For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: బిగ్ బాస్ రేటింగ్ తగ్గడంపై నాగార్జున రియాక్షన్.. హ్యాపీగా ఉందని షాకింగ్ గా

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మంచి జోరుగా సాగుతోంది. గత రెండు రోజులుగా హౌజ్ లో గొడవలు, వాగ్వాదాలు, అరుచుకోవడాలు లేకుండా ఎంటర్టైన్ చేసేందుకు ట్రై చేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం హౌజ్ లో బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఇంటి సభ్యులందరు కూడా బిగ్ బాస్ ను ఎంటర్టైన్ చేసేందుకు బాగానే కష్టపడుతున్నారు. ఫైమా సీక్రెట్ టాస్క్ చేయగా, ఇనయా ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇక స్కూల్ స్కిట్ లో చిన్న పిల్లలా అందరు బాగానే నవ్వించారు. అయితే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటూ నాగార్జున చెబుతున్న బిగ్ బాస్ కు రేటింగ్ మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ విషయంపై ఇటీవల స్పందించాడు నాగార్జున.

   మరింత కొత్తగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో..

  మరింత కొత్తగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో..

  తెలుగులో బిగ్ బాస్ ‌షో ఇప్పటికే 4 రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. దీంతో ఇది మరింత కొత్తగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతోంది. కానీ, ఈ సీజన్‌కు గతంలో వాటికి మాదిరిగా రేటింగ్ మాత్రం స్పందన మాత్రం దక్కట్లేదు. దీంతో రేటింగ్ క్రమంగా పడిపోతోంది.

  ఇప్పటికీ నలుగురు..

  ఇప్పటికీ నలుగురు..

  ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు మొత్తం 21 మంది హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో నాలుగు వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహి ఎలిమినేట్ అయ్యారు.

   కేవలం 8.86 రేటింగ్ మాత్రమే..

  కేవలం 8.86 రేటింగ్ మాత్రమే..

  బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ తో పోలిస్తే వీరంతా కొత్త ముఖాలే అని ప్రేక్షుకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇక రేటింగ్ విషయానికొస్తే.. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ఫస్ట్ సీజన్ కు 16.18, నాని సెకండ్ సీజన్ కు 15.05 రేటింగ్స్ వచ్చాయి. ఇక మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. 3వ సీజన్ 17.9, 4వ సీజన్ 18.5, ఐదో సీజన్ 18 రేటింగ్స్ వచ్చాయి. ఇక ఈ ఆరో సీజన్ కు కేవలం 8.86 రేటింగ్ మాత్రమే వచ్చిందని సమాచారం.

   వీకెండ్ లో 3.62 రేటింగ్..

  వీకెండ్ లో 3.62 రేటింగ్..

  ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ తెలుగు 6 వీకెండ్ లో 3.62 ఉంటే వీక్ డేస్ లో సరాసరి 2.23 టీఆర్పీ రేటింగ్ ఉంటోదట. అయితే ఈ రేటింగ్స్ పై ఇటీవల ది ఘోస్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్పందించాడు. బిగ్ బాస్ తెలుగు 6 రేటింగ్ గురించి మీడియా వేసిన ప్రశ్నలకు షాకింగ్ గా సమాధానం చెప్పాడు. బిగ్ బాస్ కు వస్తున్న అతి పేలవమైన రేటింగ్ చూసి తాను కూడా ఆందోళన చెందినట్లు ఆయన చెప్పాడు.

   టీవీలలో చూసేవాళ్లు తగ్గినా..

  టీవీలలో చూసేవాళ్లు తగ్గినా..

  కానీ వ్యూవర్ షిప్ పెరగడం చాలా ఆనందంగా ఉందన్నాడు నాగార్జున. టీవీలలో చూసేవాళ్లు తగ్గినా.. ఓటీటీ యాప్ వ్యూవర్స్ పెరిగారని తెలిపాడు. టీవీల్లో చూసేవారంతా యాప్ కి షిప్ట్ అయి అక్కడ చూస్తున్నారని, దీంతో అక్కడ వ్యూవర్ షిప్ పెరిగిందన్నాడు నాగార్జున. అంటే స్టార్ మా ఛానెల్ లో చూసేవారికంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ షో చూసేవాళ్ల సంఖ్య అధికంగా పెరిగిందని ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్స్ కూడా పెరిగాయని, అందుకే చాలా హ్యాపీగా ఉందని నాగార్జున తెలిపాడు.

   ఎందుకు తగ్గిందన్న అనుమానాలు..

  ఎందుకు తగ్గిందన్న అనుమానాలు..

  ఇదిలా ఉంటే గత మూడు సీజన్లు కూడా ఓటీటీలు ప్రసారం అయ్యాయి. అప్పుడు తగ్గని టీఆర్పీ రేటింగ్ ఈ సీజన్ కు ఎందుకు తగ్గిందన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఓటీటీల వాడకం అప్పటికన్నా ఇప్పుడు పెరిగి ఉండొచ్చనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వార్తలపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కాగా బిగ్ బాస్ తెలుగు 6 ఐదో వారం ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌ 8 మంది నామినేట్ అయ్యారు.

  English summary
  Bigg Boss Telugu 6th Season Host Akkineni Nagarjuna First Reaction On Low Rating And Says Happy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X