూడా అతనిపై రివర్స్ అయ్యారు. కిర్రాక్ ఆర్పీ చెప్పే విషయంలో ఎలాంటి నిజాలు లేవు అని అతనికి కౌంటర్స్ అయితే ఇచ్చారు. రీసెంట్ గా మాజీ జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు కూడా అతనికి కౌంటర్ ఇచ్చారు. అలాగే జబర్దస్త్ లో ఉన్నప్పుడు నాగబాబు రోజా రెమ్యునరేషన్స్ గురించి కూడా ఆయన వివరణ ఇచ్చాడు.

మంచి క్రేజ్ అందుకున్న కమెడియన్స్
2013లో మొదలైన జబర్దస్త్ షో ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతికొద్ది కాలంలోనే టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయిన జబర్దస్త్ ఆ తర్వాత ప్రొడక్షన్ నిర్మాతలకు కూడా భారీ స్థాయిలో లాభాలను అందించింది. ఇక ఈ కామెడీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నవారు చాలావరకు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. కొందరు అయితే ఏకంగా ప్రత్యేకంగా సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నారు.

కిర్రాక్ ఆర్పీకి కౌంటర్స్
కానీ ఇటీవల కిర్రాక్ ఆర్పీ మాత్రం ఊహించిన విధంగా జబర్దస్త్ లో చాలా మోసాలు జరుగుతున్నాయని అక్కడ కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టరు అని మల్లెమాల సంస్థలో ఎవరు కూడా కరెక్ట్ గా లేరు అని యాజమాన్యం మొత్తం జబర్దస్త్ కమెడియన్స్ వల్లనే ఎంతో సంపాదించినట్లుగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో అతను చెప్పేవన్నీ అబద్ధాలు అని కూడా హైపర్ ఆదితో పాటు రామ్ ప్రసాద్ కూడా తీవ్రంగా ఖండించారు.

రంగంలోకి సీనియర్ మేనేజర్
ఇక రీసెంట్ గా జబర్దస్త్ మొదలుపెట్టినప్పుడు మేనేజర్ గా ఉన్నటువంటి ఏడుకొండలు కూడా రంగంలోకి దిగాడు. అప్పట్లో ఏడుకొండలు పేరు కూడా బాగానే వైరల్ అయింది. అప్పట్లో జబర్దస్త్ లో అప్పుడప్పుడు కమెడియన్స్ సరదాగా జోకులు కూడా వేసేవారు. అయితే అతను కూడా రాజకీయాల కారణంగానే బయటకు వచ్చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ దానికి మల్లెమాల సంస్థకు ఎలాంటి సంబంధం లేదు అని కొందరి కారణంగానే తాను బయటకు వచ్చినట్లు చెప్పాడు.

నాగబాబు కంటే ఎక్కువగా..
ఇక ప్రస్తుతం జబర్దస్త్ పారితోషికాల గురించి కూడా అనేక రకాల వార్తలు వైరక్ అవుతున్నాయి. ఒక విధంగా జబర్దస్త్ షోలో న్యాయ నిర్ణేతలుగా ఉన్న వారికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్ ఇచ్చేవారు అని చెప్పుకునేవారు. అంతేకాకుండా నాగబాబుకు కూడా రోజా కంటే ఎక్కువ ఇచ్చే వాళ్ళని కూడా వార్తలు వచ్చాయి. కానీ నిజానికి నాగబాబు కంటే రోజాకే జబర్దస్త్ లో ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా ఇటీవల కిర్రాక్ ఆర్పీ కామెంట్ చేశాడు. ఇక నాగబాబు జబర్దస్త్ నుంచి కూడా ఇతర రాజకీయాల వలన బయటకు వచ్చేశారని ఆర్పీ అన్నాడు.

క్లారిటీ ఇచ్చిన ఏడుకొండలు
జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న నాగబాబుకు రోజా కంటే తక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది అని ఏడుకొండలు వివరణ ఇచ్చారు. ఎందుకంటే రోజా గారు ముందుగానే సినిమా పరిశ్రమంలో ఒక హీరోయిన్ గా ఎంతగానో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి వస్తున్నారు అన్నప్పుడు ఆమె మార్కెట్ ను బట్టి అందరికంటే ఎక్కువ స్థాయిలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నాకు బాబు కంటే ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక రోజా తన పాలిటిక్స్ కెరీర్ దృష్ట్యా జబర్దస్త్ కు దూరం కావాల్సి వచ్చింది.