Omkar's Dancee Plus Finale: ఉత్కంఠను రేపిన డ్యాన్సీ ప్లస్.. విజేతగా సంకేత్ సహదేవ్.. కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ
ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ పర్యవేక్షణలో అత్యంత జనరంజకంగా సాగిన డ్యాన్సీ ప్లస్ రియాలిటీ షో ఫినాలే అంగరంగవైభవంగా ముగిసింది. ఆదివారం మే 23వ తేదీన జరిగిన ఫైనల్‌లో ప్రదర్శించిన డ్యాన్సులు, స్క్రిట్స్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. ఈ ఫైనల్ విజేత వివరాల్లోకి వెళితే..

హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌తో
డ్యాన్సీ ప్లస్ షో గత కొద్ది నెలలుగా నిరవధికంగా ఈ షోలో కంటెస్టెంట్లు హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శిస్తూ ఆకట్టుకొన్నారు. ఈ ఫైనల్‌కు చేరుకొన్న ఫైనలిస్టులు అద్బుతమైన డ్యాన్సులను ప్రదర్శించారు. సృజనాత్మకతో కూడిన ఫెర్ఫార్మెన్స్ మరింత క్రేజ్‌ను పెంచాయి. ప్రతీ వారం అంతకుమించిన పెర్ఫార్మెన్స్‌తో తన ప్రతిభను చాటుకొన్నారు.

జోష్ పెంచిన ఫినాలే..
రెండు రోజలపాటు కొనసాగిన ఫినాలే ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఆదివారం రాత్రి ముగిసిన స్టార్ మా డ్యాన్సీ ప్ల్ ఫైనల్స్ మరింత జోష్‌తో సాగాయి. కరోనా సెకండ్ వేవ్‌తో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు ఈ షో మరింత వినోదాన్ని ఆనందాన్ని పంచిందని చెప్పవచ్చు.

విభిన్నమైన ప్రదరనలతో ఆకట్టుకొన్న కంటెస్టెంట్లు
యశ్వంత్ మాస్టర్ టీమ్‌లోని వాసి టోని, సంకేత్ సహదేవ్, బాబా మాస్టర్ టీమ్ మహేశ్వరి, తేజస్విని, అనీ మాస్టర్ టీమ్‌లోని జియా థాకూర్, రఘు మాస్టర్ టీమ్‌లోని డార్జిలింగ్ డెవిల్స్ టీమ్ ఫైనల్‌లో పోటీ పడ్డాయి. మహేశ్వరీ, తేజస్విని క్లాసికల్ డ్యాన్స్‌తో ఆలరించారు. మిగితా కంటెస్టెంట్లు విభిన్నమైన ప్రదర్శన ఇచ్చారు.

విజేతగా సంకేత్ సహదేవ్
కొద్ది నెలలుగా అత్యంత ఉత్కంఠతో సాగిన డ్యాన్సీ పోటీలో సంకేత్ సహదేవ్ ప్రస్తుత సీజన్‌కు విజేతగా నిలిచారు. విజేతగాకు ఆరుగురు న్యాయమూర్తులు, తోటి కంటెస్టెంట్లు ప్రశంసలతో ముంచెత్తారు. విజేతగా నిలిచిన సంకేత్‌కు రూ.20 లక్షల బహుమతిని గెలుచుకొన్నారు.

21 వారాలపాటు హోరెత్తించిన డ్యాన్సీ ప్లస్
గత 21 వారాలుగా జరిగిన డ్యాన్సీ ప్లస్ సీజన్‌కు హోస్ట్‌గా, డైరెక్టర్‌గా ఓంకార్ వ్యవహరించారు. ఈ షోకు సంబంధించిన లైవ్ స్టార్ మా టెలివిజన్‌లో ప్రసారం అయ్యాయి. అలాగే ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్స్‌ను డిస్నీ + హాట్ స్టార్ కూడా ప్రసారం చేస్తున్నది.


Click it and Unblock the Notifications











