For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హైపర్ ఆదికి దుర్గారావు కోలుకోలేని షాక్: అదే జరిగితే జబర్ధస్త్ కమెడియన్‌కు కష్టమే!

  By Manoj
  |

  సోషల్ మీడియా ప్రపంచంలో టిక్ టాక్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. దీన్ని కొందరు దుర్వినియోగం చేసుకోగా... చాలా మంది తమ టాలెంట్‌ను చూపించుకునేందుకు వాడుకున్నారు. ఇలా వెలుగులోకి వచ్చి భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వారిలో దుర్గారావు ఒకరు. ప్రత్యేకమైన శైలితో బాగా ఫేమస్ అయిన ఆయన.. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత బుల్లితెరపై మెరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైపర్ ఆదికి కోలుకోలేని షాకిచ్చాడు దుర్గారావు. తద్వారా బుల్లితెరపై సరికొత్త చరిత్రకు కారణం అయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది.? వివరాల్లోకి వెళితే...

  భార్యతో స్టెప్పులు... భారీ ఫాలోయింగ్

  భార్యతో స్టెప్పులు... భారీ ఫాలోయింగ్

  టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చిన దుర్గారావు... తన భార్యతో కలిసి తెలుగు పాటలకు కాలు కదుపుతుండేవాడు. వీళ్లిద్దరూ కలిసి తమదైన స్టెప్పులతో హల్‌‌చల్ చేసేవారు. అంతేకాదు, పాటకు తగ్గట్లు కాస్ట్యూమ్స్ ధరించడంతో పాటు మేకప్ వేసుకుని నెటిజన్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నించేవారు. ఈ క్రమంలోనే దుర్గారావు టిక్‌ టాక్‌తో పాటు బయట కూడా బాగా పాపులర్ అయ్యాడు.

  ఎక్కడ చూసినా దుర్గారావుదే సందడి

  ఎక్కడ చూసినా దుర్గారావుదే సందడి

  చైనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇండియాలో టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయినా అప్పటికే క్రేజ్ సంపాదించుకున్న దుర్గారావు సెలెబ్రిటీల కంట పడ్డాడు. దీంతో అతడు తరచూ ఏదో ఒక ఛానెల్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. అంతేకాదు, తన భార్యతో కలిసి యూట్యూబ్ ఛానెళ్లకు సైతం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇలా ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాడు.

  దుర్గారావు ఎంట్రీ.. హైపర్ ఆది సెటైర్లు

  దుర్గారావు ఎంట్రీ.. హైపర్ ఆది సెటైర్లు

  దుర్గారావుకు బయట ఉన్న క్రేజ్‌ హైపర్ ఆది దృష్టిలో పడింది. ఇంకేముంది ఆయనను, ఆయన భార్యను తన స్కిట్ ద్వారా జబర్ధస్త్‌కు పరిచయం చేశాడు. వాళ్లు కనిపించింది కాసేపే అయినా ఆ స్కిట్‌కు బాగా వ్యూస్ వచ్చాయి. ఇక, ఆ తర్వాత కూడా స్కిట్ల ద్వారా తరచూ దుర్గారావును ఉద్దేశిస్తూ హైపర్ ఆది... తన టీమ్‌లోని సభ్యులపై ఏదో ఒక రకంగా సెటైర్లు వేస్తున్నాడు.

  లే‘ఢీ' గెటప్‌తో మాయ చేసిన పండు

  ఈ మధ్య ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'లోనూ దుర్గారావు హైలైట్ అయ్యాడు. ఆ షో కంటెస్టెంట్లలో ఒకడైన పండు మాస్టర్ పలాస సినిమాలోని ‘నక్కిలీసు గొలుసు' అనే పాటకు లేడీ గెటప్‌లో డ్యాన్స్ చేశాడు. ఈ పాట మధ్యలో దుర్గారావు పేరును ప్రస్తావించాడు. అంతేకాదు, ఆయనను ఆయన భార్యను అనుకరిస్తూ నాలుగు స్టెప్పులు వేశాడు. దీంతో ఈ ఎపిసోడ్ పేలిపోయింది.

  ఈటీవీని నిలబెట్టిన పాట.. ట్రెండింగ్

  ఈటీవీని నిలబెట్టిన పాట.. ట్రెండింగ్

  పండు చేసిన ఈ పెర్ఫార్మెన్స్‌ ఎంతగా హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చినప్పటి నుంచే ఈ ఎపిసోడ్‌పై హైప్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఇది ప్రసారం అయిన వారంలో ఈటీవీలోని ‘ఢీ' షో టీఆర్పీ రేటింగ్‌లో ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది. అంతేకాదు, దాదాపు ఈ పాట పది రోజుల పాటు యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగింది.

  Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
  హైపర్ ఆదికి కోలుకోలేని షాకిచ్చాడు

  హైపర్ ఆదికి కోలుకోలేని షాకిచ్చాడు

  ఇక, వ్యూస్ పరంగా పండు చేసిన పెర్ఫార్మెన్స్ ఇప్పటికే 52 మిలియన్ వ్యూస్ సాధించింది. తద్వారా బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసింది. గతంలో ఢీ షో నుంచి అక్సాఖాన్ ‘స్వింగ్ జరా' సాంగ్ టాప్‌లో ఉండేది. ఇప్పుడది పండు దరిదాపుల్లో కూడా లేదు. ఇక, వేగంగా యాభై మిలియన్ల వ్యూస్ రాబట్టి జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది రికార్డును బద్దలు కొట్టిందీ పాట.

  English summary
  Hyper Aadi is an Indian TV and film actor who primarily works in Telugu cinema and Telugu TV series. Having completed his B. Tech in 2012, Aadi started working in a Software firm in Hyderabad before eventually venturing in the entertainment industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X