»   » చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను దెబ్బ కొట్టేందుకేనా?

చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను దెబ్బ కొట్టేందుకేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీలో పాపులర్ అయిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమాన్ని తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ప్రసారమైన తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ప్రసారం అవుతున్న నాలుగో సీజన్ ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తున్నారు.

అయితే ఈ షో మీద ముందు నుండి సోషల్ మీడియాలో కొంత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నప్పటి నుండే దీనిపై నెగెటివ్ ప్రచారం మొదలైంది. తాజాగా చిరంజీవి హోస్ట్ గా షో మొదలయ్యాక వాట్సాఫ్ లో ఈ షో మీద నెగెటివ్ ప్రచారం మరింత ఎక్కువైంది.

Negative campaign against MEK 4

షో చూసే వారు కూడా ఓ ప్రశ్నకు ఎస్ఎంఎస్ ద్వారా సరైన జవాబులు పంపిన వారిలో ఒక విజేతను లాటరీ ద్వారా ఎంపిక చేసి రూ.10 వేలు అందజేస్తారు. అయితే, ఇదంతా ఓ చట్టబద్ధమైన మోసమంటూ ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా వాట్సప్‌లో కొన్ని సందేశం చక్కర్లు కొడుతోంది.

షో నిర్వాహకులు ఎస్ఎంఎస్ రూ. 15 వసూలు చేస్తున్నారని, లక్షల మంది నుండి కోట్ల వసూలు చేస్తున్నారు. అందులో లాటరీ పద్దతిలో ఒకరిని విజేతగా ఎంపిక చేస్తారు..... ఈ మాయలో పడి ఎంతో మంది పేదలు డబ్బులు పోగొట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. లాటరీ టిక్కెట్లను బ్యాన్ చేసిన ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం విచారకరం అంటూ ఓ మెసేజ్ వాట్సాప్ లో వైరల్ అయింది.

English summary
Negative campaign strarted against meelo evaru koteeswarudu season 4. Meelo Evaru Koteeswarudu is a Telugul television game show, which is hosted by Mega star chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu