For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 7: బిగ్ బాస్‌కు బాలయ్య షాకింగ్ కండీషన్స్.. నాగార్జునకు మరో దెబ్బ.. ఇండస్ట్రీలో కలకలం

  |

  దేశంలోని చాలా భాషల్లోనూ సత్తా చాటుతోన్న షోలలో 'బిగ్ బాస్'ఒకటి. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ షోకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం ఇందులో చూపించే కంటెంటే అని చెప్పొచ్చు. అలాగే, ఈ షో విజయంలో దీన్ని హోస్ట్ చేసిన హీరోల పాత్ర కూడా ఎంతో ఉంది. ఇక, దీనికి కొన్ని సీజన్లుగా హోస్టుగా చేస్తోన్న నాగార్జున వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో బాలయ్యను బిగ్ బాస్ టీమ్ సంప్రదించగా ఓ షాకింగ్ కండీషన్స్ పెట్టారట. ఆ వివరాలు మీకోసం.!

  సెలెబ్రిటీలను చేసిన ఏకైక షో

  సెలెబ్రిటీలను చేసిన ఏకైక షో

  బిగ్ బాస్ షో తెలుగులో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు, దేశంలోనే మరే షోకూ రానంత రేటింగ్‌ను సంపాదించుకుని టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. మరోవైపు, బిగ్ బాస్ షోలోకి ఇప్పటి వరకూ ఎంతో మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు.

  సీరియల్ నటి ఎద అందాల బీభత్సం: హద్దు దాటి మరీ ఓవర్ డోస్ షో

  ఇప్పటి వరకూ గెలిచింది వీళ్లే

  ఇప్పటి వరకూ గెలిచింది వీళ్లే

  తెలుగు బిగ్ బాస్ షో చరిత్రలో విజేతలుగా నిలిచిన వాళ్లలో ఒక్కరు తప్ప అందరూ మగవాళ్లే అని తెలిసిందే. మొదటి సీజన్‌లో శివ బాలాజీ, రెండో దానిలో కౌశల్ మండా, మూడో సీజన్‌లో రాహుల్, నాలుగో సీజన్‌లో అభిజీత్, ఐదో సీజన్‌లో వీజే సన్నీ, ఆరో సీజన్‌తో రేవంత్‌లు గెలుపొందారు. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో మాత్రమే బిందు మాధవి విజేత అయింది.

  షో సక్సెస్‌లో ఆ హీరోల పాత్ర

  షో సక్సెస్‌లో ఆ హీరోల పాత్ర

  తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికి అన్నీ కలుపుకుని ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున తమ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. తప్పు చేసిన కంటెస్టెంట్లను మందలించడం.. బాగా చేస్తే ప్రోత్సహించడం వంటివి చేసి ఈ షోను నెంబర్ వన్ చేయడంతో కీలక పాత్రలు పోషించారు.

  కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!

  ఆరో సీజన్ ఫ్లాప్... నాగ్ ఔట్

  ఆరో సీజన్ ఫ్లాప్... నాగ్ ఔట్


  తెలుగులో బిగ్ బాస్ షో ఎంతటి సక్సెస్ అయిందో తెలిసిందే. కానీ, ఇటీవలే ముగిసిన ఆరో సీజన్ మాత్రం మొదటి నుంచే ఎంతో చప్పగా సాగింది. దీనికితోడు ఫేక్ ఎలిమినేషన్స్, పసలేని టాస్కులు, లవ్, రొమాన్స్, గొడవలు అంతగా లేకపోవడంతో దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దీంతో ఈ షో నుంచి హోస్ట్ నాగార్జున తప్పుకున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  ఏడో సీజన్‌ కోసం ప్లాన్స్ రెడీ

  ఏడో సీజన్‌ కోసం ప్లాన్స్ రెడీ


  బిగ్ బాస్ షో నుంచి హోస్ట్ అక్కినేని నాగార్జున తప్పుకున్నాడని తెలిసినప్పటి నుంచి ఇందులో ఆయన స్థానాన్ని భర్తీ చేసేది ఎవరన్న దానిపై చర్చలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా పేరు ముందుగా బయటకు వచ్చింది. అలాగే, మరికొందరు స్టార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అలాగే, ఏడో సీజన్‌ను త్వరగా తీసుకు రాబోతున్నారని కూడా తెలుస్తోంది.

  హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

  బాలయ్యతో టీమ్ చర్చలు

  బాలయ్యతో టీమ్ చర్చలు


  వచ్చే ఏడాది ప్రసారం కానున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు హోస్టుగా నాగార్జున చేయడం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణను సంప్రదించారని తెలిసింది. ఇప్పటికే ఆయనతో పలుమార్లు ఈ విషయంపై చర్చలు కూడా చేశారని అంటున్నారు. దీంతో బిగ్ బాస్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  బాలయ్య షాకింగ్ కండీషన్స్

  బాలయ్య షాకింగ్ కండీషన్స్

  తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో చేయడానికి బాలయ్య కొన్ని కండీషన్స్ పెట్టారని తెలిసింది. దీని ప్రకారం.. ఆయన ఈ షోతో పాటు అన్‌స్టాపబుల్‌లోనూ చేస్తానని చెప్పారట. ముఖ్యంగా బిగ్ బాస్ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలో కాకుండా ఇంకా ఎక్కడైనా పెట్టాలని కూడా కండీషన్ పెట్టారట. ఇందులో ఎంత నిజముందో కానీ, ఇది ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

  English summary
  Bigg Boss Telugu Top Rreality Show Completed Six Seasons Successfully. Now Makers Planing for 7th One. This Season Likely to Start From July 7th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X