ఎన్టీఆర్, నానిలకు భిన్నంగా నాగార్జున అదరగొడతారు: పరుచూరి

పరుచూరి పలుకులు పేరుతో సినిమా రంగానికి చెందిన విషయాలపై తన అభిప్రాయం వెల్లడించే ప్రముఖ తెలుగు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షోను హోస్ట్ చేయబోతున్న నాగార్జున గురించి స్పందించారు.

బిగ్ బాస్ తొలి సీజన్ చిన్న రామయ్య చేస్తున్నపుడు చూశాను. ఆయన ఈ షోను మాసీగా చేశారు. ఆ షో ఎన్టీఆర్ అలా చేయడం ఆడియన్స్‌ను మెప్పించింది. లోపల ఉన్న 14 మంది వ్యక్తిత్వ విశ్లేషణలు వారికి దూరంగా ఉన్న ఈ మనిషి చేయడం అంటే సామాన్యమైన జాబ్ కాదు. చాలా క్రిటికల్ జాబ్. ఆ విషయంలో ఎన్టీఆర్ 100 శాతం సక్సెస్ అయ్యారు.

Paruchuri Gopala Krishna About Nagarjuna Hosting Bigg Boss 3

తర్వాత నాని క్లాసీగా చేశాడు. మీరు ఆ షో చూసినపుడు చిన్నరామయ్య మాదిరిగా ఉన్న చణుకులు, ఆ గమ్మత్తు, వెక్కిరింతలు వేయలేదు. క్లాస్ బొమ్మ చూసేపుడు మనకు అలాంటి షాట్లు దొరకవు. చాలా అద్భుతంగా, తెలివితేటలతో నడుపుతారు... దాన్నే క్లాసీ అంటారు.

ఇపుడు నాగార్జునగారి ప్రోమో చూశాను. ఆ ఇద్దరికంటే భిన్నంగా ఈయన మన్మధుడిలా చేశారు. నాకు తెలిసి రేపు ఈ కార్యక్రమం చూసే మహిళా ప్రేక్షకులు 14 మందిని చూడాలో, ఈయన్ను చూడాలో అర్థంకాక అయోమయంలో పడతారు. ప్రోమోలో ఆయన కవ్వించిన తీరు అద్భుతంగా ఉంది. ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నారని స్పష్టమైంది. ఈ షోను ఆయన గ్లామరస్‌గా ముందుకు నడిపిస్తారనే నమ్మకం ఉందని పరుచూరి వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X