Just In
- 5 hrs ago
హైదరాబాద్‌లో కంగనాకు చేదు అనుభవం.. బ్లాంకెట్లు అడ్డు పెట్టుకుని వెళ్లినా వదల్లేదట.!
- 6 hrs ago
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: నిహారిక కోసం బన్నీ సరికొత్త ప్లాన్.. ఈ సారి అదిరిపోతుందట.!
- 7 hrs ago
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- 8 hrs ago
తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ షాకింగ్ డెసిషన్.. ఆనంద్ కోసం ఆ పని కూడా చేస్తాడట
Don't Miss!
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ప్రోమో సంచలనం.. ఏంటి! నాగబాబు జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేశాడా..?
జబర్దస్త్ జోడీ రోజా, నాగబాబు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ చూస్తూనే జబర్దస్త్ జడ్జ్‌మెంట్ ఇవ్వడంలో ఈ ఇద్దరినీ మించిన జడ్జెస్ ఉండరనే చెప్పుకోవాలి. బుల్లితెరపై జడ్జ్ స్థానంలో కూర్చొని కూడా తమ నవ్వులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయగల సమర్థులు వీరు. అలాంటి ఈ ఇద్దరి గురించి షికారు చేస్తున్న కొన్ని వార్తలు జబర్దస్త్ అభిమానుల్లో ఆందోళన నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ ప్రోమో వీడియో పలు అనుమానాలకు తెరలేపింది. ఆ వివరాలు చూద్దామా..

రోజా, నాగబాబు లేని జబర్దస్త్
ఒక దశలో రోజా, నాగబాబు లేనిదే ఈ జబర్దస్త్ షోకి ఇంత పాపులారిటీ లేదు అని టాక్ నడిచింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైందో అప్పటి నుంచి రోజాపై అనుమానాలు మొదలయ్యాయి. రోజా గెలిస్తే ఇక జబర్దస్త్ నుంచి రోజా బయటకు వచ్చేస్తుందని ఆడియన్స్ బెంగ పెట్టుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక ఇప్పుడు అవే రకాల వార్తలు నాగబాబుపై వస్తున్నాయి.

నాగబాబు నిష్క్రమణ.. జబర్దస్త్ టీం లీడర్స్ పరిస్థితి
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జబర్దస్త్ షో నుంచి నాగబాబు నిష్క్రమిస్తున్నాడనే వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈయనతో పాటు కొందరు జబర్దస్త్ టీం లీడర్స్ కూడా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెబుతున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ఇన్నాళ్లు బుల్లితెర నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ అయిన జబర్దస్త్ కళ తప్పనుందనే పుకార్లు పుట్టుకొచ్చాయి.
అనుమానాలకు తెరలేపిన ప్రోమో
ఈ వార్తలు గమనించిన జబర్దస్త్ నిర్వాహకులు.. నాగబాబు గుడ్ చెప్పడం అవాస్తవం అని చెబుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మరోలా వార్తలొస్తున్నాయి. నాగబాబుతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ లాంటి టీమ్స్ కూడా జబర్దస్త్ నుంచి మానేసి వెళ్లిపోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఓ టీవీ ఛానల్ నుంచి వచ్చిన ప్రోమో అనుమానాలకు తెరలేపింది.

జబర్దస్త్ లాగే మరో భారీ కామెడీ షో ప్లాన్
ప్రముఖ ఛానెల్ జీ తెలుగులో అచ్చం జబర్దస్త్ లాగే మరో భారీ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారని, దీనికోసం నాగబాబును కూడా భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటున్నారని ప్రచారం జరిగుతోంది. సరిగ్గా ఇప్పుడే ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ ప్రోమోలో నాగబాబుతో పాటు ప్రదీప్ దర్శనమివ్వడం ఆసక్తి, అనుమానాలు రేపుతోంది.

యాంకర్ రవి కూడా.. ప్లాన్ అదేనా?
ఈ ప్రోమోలో యాంకర్ రవి కూడా కనిపిస్తున్నాడు. దీంతో స్కెచ్ బాగానే వేశారని తెలుస్తోంది. 'సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం' అనే పేరుతో ప్రసారం కానున్న ఈ షో నవంబర్ 24 నుంచి మొదలవుతుంది. ఈ పరిస్థితులు చూస్తుంటే జబర్దస్త్ కామెడీ షోకి సరైన పోటీ ఇచ్చేందుకే ఈ పవర్ ఫుల్ ప్లాన్ చేశారని అర్థమవుతోంది.

నాగబాబు అంతకంటే భారీ మొత్తం అందుకుంటున్నారా?
ఎప్పటి నుంచో జబర్దస్త్ రెండో జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆయనకు నెలకు రూ. 15 లక్షలు మేర రెమ్మ్యూనరేషన్ అందుతుందని తెలుస్తోంది. మరి ఇప్పుడు జీ సంస్థ ద్వారా అంతకంటే భారీ మొత్తం అందుకుంటున్నారా? అనేది చూడాలి మరి.