హీరో రాజశేఖర్‌, జగన్, బాలయ్యపై అదిరేలా కామెడీ.. పడిపడి నవ్విన నాగబాబు, శ్రీముఖి, సుమ

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు, హీరో నవదీప్ హోస్ట్‌గా అదిరింది షో ప్రారంభమైంది. అయితే లాక్‌డౌన్ విధించడంతో ఈ షో ప్రారంభంలోనే ఆగిపోయింది. లాక్‌డౌన్ తర్వాత ఈ షోను మరింత క్రేజీగా డిజైన్ చేసి సుమ, శ్రీముఖి, జానీ మాస్టర్‌‌లతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజా ప్రోమోలో హీరో రాజశేఖర్, వైఎస్ జగన్, బాలకృష్ణపై సెటైర్లు వేయడం ఆసక్తిగా కనిపించింది. ఇంతకు ఈ షోలో వారిపై ఏం కామెంట్లు విసిరారంటే..

హీరో రాజశేఖర్‌ను అనుకరిస్తూ కామెడీ

హీరో రాజశేఖర్‌ను అనుకరిస్తూ కామెడీ

అదిరింది షోలో స్టార్ కంటెస్టెంట్ సద్దాం వేదికపైకి రోజ్ రోజ్ రోజా పువ్వా అనే పాటపై రాజశేఖర్‌ను అనుకరిస్తూ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత క్రికెట్ నేపథ్యంగా స్కిట్‌ను ప్లాన్ చేశారు. టాస్ వేసేటప్పుడు హెడా? టెయిలా? అని అడిగితే హెల్మెట్ కావాలని సద్దా జోక్ పేల్చారు. హెల్మెట్ ఎందుకని మరో వ్యక్తి అడిగితే.. హెడ్ పైకి వేస్తే పగిలిపోదా అంటూ సద్దాం జోక్ కట్ చేశాడు.

వైఎస్ జగన్‌లా నమస్తే చేస్తూ స్కిట్

వైఎస్ జగన్‌లా నమస్తే చేస్తూ స్కిట్

ఆ తర్వాత వైస్ జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్ నమస్కారాన్ని అనుకరిస్తూ మరో కంటెస్టెంట్ కామెడీ చేశారు. ఏదైన సభలో వైఎస్ జగన్ మాట్లాడేటప్పుడు చేయి అటు నుంచి ఇటువైపుకు ఊపడం ఆయన స్టైయిల్. ఆ స్కిట్‌ను ప్రదర్శిస్తూ.. ఎవరొస్తున్నారు అంటే.. అన్న వస్తున్నాడు అనగానే... కంటెస్టెంట్ వచ్చి జగన్ మాదిరిగా విష్ చేయడం జరిగింది. దాంతో స్టేజీ మీద ఉన్న కంటెస్టెంట్లు, హోస్టులు, యాంకర్లు నవ్వుల్లో మునిగిపోయారు.

అది ముందు చెప్పురా గాడిదా అంటూ

అది ముందు చెప్పురా గాడిదా అంటూ

ఇక మరో ఎంట్రీ గురించి ఎవరొస్తున్నారు అంటే.. లెజెండ్ అనగానే... బాలకృష్ణను అనుకరిస్తూ సద్దాం తెరపైకి వచ్చాడు. తొడ గొడుతూ బాలయ్య మాదిరిగా స్టయిల్‌ను ప్రదర్శించాడు. బాలయ్య మాదిరిగా సద్దాం నడుస్తుంటే.. మనిషంతా బంగారం.. మనసంతా మందారం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుంటే.. నీవే ఎవరు ముందు చెప్పు సద్దాం.. అంటే నేను కామెంటేటర్‌ను అని సమాధానం ఇవ్వగా.. అది ముందు చెప్పురా గాడిదా అంటూ సద్దాం వార్నింగ్ వేశారు.

బాలయ్య బాబు సెక్సీ అంటూ శ్రీముఖి

బాలయ్య బాబు సెక్సీ అంటూ శ్రీముఖి

ఇలా బాలయ్య స్కిట్‌ను ప్రదర్శిస్తుండగా.. శ్రీముఖి ఆనందం పట్టలేక కేకలు వేసింది. జై బాలయ్య అంటూ ఉత్సాహంతో ఊగిపోయింది. ఆ తర్వాత కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అంటూ శ్రీముఖి నినాదాలు చేసింది. ఈ స్కిట్స్ అన్ని ఉత్సాహంతో సాగిపోతుంటే.. నాగబాబు, సుమ, జానీ మాస్టర్ కడుపుబ్బ నవ్వారు.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
ఎస్పీ బాలుకు బొమ్మ అదిరింది టీమ్ శ్రద్దాంజలి

ఎస్పీ బాలుకు బొమ్మ అదిరింది టీమ్ శ్రద్దాంజలి

ఇదే కార్యక్రమంలో ప్రఖ్యాత గాయకుడు, దివంగత బాలసుబ్రమణ్యంకు ఘనంగా టీమ్ సభ్యులు శ్రద్దాంజలి ఘటించారు. బాలు ప్రతిభను నాగబాబు ఆకాశానికి ఎత్తేశారు. బాలు పాటపాడితే ఇది ఎన్టీఆర్‌ది, ఇది ఏఎన్నాఆర్, చిరంజీవి అని చెప్పవచ్చు. ఆయన టాలెంట్ అది. ఆయన లాంటి గాయకుడిని కోల్పోవడం తీరని లోటు అని టీమ్ నివాళిని అర్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X