For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!

  |

  తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును అందుకుంటున్నారు. అలాంటి వారిలో నటి, యాంకర్ హరితేజ ఒకరు. సీరియల్ నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత యాంకర్‌గా మారి తన సత్తాను నిరూపించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక, ఈ మధ్యనే ఓ బిడ్డకు తల్లైన హరితేజ.. ప్రస్తుతం వరుసగా యూట్యూబ్ వీడియోలు, షోలు, సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ టాలెంటెడ్ నటి హరితేజకు సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన పని వల్ల చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ పూర్తి వివరాలు మీకోసం!

   అలా వచ్చింది... ఇలా పాపులర్

  అలా వచ్చింది... ఇలా పాపులర్

  హరితేజ ముందుగా కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే 'మనసు మమత' అనే సీరియల్‌లో నటించి మంచి గుర్తింపును అందుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాత 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' సహా పలు సీరియళ్లలో నటించి సత్తా చాటింది. దీంతో అందరి దృష్టిలో పడిపోయింది. అదే సమయంలో బాగా పాపులర్ కూడా అయింది.

  Rashmika Mandanna: స్పోర్ట్స్ బ్రాతో శ్రీవల్లి రచ్చ.. నాకిష్టం అంటూ అలా చూపిస్తూ!

  యాంకర్‌గా మారి.. సత్తాను చాటి

  యాంకర్‌గా మారి.. సత్తాను చాటి

  హరితేజ వరుసగా టీవీ సీరియళ్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే 'అభిరుచి' అనే వంటల కార్యక్రమంతో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసింది. ఈ క్రమంలోనే 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా బెస్ట్ యాంకర్‌గా దూసుకెళ్లింది. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లతో పాటు మరికొన్ని రకాల కార్యక్రమాలను సైతం చేసింది. తద్వారా యాంకర్‌గానూ తన సత్తాను నిరూపించుకుంది.

  బిగ్ బాస్ ఎంట్రీ.. లైఫ్ మారింది

  బిగ్ బాస్ ఎంట్రీ.. లైఫ్ మారింది

  కెరీర్ పరంగా వరుస షోలు, సినిమాలు చేస్తూ సాగిపోతోన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుంది. అంతేకాదు, ఓటింగ్‌లోనూ సత్తా చాటుతూ ఫినాలేకు చేరుకుంది. అయితే, చివర్లో గెలవకపోయినా మూడో స్థానంలో నిలిచిందామె. ఇందులో విజయం సాధించకున్నా హరితేజకు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఆమె లైఫ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పుకోవాలి.

  గౌతమ్‌ పుట్టినప్పుడే ఆ సమస్య.. మాకు డబ్బుంది వాళ్లకు లేదు కదా: బాలయ్య షోలో మహేశ్ ఎమోషనల్

  సినిమాల్లో సత్తా.. అలాంటి పాత్ర

  సినిమాల్లో సత్తా.. అలాంటి పాత్ర

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తన హవాను చూపించిన హరితేజ.. వెండితెరపైకి కూడా అడుగులు వేసింది. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం.. విజయవంతంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన ఛాలెంజింగ్ పాత్రలను పోషించింది. తద్వారా బడా హీరోల సినిమాల్లో సైతం ఛాన్స్ పట్టేసింది. 'అఆ'లో ఆమె చేసిన మంగమ్మ పాత్ర బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

  కరోనాతో డెలివరీ.. వాటికి దూరం

  కరోనాతో డెలివరీ.. వాటికి దూరం

  హరితేజ.. దీపక్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక, గత ఏడాదే ఈ జంటకు ఓ పాప పుట్టింది. తన డెలివరీ సమయంలో పడిన కష్టాలను వివరిస్తూ ఆ మధ్య హరితేజ ఎమోషనల్ కూడా అయింది. ఆ సమయంలో తనకు కరోనా సోకిందని.. అప్పుడు తన బిడ్డను డాక్టర్లు చూపించలేదని చెప్పి బాధ పడింది. కానీ, కోలుకున్న తర్వాత బిడ్డతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఇక, ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లు, షోలు పెద్దగా చేయకున్నా 'హరి కథలు' అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో ఎన్నో వీడియోలు చేస్తూ అలరిస్తోంది.

  Priyanka Chopra: సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక చోప్రా.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచలన ప్రకటన

  హరితేజకు షాకిచ్చిన నెటిజన్లు

  హరితేజకు షాకిచ్చిన నెటిజన్లు

  సోషల్ మీడియాలో హరితేజ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా చాలా మంది ఫ్యాన్స్ ఆమె కూతురి గురించి, హరితేజ కెరీర్‌ గురించి కూడా వాకబు చేశారు. ఈ క్రమంలోనే కొందరు మాత్రం పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఆమెను విసిగించేశారు. అయినప్పటికీ ఆమె మామూలుగానే సమాధానాలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నెటిజన్లు హరితేజతో చాలా బ్యాడ్‌గా ప్రవర్తించారు. వీటికి మాత్రం ఆమె హుందాగా వ్యవహరించి సరైన సమాధానాలు చెప్పింది.

  ఎదవ ఓవరాక్షన్.. కరోనా రావాలి

  ఎదవ ఓవరాక్షన్.. కరోనా రావాలి

  హరితేజ 'డోలో సారీ బోలో' అనే సెషన్‌ నిర్వహించింది. దీంతో ఓ నెటిజన్ 'నువ్వూ.. నీ ఎదవ ఓవర్ యాక్టింగ్. ఇంత సీరియస్ సిచువేషన్స్‌లో కూడా నీ సిల్లీ జోక్స్. థూ..' అని రాసుకొచ్చాడు. దీనికామె.. 'అబ్బో మస్త్ బీపీ వస్తోందీ సార్ మీకు. సల్లబడండి జర. నవ్వుకుంటే అన్ని బాధలు పోతాయని నమ్ముతా అంతే. కొంచెం పద్దతిగా ప్రవర్తించండి' అని ఆన్సర్ ఇచ్చింది. ఇక, మరో నెటిజన్ 'నీకు కరోనా పాజిటివ్ రావాలి' అని షాకిచ్చాడు. దీనికి హరితేజ 'మీకు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి. గాడ్ బ్లెస్ యూ' అంటూ పద్దతిగానే అదిరిపోయే పంచ్ వేసింది.

  English summary
  Actress Hari Teja Recently Conducted Question and Anwser Session in Instagram. Netizens Shocking Comments on Her In This Session.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X