దివ్వెల మాధురి అహంకారానికి నాగార్జున బ్రేక్‌.. షాకింగ్ తీర్పు ఇచ్చిన ప్రేక్షకులు..

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌ తెలుగు 9 రసవత్తరంగా సాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో గేమ్ ఫార్మట్ మారిపోయిన విషయం తెలిసిందే. కొందరూ కంటెస్టెంట్లు బిగ్ బాస్ రూల్స్ ను దిక్కరిస్తూ.. తామే లీడర్స్ గా భావిస్తున్నారు. అలాంటి కంటెస్టెంట్ల తోకలు కత్తిరించడానికి హోస్ట్ కింగ్ నాగార్జున వచ్చేశారు. తన స్టైలిష్ ఎంట్రీతో వీకెండ్ ఎపిసోడ్‌ ను స్పెషల్ గా మార్చారు. అలాగే.. తేడా కంటెస్టెంట్లకు తనదైన స్టైల్ లో మాస్ వార్నింగ్ తో షోలో హీట్ పుట్టించారు. తాజాగా విడుదలైన ప్రొమో చాలా స్పెషల్ గా మారింది. మెయిన్ గా దువ్వాడ మాధురికి ఓ రేంజ్ లో క్లాస్ పీకారు. అసలేం జరిగిందంటే?

బిగ్ బాస్ రీ లంచ్ పేరిట వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం షోలో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో ఆరుగురు కొత్తగా వచ్చిన వైల్డ్‌కార్డ్స్‌. అందరిలో ఎక్కువ చర్చకు దారితీసిన పేర్లు రెండు దివ్వెల మాధురి, ఆయేషా! వీరిద్దరూ షోను పూర్తిగా డామినేట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని హౌస్‌లోని సభ్యులు, ప్రేక్షకులు కామెంట్‌ చేస్తున్నారు. ఇలా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల ప్రవర్తనలతో హౌస్‌లో ఉద్రిక్తత పెరిగిపోయింది.

Nagarjuna s Stylish Warning to Madhuri Divvala Shakes Bigg Boss Telugu 9

ఆయేషా అరుపులు, మాధురి ఆజమాయిషీ
వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో వచ్చిన ఆయేషా, మొదటి రోజునుంచే డ్రామాటిక్‌ అటిట్యూడ్‌తో అందరినీ షాక్‌కు గురి చేసింది. "అరుపులు, ఏడుపులు తప్ప ఏదీ లేదు" అంటూ తనూజను నామినేట్‌ చేసే ప్రయత్నంలో ఆయేషా డ్రామాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్‌లో గట్టిగా అరుస్తూ, చిన్న విషయానికే ఏడుస్తూ హౌస్‌లో కలకలం రేపుతోంది. ఇక మరోవైపు దివ్వెల మాధురి మాత్రం "హౌస్‌కి నేను రెండో బిగ్‌బాస్‌ని" అన్నట్లుగా అందరిని కంట్రోల్‌ చేయాలనే ప్రయత్నం చేస్తోంది. తన రూల్స్ నచ్చకపోతే.. హౌస్ నుంచి వెళ్లిపోమని వార్నింగ్స్ కూడా ఇచ్చేసింది.

కళ్యాణ్‌తో గొడవ.. మాధురికి నాగార్జున క్లాస్‌
మాధురి, కల్యాణ్‌ మధ్య చోటుచేసుకున్న వివాదం ఈ వారం నాగార్జున దృష్టికి వచ్చింది. "ఆ గొడవలో తప్పెవరిది?"అని కెప్టెన్‌ సుమన్‌ ను కింగ్ నాగార్జున అడగ్గా .. సుమన్ ఎలాంటి బెరుకు లేకుండా "మాధురిదే సర్‌" అని చెప్పేశాడు. వెంటనే వీడియో క్లిప్‌ ప్లే చేసి నాగార్జున పరిశీలించారు. "మాటలలో తప్పు లేదు, కానీ మాట్లాడిన తీరు తప్పు" అంటూ మాధురిపై ఫైర్‌ అయ్యారు కింగ్. "నా గొంతే అలా ఉంటుంది" అంటూ తనని తాను మాధురి కవర్‌ చేసుకోవాలనుకున్నా, "ఇప్పుడు నీ గొంతు అలా లేదు కదా" అంటూ నాగ్‌ సూటిగా ప్రశ్నించారు. "నీ మాట తీరు నీకు ఎత్తుకి తీసుకుపోతుంది.. అదే కిందపడేసే ప్రమాదం కూడా ఉంది" అని నాగార్జున సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

