For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 6: ముద్దు ఎలా పెట్టుకుంటారు? స్నానం ఎలా చేస్తారు? ఆ జంటకు నాగార్జున పిచ్చి ప్రశ్నలు

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో అన్నింటికీ ప్రేక్షకుల మద్దతు లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిది గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అయ్యే షోను అసలు మన వాళ్లు ఆదరిస్తారా అంటే.. అవును ఆదరిస్తారు. దీనికి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోనే ప్రత్యేకమైన ఉదాహరణ. ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి వచ్చిన ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను భారీ టీఆర్పీ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఆరో సీజన్‌ను నిర్వహకులు మొదలు పెట్టారు. ఇక, ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఓ జంటకు నాగార్జున పిచ్చి ప్రశ్నలు వేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!

  ఆరో దాన్ని కూడా మొదలెట్టారుగా

  ఆరో దాన్ని కూడా మొదలెట్టారుగా

  బిగ్ బాస్ ప్రియులంతా ఆరో సీజన్ గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. సెప్టెంబర్ 4 అంటే గత ఆదివారం సాయంత్రం ఇది ప్రారంభం అయింది. అక్కినేని నాగార్జునే దీన్ని కూడా హోస్ట్ చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు ఆటపాటలతో అందరినీ అలరించారు.

  హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

   రికార్డు స్థాయిలో ఎంట్రీ ఇచ్చారుగా

  రికార్డు స్థాయిలో ఎంట్రీ ఇచ్చారుగా

  గతంలో లేని విధంగా ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి వెళ్లారు. అందులో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు ఉన్నారు.

  స్పెషల్ కంటెస్టెంట్లుగా జంట రాక

  స్పెషల్ కంటెస్టెంట్లుగా జంట రాక

  ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీలు మాత్రమే జంటగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  సరయు రాయ్ ఎద అందాల జాతర: చీర కొంగును పక్కకు జరిపి మరీ!

  అందుకే వచ్చామని చెప్పిన జంట

  అందుకే వచ్చామని చెప్పిన జంట

  బుల్లితెర జంట మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని ఓ రొమాంటిక్ సాంగ్‌తో బిగ్ బాస్ స్టేజ్‌ మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున వాళ్లను లవ్ స్టోరీ చెప్పమని అడిగాడు. దీంతో తామిద్దరం ఎలా కలిశామో చెప్పారు. తమలో తమకు మార్పులు తెలియాలని, ఛాలెంజ్‌లు ఎదుర్కోవడం ఇష్టం అని, అందుకే బిగ్ బాస్ షోలోకి వచ్చామని మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని వెల్లడించారు.

   పర్సనల్ క్వశ్చన్‌లకు సమాధానం

  పర్సనల్ క్వశ్చన్‌లకు సమాధానం

  ఆరో సీజన్‌లో కంటెస్టెంట్లు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన సమయంలో హోస్ట్ అక్కినేని నాగార్జున వాళ్లకు పలు రకాల టాస్కులు ఇచ్చి సందడి చేశాడు. ఇందులో భాగంగానే మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని ఎంట్రీ ఇవ్వగానే వాళ్లిద్దరినీ పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. దీంతో వాళ్లిద్దరూ ఆయనకు సహకరించడంతో పాటు చాలా విషయాలను సంకోచించకుండానే బయటపెట్టారు.

  JGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం

  వాళ్లిద్దరి సింక్ తెసుకునే టాస్కుతో

  వాళ్లిద్దరి సింక్ తెసుకునే టాస్కుతో

  గ్లామర్ ఫీల్డుకు చెందిన జంట మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని స్టేజ్ మీద ఉన్న సమయంలో నాగార్జున వాళ్లిద్దరి సింక్ (అండర్‌స్టాండింగ్)ను తెలుసుకునేందుకు ఓ టాస్క్ ఆడించాడు. ఇందులో నాగ్ ఓ ప్రశ్న అడిగి ఇద్దరినీ సమాధానాలు చెప్పమన్నాడు. ఆ సమయంలో స్నానం ఎలా చేస్తారు? ఇద్దరిలో బెస్ట్ కిస్సర్ ఎవరు? ఐలవ్యూ ఎక్కువగా చెప్పేది ఎవరు? అని అడిగాడు.

  ఒకటి తప్ప.. అన్నీ కరెక్టుగా చెప్పి

  ఒకటి తప్ప.. అన్నీ కరెక్టుగా చెప్పి

  సింక్ టాస్కులో భాగంగా మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని దాదాపుగా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగానే బెస్ట్ కిస్సర్ మెరీనానే అని ఇద్దరూ చెప్పారు. అలాగే, స్నానం ఇద్దరూ ఎక్కువ సేపు చేస్తామని అన్నారు. అయితే, రెడీ అయ్యే విషయంలో మాత్రం ఇద్దరూ సరైన సమాధానం చెప్పలేదు. మొత్తానికి ఈ టాస్కు వల్ల నాగ్‌పై విమర్శలు వస్తున్నాయి.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Started Last Sunday. Nagarjuna Unexpected Questions to Marina And Rohit in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X