Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
HBDRaviKrishna: రవికృష్ణను విష్ చేస్తూ నవ్య స్వామి స్పెషల్ పోస్ట్.. కొడుకు పుడితే నీలానే అంటూ!
తెలుగు బుల్లితెరపై ఎక్కువ శాతం హీరోయిన్లకే అభిమానులు ఉంటారు. కానీ, ఓ హీరోకు మాత్రం అంతకు మించిన ఆదరణ దక్కుతోంది. అతనే.. మిస్టర్ టెలివిజన్ రవికృష్ణ. పర్‌ఫెక్ట్ ఫిజిక్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో లేడీ ఫాలోయింగ్‌ను అందుకున్న ఈ కుర్ర హీరో.. వరుస ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. నేడు రవికృష్ణ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని సెలెబ్రిటీలంతా అతడికి విష్ చేస్తున్నారు. అందులో నవ్య స్వామి, శివ జ్యోతి చేసిన పోస్టులు ప్రత్యేకంగా నిలిచాయి. ఆ సంగతులు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్
సాదాసీదా ఆర్టిస్టులగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు రవికృష్ణ. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను చేసిన అతడు.. సూపర్ హిట్ సీరియల్ 'మొగలిరేకులు'తో ఎనలేని గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన అతడు.. తర్వాత హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే 'వరూధినీ పరిణయం'తో తెలుగులో ఎనలేని క్రేజ్‌ను అందుకుని సత్తా చాటాడు.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. మంచి పేరుతో
'వరూధినీ పరిణయం' తర్వాత రవికృష్ణ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి అతడు బిజీ హీరోగా ఎదిగిపోయాడు. ఈ సమయంలోనే అతడికి బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండా అందులోకి ఎంట్రీ ఇచ్చిన రవికృష్ణ.. మంచి ఆటతో చాలా రోజులు కొనసాగాడు. అదే సమయంలో మంచోడిగా పేరును సంపాదించుకున్నాడు.

వరుస ఆఫర్లు... అందులో మరొకలా
బిగ్ బాస్ షో పుణ్యమా అని సీరియల్ హీరో రవికృష్ణ మంచి పేరును సంపాదించుకున్నాడు. అదే సమయంలో క్రేజ్‌ను కూడా రెట్టింపు చేసుకున్నాడు. ఫలితంగా అతడికి వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రవికృష్ణ 'ఆమెకథ' అనే సీరియల్ చేశాడు. ఇందులో అతడు తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. నవ్య స్వామీ ఇందులో హీరోయిన్‌గా నటించింది.

ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం అంటూ
'ఆమె కథ'లో కలిసి పని చేసినందుకో.. మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. రవికృష్ణ.. న్యవ స్వామీతో ప్రేమాయణం సాగిస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ కొన్ని షోలలో అలాగే ప్రవర్తించారు. మరీ ముఖ్యంగా ఆ మధ్య క్యాష్ షోలో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. దీంతో ఈ జంట విపరీతంగా ఫేమస్ అయిపోయింది.

సినిమా హీరోలకు తీసిపోని విధంగా
హ్యాండ్సమ్ లుక్‌తో కనిపించే రవికృష్ణ.. ఫిజిక్‌ను కూడా పర్‌ఫెక్ట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో ఎంతగానో కష్టపడుతుంటాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా అతడు సిక్స్ ప్యాక్‌ను కూడా తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తద్వారా అందులో ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు.

రవికృష్ణకు నవ్య స్వామి స్పెషల్ పోస్ట్
జూన్ 9 అంటే ఈరోజు రవికృష్ణ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని నవ్య స్వామీ సోషల్ మీడియాలో అతడితో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అతడికి కేక్ తినిపిస్తూ దిగిన ఫొటోను ముందుగా షేర్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత జంటగా ఉన్న పిక్‌ను వదిలింది. ఎప్పటికీ సంతోషంగా ఉండాలని పోస్ట్ చేసింది. దీనికి రవికృష్ణ 'థ్యాంక్స్ రౌడీ ఫెలో' అని రిప్లై కూడా ఇచ్చాడు.

కొడుకు పుడితే నీలానే అంటూ ఆమె
బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి అలియాస్ సావిత్రితో రవికృష్ణకు ఎలాంటి బంధం ఏర్పడిందో అందరికీ తెలుసు. ఈరోజు అతడి పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె 'కొడుకు పుడితే నీలా పెంచాలి అనేంత ప్రేమ.. ఒకవేళ పుట్టకపోయిన ఏం కాదు.. ఎందుకంటే నా కొడుకువు నువ్వు ఉన్నావు అన్న నమ్మకం' అంటూ పోస్ట్ చేసింది. దీనికి రవికృష్ణ 'లవ్ యూ అమ్మ' అంటూ బదులిచ్చాడు.