మాధురి సూపర్‌పవర్‌ రద్దు.. షాకింగ్ తీర్పు ఇచ్చిన ప్రేక్షకులు
వైల్డ్‌కార్డ్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాధురికి ఎలిమినేషన్‌ రద్దు చేసే 'సూపర్‌పవర్‌' ఇచ్చారు. అయితే ఆ పవర్‌ ఉంచాలా? తీసేయాలా? అని నాగార్జున స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను అడగగా, వారిలో 60 శాతం మంది "తీసేయాలి" అని ఓటేశారు. దీంతో మాధురి పవర్‌ అధికారికంగా రద్దయింది. "ఆ షీల్డ్‌లో ఉన్న ఆవిడ పవర్‌ స్టోన్‌ తీసేయండి" అంటూ నాగార్జున ప్రకటించగానే హౌస్‌లో టెన్షన్‌ ఫుల్‌గా మారింది.

ఆయేషా పవర్‌పై ప్రశ్నల వర్షం
తర్వాత నాగ్‌.. ఆయేషా దగ్గర ఉన్న "పవర్ ఆఫ్ నామినేషన్"పై చర్చ మొదలుపెట్టారు. "ఆమె దానికి అర్హురాలా?" అని అడగగా తనూజ సపోర్ట్ చేస్తూ, "ఆమె రావడమే టార్గెట్‌తో వచ్చింది" అంది. వెంటనే నాగ్‌ "నీకు తెలుసు కదా, టార్గెట్ నువ్వే అని" అంటూ ఆమెను ప్రశ్నించారు. రీతూ కూడా "నాకు ఆమె పవర్‌పై అభ్యంతరం లేదు" అని మొదట చెప్పినా, చివరికి "ఆమె నామినేషన్ పవర్ అవసరం లేదనుకుంటున్నాను" అంటూ వెనక్కి తగ్గింది. నాగార్జున "ఇది నీ గురించి కాదు అమ్మా, హౌస్ డైనమిక్స్ గురించి" అంటూ ఆమెకు క్లాస్‌ పీకారు.

వీకెండ్ ఎపిసోడ్ నాగ్ కౌంటర్‌లు హైలైట్‌
ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున ఫన్నీ, సీరియస్‌నెస్ మిక్స్‌తో షోను దుమ్ముదూలిపించారు. వైల్డ్‌కార్డ్స్‌ వచ్చిన వారం రోజుల్లోనే హౌస్‌ టోన్‌ మారిందని, కొందరి ఆత్మవిశ్వాసం అహంకారంగా మారిందని వ్యాఖ్యానించారు. "వచ్చీ రాగానే ఎవరికీ బాస్ అవ్వాలనుకోవద్దు" అంటూ ఆయన హౌస్‌కి క్లియర్‌ మెసేజ్‌ ఇచ్చారు. మొత్తానికి ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో నాగార్జున నిర్ణయాలు, ప్రేక్షకుల తీర్పులు కలసి వైల్డ్‌కార్డ్స్‌కి పెద్ద షాక్‌ ఇచ్చాయి. మాధురి పవర్‌ లాస్‌ ఆమెకు గట్టి పాఠం నేర్పగా, ఆయేషా డ్రామా ఇంకా హౌస్‌లో కొనసాగుతూనే ఉంది. ఇక రాబోయే ఎపిసోడ్‌ల్లో కంటెస్టెంట్ల మధ్య భారీ యుద్దాలు జరుగుతాయనడంతో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X