»   » నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు... హీరోయిన్ కోసం రూ. 35 లక్షలు?

నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు... హీరోయిన్ కోసం రూ. 35 లక్షలు?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Bigg Boss Season 2 Telugu : Nutan Naidu Gets Complaints From People

  బిగ్‌బాస్ 2 షో నుండి రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు.... మళ్లీ వైల్డ్ కార్డ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎంతో మంది ప్రేక్షకుల ఓట్లు సంపాదించుకుని బిగ్‌బాస్ హౌస్‌‌లో రీ ఎంటరైన సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు చేస్తూ శివ అనే సామాజిక కార్యకర్త మీడియా ముందుకొచ్చాడు. ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ, నూతన్ నాయుడు గురించి ఎవరూ ఊహించని కామెంట్స్ చేశారు. నూతన్ నాయుడు ఒక పొలిటికల్ లాబీయిస్ట్ అని, ప్రైవేట్ యూనివర్శిటీ పెట్టిస్తానని చెప్పి తమను మోసం చేశాడని ఆరోపించారు. ఈ సందర్భంగా నూతన్ ఫోన్ ఆడియో టేపును సదరు ఛానల్ బహిర్గతం చేసింది.

   వైఎస్ఆర్, సుజనా చైదరి, పరకాల ప్రభాకర్, బాలయ్య పేర్లు చెప్పి

  వైఎస్ఆర్, సుజనా చైదరి, పరకాల ప్రభాకర్, బాలయ్య పేర్లు చెప్పి

  కీర్తి శేషులు వైఎస్ఆర్, సుజనా చౌదరి, పరకాల ప్రభాకర్ తనకు చాలా సన్నిహితులు అని చెప్పేవాడని, నటుడు బాలయ్యను బాలా అని సంబోధిస్తూ తనకు సన్నిహితుడని చెప్పేవాడని, భువనేశ్వరిని... భువనక్క అని పిలుస్తూ... వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేవాడని, ప్రైవేట్ యూనివర్శిటీ పెట్టిస్తానని తమ సోదరుడి వద్ద రూ. 3 కోట్లు తీసుకున్నాడని శివ ఆరోపించారు.

  అసలు ఆయన కామన్ కాదు...

  అసలు ఆయన కామన్ కాదు...

  నూతన్ నాయుడు అసలు కామన్ కాదని, గతంలో ఎన్నికల్లో పోటీ చేశాడని, ఎక్కడి వెళ్లినా పెద్ద కాన్వాయ్, చుట్టూ మందీ మార్బలంతో వెళతాడని, అతడు కామన్ మ్యాన్ ఎలా అవుతాడు? ఆయన్ను బిగ్‌బాస్ నిర్వాహకులు కామన్ మ్యాన్‌ కేటగిరీలో ఎలా తీసుకున్నారని శివ ప్రశ్నించారు.

   బిగ్‌బాస్ షో చూడలేదు, అతడే అని తెలియదు

  బిగ్‌బాస్ షో చూడలేదు, అతడే అని తెలియదు

  నేను ఇప్పటి వరకు బిగ్‌బాస్ షో చూడలేదు. మా సోదరుడితో పాటు మోసపోయిన బాధితులు వచ్చి మీరు అప్పటి నుండి వెతుకుతున్న నూతన్ నాయుడు ఇతడే అని చెప్పారు. నేను ఇన్ని రోజులు అతడిని మేదపురెడ్డి నూతన్ కుమార్ అనుకున్నాను. అతడే నూతన్ నాయుడు అని నాకు ఇప్పటి వరకు తెలియదు. మెంటర్ టెక్నీలజీన్ అని బంజారాహిల్స్ రోడ్ నెం.14లో అతడి ఆఫీస్ ఉంది. అతడి ఆఫీస్ అకౌంట్ డీటేల్స్ తీయిస్తే అతడి బాధితుల వివరాలు బయటకు వస్తాయి... అని శివ తెలిపారు.

  ఇప్పుడు కూడా రాజకీయ లబ్ది కోసమే బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లాడు

  ఇప్పుడు కూడా రాజకీయ లబ్ది కోసమే బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లాడు

  ఇప్పుడు కూడా రాజకీయంగా ఫేం సంపాదించడానికి, రాజకీయంగా లబ్దిపొందడానికి బిగ్‌బాస్ షోలోకి ఎంటరయ్యాడని శివ ఆరోపించారు.

  హీరయిన్‍‌ను ఇంప్రెస్ చేయడానికి రూ. 35 లక్షల ఖర్చు: శివ

  హీరయిన్‍‌ను ఇంప్రెస్ చేయడానికి రూ. 35 లక్షల ఖర్చు: శివ

  మా వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఆయన్ను వెతకడాని అతడు ఉంటున్న హౌస్ వద్దకు వెళితే ఇంటి ఓనర్ చాలా విషయాలు చెప్పాడు. ఒక హీరోయిన్ వద్ద ఇంప్రెషన్ కొట్టేయడానికి రూ. 35 లక్షలు ఖర్చు పెట్టాడని తెలిపాడు... అని శివ చెప్పుకొచ్చారు.

  నూతన్ నాయుడు మీద కేసు పెడతాం

  నూతన్ నాయుడు మీద కేసు పెడతాం

  త్వరలోనే నూతన్ నాయుడు మీద కేసు పెడుతున్నాం. మా వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి. బిగ్‌బాస్ ఇంటి నుండి అతడిని బయటకు రప్పిస్తాం... అని శివ అన్నారు.

  శివ ఆరోపణలతో అంతా షాక్

  శివ ఆరోపణలతో అంతా షాక్

  నూతన్ నాయుడు మీద ఉన్నట్టుండి ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రేక్షకులు షాకవుతున్నారు. దీనిపై స్పందించడానికి నూతన్ కూడా బయట లేడు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులకు దారి తీస్తుందో? చూడాలి.

  English summary
  Bigg Boss 2 contestant Nuthan Naidu has entered Bigg Boss house again after he evicted from the house earlier. He has entered the house as a common man. Participating in a debate on Nuthan Naidu's lavish life style, Social worker Shiva questioned how can a man, who contested from a political party in 2014. He said he has cheated his cousin for Rs 3 crore. He said Nuthan has spent Rs 35 lakhs to impress a heroine.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more