»   »  'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో ఎన్టీఆర్

'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ న్నాన్నకు ప్రేమతో సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ప్రారంబించాడు. దీనిలో భాగంగా ఎలాంటి అవకాశాన్ని వదులుకునేటట్టు కనిపించడంలేదు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తున్న సక్సెస్ ఫుల్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెషన్ -3 లో 'నాన్నకు ప్రేమతో' ప్రమోషన్స్ కి సంబందించి ఎన్టీఆర్ పాల్గోనున్నారు. దీనికోసం ఎన్టీఆర్ ను నాగర్జున ఇన్ వైట్ చెయ్యడం సర్ఫైజ్ గా మారింది.

ఎన్టీఆర్ తో పోటి పడుతున్న నాగర్జునే ఈ ప్రోగ్రామ్ కు హైలెట్ అవుతాడో లేక అతిధిగా వచ్చిన ఎన్టీఆర్ హైలెట్ అవుతాడో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతికి పోటిపడుతున్నారు.


NTR in 'Meelo Evaru Koteeshwarudu' Season 3

నాన్నకు ప్రేమతో చిత్రం విడుదల విషయానికి వస్తే..సంక్రాంతికి విడుదల అవుతున్న మిగతా చిత్రాల కన్నా భారీగా ఈ సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1700 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి రిలియన్స్ వారు, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి ప్లాన్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమచారం.


బిజినెస్ విషయానికి వస్తే...సీడెడ్, నార్త్ ఇండియా తప్ప అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఈ సినిమాను సమర్పిస్తున్న రిలియన్స్ వారే రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క ..., ఆడియో పాటు విడుదలైన దియోటర్ ట్రైలర్ కి మంచి స్పందన వస్తొంది. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.


English summary
NTR is also promoting his movie on Meelo Evaru Koteeshwarudu Season 3, the highly popular show hosted by Nagarjuna.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu