»   » హిట్ టాప్ ఎఫెక్ట్: భారీ రేటుకు 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' శాటిలైట్ రైట్స్, డిటేల్స్

హిట్ టాప్ ఎఫెక్ట్: భారీ రేటుకు 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' శాటిలైట్ రైట్స్, డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాకు హిట్ టాక్ వస్తే...డబ్బే..డబ్బు. కేవలం ధియోటర్స్ నుంచి మాత్రమే కాక శాటిలైట్ రైట్స్, డీవిడి రైట్స్, యూ ట్యూబ్ రైట్స్ ఇలా చాలా వాటి నుంచి డబ్బు రావటం మొదలవుతుంది. ఇప్పుడు అదే పరిస్దితి నిఖిల్ తాజా చిత్రం 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' కు ఎదురౌతోంది.

బాహుబలి, అత్తారింటికి దారేది, జనతాగ్యారేజ్ ..ఇలా వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ శాటిలైట్ రైట్స్ కొంటున్న మాటీవి వారు ఈ సారి మరో హిట్ సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.


పూర్తి వివరాల్లోకి వెళితే... నిఖిల్ హీరోగా రూపొందిన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్న.... నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు పోవడం నిర్మాతల కి ఆనందాన్ని కలిగిస్తోంది.


Nikil's Ekkadiki Pothavu Chinnavada Satellite Rights Sold For 3 Crores

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ శాటిలైట్ హక్కుల వ్యవహారం చర్చల దశలోనే వుంది. అయితే సినిమా విడుదలైన అనంతరం అంతటా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, శాటిలైట్ హక్కులను 'మా టీవీ'వారు సొంతం చేసుకున్నారని చెప్తున్నారు.


ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషం ఏమిటీ అంటే...ఈ శాటిలైట్ రైట్స్ కు మా టీవి చానెల్ చెల్లించిన మొత్తం 3 కోట్లు అని వినికిడి. నిఖిల్ హీరోగా వచ్చిన సినిమాకు ఈ రేటు రావటం విశేషం. అలాగే మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం భాక్సాపీస్ వద్ద వర్కవుట్ కావటమే కాకుండా శాటిలైట్ విషయంలోనూ డబ్బు తెచ్చి పెట్టి నిర్మాతకు ఆనందం కలిగిస్తోంది.


బ్యానర్: మేఘ‌న ఆర్ట్స్‌
తారాగణం: నిఖిల్‌, హెబ్బాపటేల్‌, నందితా శ్వేత, వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ తదితరులు
పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్త్రి, శ్రీమ‌ణి,
ఆర్ట్‌- రామాంజ‌నేయులు,
ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌,
సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌,
మాట‌లు- అబ్బూరి ర‌వి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశీను
డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌, తదితరులు
సంగీతం: శేఖర్‌ చంద్ర,
నిర్మాత: పి.వి.రావు,
రచన, దర్శకత్వం: వి.ఐ. ఆనంద్‌
నిడివి: 140 నిమిషాలు,
విడుదల తేదీ: 18-11-2016

English summary
Now Maa TV bagged the satellite rights of Nikhil’s film “Ekkadiki Pothavu Chinnavada” for whopping 3 crores. Ekkadiki Pothavu chinnavada was the flick directed by Vi Anand and Nikhil was the male lead for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu