»   » నాగార్జునతో తెలుగులో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’

నాగార్జునతో తెలుగులో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వచ్చే 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనే హిందీ టీవీ రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఇలాంటి షో ఒకటి ఉంటే బాగుండని చాలా మంది ఆశిస్తున్నారు. అలాంటి వారికి ఒక శుభ వార్త. త్వరలో తెలుగులోనూ ఈ షో ప్రారంభం కాబోతోంది.

నాగార్జున వ్యాఖ్యాతగా 'కౌన్ బనేగా కరోడ్ పతి' తెలుగు వెర్షన్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. మాటీవీని కొనుగోలు చేస్తున్న సోనీ పిక్చర్స్ టెలివిజన్ సంస్థ 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమాన్ని తెలుగులో మాటీవీలో ప్రసారం చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Nagarjuna to host ‘Kaun Banega Crorepati’

మాటీవీలో 30% వాటా తీసుకుంటున్నట్లు సోనీ పిక్చర్స్ టెలివిజన్ వారు ఇటీవల ముంబై లో మొదలైన మూడు రోజుల ఫిక్కీ ప్రేమ్స్ సదస్సులో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఆ డీల్ ఇంకా పూర్తి కాలేదని మాటీవి చెప్తూ వస్తోంది. మాటీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మిగిలిన ప్రధాన వాటాదారులతో కూడా మాట్లాడిన తర్వాతే ఈ అమ్మకం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గ్రూఫ్ గా ఎదుగుతున్న మాటీవి మరో మూడు ఛానెల్స్ తో మన ముందుకు వస్తున్నట్లు సమాచారం. మా ఫ్యామిలీ, మా లైఫ్, మా కామెడీ ఛానెల్స్ అని వాటికి పేర్లు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మా నెట్ వర్క్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందని చెప్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట ఆఫీస్ వద్దే మరో భవంతి తీసుకుని అక్కడ ఈ కొత్త ఛానెల్స్ పని ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ ఛానెల్స్ లో జాబ్ కోసం ప్రకటన వస్తుందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మా నెట్ వర్క్ లో ...మా టీవీ, మా మూవీస్, మా మ్యూజిక్, మా గోల్డ్ ఛానెల్స్ ఉన్నాయి.

English summary
‘King’ Akkineni Nagarjuna will be hosting the latest season of the smash hit reality show ‘Kaun Banega Crorepati’. The regular shooting of this show will start soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu