twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK November 3rd Episode: 6,40,000 రూపాయల ప్రశ్న దగ్గర ఔట్..ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఒకరు 10,000లతో వెనుతిరగ్గా మరొకరు 3,20,000 సాధించి వేణు తిరిగారు. అయితే తాజా ఎపిసోడ్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలను మీరు చెప్పగలరా? రిటైర్డ్ రైల్వే అధికారి జగన్నాథ శర్మ ఆడుతున్న నిన్నటి ఎపిసోడ్ లో 80000 వేల ప్రశ్న దగ్గర ఎపిసోడ్ పూర్తి కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

     160,000 రూపాయల కోసం ప్రశ్న

    160,000 రూపాయల కోసం ప్రశ్న

    2019 లో బిసిసిఐ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
    A : ప్రఫుల్ పటేల్
    B. రాజీవ్ శుక్లా
    C. సౌరవ్ గంగూలీ
    D: జై షా
    పై ప్రశ్నకు సమాధానం తెలియక పోవడంతో ఆయన వీడియో కాల్ ఏ ఫ్రండ్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆయన తన తమ్ముడికి కాల్ చేయడంతో ఆయన ప్రఫుల్ పటేల్ అని అనుకుంటున్నానని, కానీ గ్యారంటీ కాదని అన్నారు. దీంతో ఆయన మరో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్ ఉపయోగించుకోవడంతో స్క్రీన్ మీద రాజీవ్ శుక్లా, జై షా అనే పేర్లు మిగిలాయి. దీంతో ఆయన రాజీవ్ శుక్లా అనే జవాబు చెప్పారు. దీంతో ఆయన గేమ్ నుండి నిష్క్రమించాడు. 160,000 రూపాయల ప్రశ్న సమాధానం చెప్పకపోవడంతో ఆయన 10,000తో వెనుతిరగాల్సి వచ్చింది.

    భారత ODI క్రికెట్ టీమ్ కు నాయకత్వం వహించిన ప్రకారం ఈ క్రికెటర్లను సరైన క్రమంలో అమర్చండి

    జగన్నాథ శర్మ వెళ్లిపోయిన తర్వాత ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్‌ను ముందుకు తెచ్చారు.

    భారత ODI క్రికెట్ టీమ్ కు నాయకత్వం వహించిన ప్రకారం ఈ క్రికెటర్లను సరైన క్రమంలో అమర్చండి

    భారత ODI క్రికెట్ టీమ్ కు నాయకత్వం వహించిన ప్రకారం ఈ క్రికెటర్లను సరైన క్రమంలో అమర్చండి

    A: రోహిత్ శర్మ
    B: విరాట్ కోహ్లి
    C: ఎం ఎస్ ధోని
    D: సచిన్ టెండూల్కర్
    Answer: D, C, B, A
    పై ప్రశ్నకు ఇద్దరు సమాధానం చెప్పగా అందులో మనీష్ అనే కంటెస్టెంట్ అందరికంటే వేగంగా సమాధానం చెప్పారు. దాంతో గుడివాడకు చెందిన మనీష్ ఆర్మీల పనిచేస్తున్నారు. అలా ఆయన హాట్ సీట్‌పైకి చేరారు.

    1,000 రూపాయల కోసం ప్రశ్న

    1,000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో, ఆమ్ రస్ లో ప్రధానంగా వాడే పండు ఏది?
    A: ద్రాక్ష
    B: ఆపిల్
    C: మామిడి
    D: అరటి
    Answer: మామిడి

    రూ. 2,000 కోసం ప్రశ్న

    రూ. 2,000 కోసం ప్రశ్న

    ఈ పదాలలో దేనికి రాయిని తవ్విన ప్రదేశం అని అర్థం?
    A: కోరా
    B: క్వాంటమ్
    C: క్వార్టీ
    D: క్వారీ
    Answer: క్వారీ

    రూ. 3,000 కోసం ప్రశ్న

    రూ. 3,000 కోసం ప్రశ్న

    సాధారణంగా, నాలుగు కార్లు మరియు రెండు సైకిళ్లకు మొత్తం ఎన్ని చక్రాలు ఉంటాయి?
    A: 18
    B: 20
    C: 22
    D: 24
    Answer: 20

    రూ. 5,000 కోసం ప్రశ్న

    రూ. 5,000 కోసం ప్రశ్న

    వీటిలో, సాధారణంగా మానవ శరీరంలో అత్యధికంగా ఉండేవి ఏవి?

    A: కాలి గోళ్లు
    B. చెవులు
    C: ముక్కు
    D: మోకాళ్ళు
    Answer: కాలి గోళ్లు

    రూ. 10,000 కోసం ప్రశ్న

    రూ. 10,000 కోసం ప్రశ్న

    ఈ చిత్రంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తో పాటు ఉన్నది ఎవరు? అంటూ జవహర్ లాల్ నెహ్రూ ఫోటో చూపించారు.

    A: జవహర్ లాల్ నెహ్రూ
    B: సుభాష్ చంద్ర బోస్
    C: సి రాజగోపాలాచారి
    D: రాజేంద్ర ప్రసాద్
    Answer: జవహర్ లాల్ నెహ్రూ

     రూ. 20,000 కోసం ప్రశ్న

    రూ. 20,000 కోసం ప్రశ్న

    జూన్ 2021లో వింబుల్డన్ ఛాంపియన్షిప్ ఏ ఆటలో జరిగింది?

    A: ఫుట్బాల్
    B: వాలీబాల్
    C: టెన్నిస్
    D: బ్యాడ్మింటన్
    Answer: టెన్నిస్

    రూ. 40,000 కోసం ప్రశ్న

    రూ. 40,000 కోసం ప్రశ్న

    జలాలుద్దీన్ ముహమ్మద్ అని పేరు కూడా ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరు?

    A: బాబర్
    B: అక్బర్
    C: షాజహాన్
    D: ఔరంగజేబు
    పై ప్రశ్నకు జవాబు తెలియకోవడంతో ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. దీంతో ఆడియెన్స్ అక్బర్ కు ఓటు వేశారు. దాంతో ఆ సమాధానం చెప్పి గేమ్‌లోకి వెళ్లిపోయారు. సమాధానం కరెక్ట్ కావడంతో 40000 గెలుచుకున్నారు.

    80,000 వేల రూపాయల కోసం ప్రశ్న

    80,000 వేల రూపాయల కోసం ప్రశ్న

    ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా పేరు వీటిలో వేటి పేరు మీదుగా పెట్టబడలేదు?

    A: ముఖ్యమంత్రి
    B: స్వాతంత్య్ర సమరయోధుడు
    C: నది
    D: భారత రాష్ట్రపతి

    Answer: భారత రాష్ట్రపతి

    1,60,000 రూపాయల కోసం ప్రశ్న

    1,60,000 రూపాయల కోసం ప్రశ్న

    అంతరిక్షం నుండి భారతదేశం ఎలా కనబడుతుంది అని ఇందిరా గాంధీ అడిగినప్పుడు, రాకేష్ శర్మ ఏమి చెప్పారని ప్రసిద్ధి?

    A: జై బోలో భారత్ మాతాకీ
    B: జై హింద్
    c. సారే జహాసే అచ్చా
    D: వందేమాతరం
    Answer: సారే జహాసే అచ్చా

    3,20,000 రూపాయల కోసం ప్రశ్న

    3,20,000 రూపాయల కోసం ప్రశ్న

    2020 లో మరణించిన టకువొ ఆవొయాగి వీటిలో దేనిని ఆవిష్కరించారు?

    A: టెంపరేచర్ గన్
    B: పల్స్ ఆక్సీమీటర్
    C: వెంటిలేటర్
    D: ఆక్సిజన్ ట్యాంక్
    పై ప్రశ్నకు సమాధానం తెలియక పోవడంతో ఆయన లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్ ఉపయోగించుకోవడం తో స్క్రీన్ మీద ఆక్సిజన్ ట్యాంక్
    , పల్స్ ఆక్సీమీటర్ అనే పేర్లు మిగిలాయి. వాటిలో ఆయన పల్స్ ఆక్సీమీటర్ ను ఎంచుకున్నారు. అది కరెక్ట్ అయింది.

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
    6,40,000 రూపాయల కోసం ప్రశ్న

    6,40,000 రూపాయల కోసం ప్రశ్న

    భారతదేశంలో మొదటి రైల్వే లైన్ ఏ నగరంలో మొదలైంది?

    A: కోల్కతా
    B: ముంబాయి
    C: చెన్నై
    D: ఢిల్లీ

    ఈ ప్రశ్నకు ఆయన ముంబై అని సమాధానం చెప్పగా అది తప్పయింది. కరెక్ట్ ఆన్సర్ చెన్నై అని ఎన్టీఆర్ వెల్లడించారు. దీంతో ఆయన 320000 రూపాయలు గెలుచుకుని వెనుదిరిగారు. ఇక్కడితో బజార్ మోగడంతో ఆయన వెనుతిరిగారు.

    English summary
    here are the questions and answers of NTR's Evaru Meelo Koteeswarulu Show November 3rd Episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X