రాత్రి 9 గంటల తర్వాతే వస్తా.. మాస్ అంటూ అఖిల్‌ను ఇరుకున పెట్టిన నాగ్

బిగ్‌బాస్ ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలు నాకు చాలా పెద్ద అమౌంట్ అంటూ అఖిల్ సార్థక్ తన స్పీచ్ ప్రారంభించాడు. మధ్యలో నాగార్జున అడ్డుపడుతూ.. నాకు తెలుసు.. అందులో నుంచి ఒక బైక్, ల్యాప్ టాప్‌ సోహెల్‌కు కొని ఇవ్వాలి కదా అంటూ అన్నాడు. దాంతో ఈ ఫుటేజ్ భయటకు వెళ్లిందా అంటూ ఇద్దరు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తన కేఫ్ గురించి చెప్పిన తర్వాత నాగ్ ఇచ్చిన ఝలక్ ఏమిటంటే..

నేను కష్టపడిన సొమ్మును..

నేను కష్టపడిన సొమ్మును..


ఆ తర్వాత అఖిల్ మాట్లాడుతూ.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు.. దాని నుంచి ఉపశమనం పొందడానికి వృద్దుల ఆశ్రమానికి, వికలాంగుల ఆశ్రమానికి వెళ్లేవాడిని. నాకు 50 లక్షల రూపాయలు వస్తే వారి కోసం కొంత సహాయం చేయాలని అనుకొంటున్నాను. అలాగే నేను ఇంత కష్టపడి సంపాదించుకొన్న సొమ్మును నాపై కూడా కొంత పెట్టుబడి పెట్టాలని అనుకొంటున్నాను అని అన్నాడు.

వీలైతే ఇంటి కోసం ఖర్చు పెడుతా

వీలైతే ఇంటి కోసం ఖర్చు పెడుతా

బిగ్‌బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు వస్తే.. నేను ఒక కేఫే ప్రారంభించాలని అనుకొంటున్నాను. వీలైతే ఒక ఇంటిని కూడా కొనుక్కోవాలని అనుకొంటున్నాను. మమ్మి, డాడీ, నా కోసం మంచి ఇళ్లు కొనేందుకు ప్రయత్నిస్తాను అంటూ అఖిల్ చెప్పాడు.

డిఫరెంట్, టిపికల్ పేరుతో

డిఫరెంట్, టిపికల్ పేరుతో

అఖిల్ తన కేఫ్ గురించి మాట్లాడుతుంటే.. ఏదైనా పేరు ఆలోచించావా అంటూ నాగార్జున అడిగాడు. దాంతో డిఫరెంట్, టిపికల్ పేరు పెట్టాలని అనుకొంటున్నాను అని ఆలోచిస్తుంటే.. నాగార్జున చిన్న స్మైల్ ఇవ్వడంతో అఖిల్ ఆ నవ్వు వెనుక విషయాన్ని గ్రహించి.. మీరు ఏదో మెలిక పెట్టాలని చూస్తున్నారు అని అనడంతో అందరూ నవ్వేశారు.

సోహెల్‌తో కలిసి వస్తాను..

సోహెల్‌తో కలిసి వస్తాను..

ఆ తర్వాత సార్ నేను కేఫే పెడితే తప్పుకుండా రావాలి అంటూ నాగార్జునను అఖిల్ కోరితే తప్పుకుండా వస్తాను. 100 శాతం వస్తాను. కానీ రాత్రి తొమ్మిది గంటల తర్వాతే నేను సోహెల్‌తో కలిసి వస్తాను అంటూ నాగ్ ఝలక్ ఇచ్చాడు. దాంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
M A S అని పేరు పెట్టూ అంటూ

M A S అని పేరు పెట్టూ అంటూ

అయితే నీ కేఫే‌కు A M అని పేరు పెట్టు బాగుంటుంది అంటూ నాగార్జున అంటే.. సోహెల్ జోక్యం చేసుకొంటూ.. S అనే అక్షరంతో పెట్టాలి అని సూచించాడు. దాంతో M A S అని పెట్టు మాస్ పేరు బాగుంటుంది అంటూ నాగార్జున సలహా ఇవ్వడంతో ఆ చర్చ అంతటితో ఆగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X