twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju కేరళలో నాగార్జున, చైతూ, కృతిశెట్టి సంక్రాంతి సంబురాలు.. జీ తెలుగులో హంగామా

    |

    తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ అనగానే భోగి మంటలు, కొత్త దుస్తులు, కనుమ పండుగ, హరిదాసులు, అత్త గారింటి వచ్చే అల్లుళ్ల సందడి కనిపిస్తాయి. కరోనావైరస్ పరిస్థితులు రాష్ట్రంలో ప్రతికూలంగా ఉన్న సమయంలో తమ ప్రేక్షకులకు మరింత వైవిధ్యమైన కంటెంట్ ఇచ్చేందుకు ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ సిద్దమైంది.

    సంక్రాంతి పండుగకు కోసం జీ తెలుగు తెలుగు రాష్ట్రాలను దాటి కేరళకు వెళ్లింది. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరున్న కేరళ సౌందర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించనుంది. కేరళలో జీ కుటుంబ సభ్యులు చేసుకుంటున్న సంక్రాంతి పండుగ వేడుకలను అద్భుతమైన ఫీలింగ్స్ అందించేందుకు సిద్దమైంది. డ్యాన్స్‌లు, కామెడీ స్కిట్‌లు, మ్యూజిక్‌తో సహా అన్ని ఈవెంట్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ప్లాన్ చేశారు. ఈ సంక్రాంతికి మీ అభిమాన తారలు చేసిన సందడి చూడడానికి సిద్ధంగా ఉండండి. 13, 14వ తేదీల్లో రెండు విభాగాలుగా ఈ వేడుకను ఛానల్ ప్రసారం చేయనుంది. వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సెలబ్రిటీలు, వినోదంతో కూడిన వేడుకలకు మరింత సందడి తీసుకు వచ్చారు.

    Nagarjuna Akkinenis Bangarraju team Sankranti celebration in Keral

    జనవరి 13 ఉదయం 9 గంటలకు కేరళలో సంక్రాంతి అల్లుళ్ల సందడి' మన జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతుంది. సంక్రాంతి ప్రత్యేకత, తెలుగు ప్రజలు పండుగను ఎంత గొప్పగా చేసుకుంటారో తెలుసుకునేందుకు మూడు గంటల పాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని చూసి తీరాల్సిందే. ఈ వేడుకలను తెలుగు ఇంటి ఆడపడుచు, కేరళ తనయ సుమ కనకాల హోస్ట్‌గా నిర్వహించారు. స్థానికంగా ప్రసిద్ధి చెందిన కలరిపట్టు పోరాటం, కొబ్బరి మరియు గోనె సంచులతో పోటీలు, సైక్లింగ్ పోటీ, కబడ్డీ తదితర యాక్టివిటీలు అందరినీ అలరిస్తాయి.

    సంక్రాంతి పండుగ వేడుకలను ఇతర పండుగల కన్నా అందుకే విభిన్నంగా చూపించేందుకు, భోగి మంటలతో మన జీ తెలుగు ఛానెల్ ఒక వేడుకను అద్భుతంగా రూపొందించింది. స్థానిక ప్రాచీన పద్ధతుల్లో ఒకటైన ప్రసిద్ధ వల్లం కళి (బోట్ రేస్)లో పాల్గొన్న తమ అభిమాన తారల్ని చూసి ప్రేక్షకులు ఆనందిస్తారు. కేరళలోని అందమైన బ్యాక్ వాటర్స్‌లో జీ తెలుగు కళాకారులు నాలుగు జట్లుగా విడిపోయి, ఉత్సాహంతో పోటీ పడడం వేడుకలను మరింత వినోదంగా మార్చాయి.

    జనవరి 14వ తేదీన ప్రసారమయ్యే రెండో భాగం 'బంగార్రాజు' టీంతో అనగా సూపర్ స్టార్లు నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టితో సహా పలువురు నటులు కనిపించనున్నారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా, మరింత ఉత్సహాన్ని ఈ షో అందించేందుకు జీ తెలుగు సిద్దమైంది. 'బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు' జనవరి 14 ఉదయం 9 గంటలకు ప్రారంభమై మూడు గంటల పాటు ప్రేక్షకులు వినోదాన్ని పంచి పెడుతుంది. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు టెలివిజన్ స్ర్కీన్‌పై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా ఈ కార్యక్రమం చేస్తుంది. సంక్రాంతి వేడుకలను చూసేందుకు మీ జీ తెలుగు ఛానెల్‌ను 13, 14వ తేదీల్లో ఉదయం 9 గంటలకు తప్పక వీక్షించండి అంటూ జీ తెలుగు తమ ప్రేక్షకులను కోరింది.

    English summary
    Zee Telugu had celebrated Sankranthi in Kerala" this year. The *Day 1 is hosted by ace anchor Suma Kanakala. While, Day 2 is celebrated with Team Bangaraju - Nagarjuna, Naga Chaitanya and Krithi Shetty. The whole segment will premiere on 13th and 14th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X