»   » ‘కౌన్ బనేగా కరోడ్ పతి’వ్యాఖ్యాతగా నాగార్జున

‘కౌన్ బనేగా కరోడ్ పతి’వ్యాఖ్యాతగా నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హిందీలో సూపర్ హిట్ అయిన పోగ్రాం 'కౌన్ బనేగా కరోడ్ పతి'. అమితాబ్ వ్యాఖ్యాతగా నిర్వహించిన ఈ షో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ పోగ్రాం తెలుగులోకి రానుంది. సోనీ టీవీ నుంచి ఈ రియాల్టీ షో హక్కులను మాటీవీ సంపాదించింది. ఈ మేరకు షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ పోగ్రాంకి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యహరించనున్నారు. దీనికి సంభందించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మాటీవీలో ఈ పోగ్రాం ప్రసారం కానుంది. నాగార్జున టీవీ సీరియల్స్ నిర్మాతగానూ సుప్రసిద్దుడు.

నాగార్జున మాట్లాడుతూ... గత నాలుగు సంవత్సరాలుగా టీవీ సీరియల్స్ నిర్మిస్తున్నాము. ప్రస్త్తుతం అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థ మా టీవి, జీ తెలుగు ఛానళ్ళలో "పసుపు కుంకుమ'' "పుట్టింటి పట్టుచీర'' "శశిరేఖా పరిచయం'' సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. వీటికి గాను దాదాపు 300 మంది నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మా టీవితో మాకున్న అనుబంధం వలన ఆ ఛానల్ కే సీరియళ్ళు చేస్తామని అనుకున్నారు. అయితే మేము అన్ని ఛానల్ లకు చేయాలని అనుకున్నాము. అందులో భాగంగా జీ తెలుగు కు కూమా మా సీరియల్ ను అందిస్తున్నాము అన్నారు అక్కినేని నాగార్జున.

Nagarjuna

అలాగే... మా టీవిలో ప్రసారం అవుతున్న "పుట్టింటి పట్టుచీర'' సినిమా 1.5 రేటింగ్ తో ప్రారంభమైతే చాలని అనుకున్నాము. కానీ 2 రేటింగ్ తో ప్రారంభమై నేడు 2.8 రేటింగ్ కు చేరుకుంది. సీరియల్స్ లో విలనిజం కనిపించకూడదని ముందుగానే చెప్పాను. మేం చేసిన అన్ని సీరియళ్ళు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో కూడినవే. ప్రస్తుతం ప్రసారం కాబోతున్న "శశిరేఖా పరిణయం'' సీరియల్ కూడా కుటుంబ విలువలతో కూడినది. ప్రతి తెలుగింటి ప్రేక్షకులకు ఈ సీరియల్ నచ్చుతుంది అన్నారు.

English summary
Akkineni Nagarjuna will be hosting the latest season of the smash hit reality show ‘Kaun Banega Crorepati’. MAA TV has been bought over by Sony and this is the reason why this show will be telecast on MAA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu