»   » షాకింగ్ : పవన్ కామెంటర్ గా టీవి పోగ్రాం

షాకింగ్ : పవన్ కామెంటర్ గా టీవి పోగ్రాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రామ్ తో అదరకొడుతున్న నాగార్జున తరహాలో పవన్ కూడా త్వరలో బుల్లితెరపై కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కమర్షియల్ పోగ్రాం లాగ కాకుండా సమాజిక సమస్యలను చర్చించే సత్యమేవ జయితే తరహా పోగ్రామ్ లో ఆయన కామెంటర్ గా కనిపించి అలరించనున్నట్లు చెప్పుకుంటున్నారు.

గతంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయితే లాంటి కాన్సేప్ట్ కావంటంతో వెంటనే పవన్ సైతం ఉత్సాహం చూపినట్లు సమాచారం. అది తన పొలిటికల్ కెరీర్ కి సైతం మైలేజ్ ఇస్తుందనే నమ్మకంతో ఒప్పుకున్నట్లు చెప్పుకున్నారు.

ఈ పోగ్రాం ఈ టీవిలో ప్రసారం కానుందని వార్త. రామోజి రావుకి, పవన్ కు ఉన్న అనుబంధంతో ఈ పోగ్రాంకు పవన్ సై అన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈటివిలో డిజైన్ చేయ్యబోతున్న ఈ పోగ్రామ్ కు సంబందించి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోందని, పవన్ చేస్తే...అది సంచలనం అవ్వాలని టీవీ ఛానెల్ వాళ్లు భావించి ఆ రేంజిలో వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ సమచారం ఏదీ లేదు.

Pawan Kalayna to make small screen debut?

ప్రస్తుతానికి పవన్ సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజిగా గడుపుతున్నారు. ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తుండగా, దీనిని 11మే 2016 న విడుదల చేయటానికి సన్నాహాక ఎర్పాట్లు జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ తన తాజా ఎంటర్టైనర్ ...సర్దార్ గబ్బర్ సింగ్ ని భారీ ఎత్తున రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఈ రోజు నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రం కోసం... ఓ విలేజ్ సెట్ ని రెండు కోట్లు ఖర్చు పెట్టి మరీ వేసి షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ ఎక్కడ షూట్ చేసారో అదే లొకేషన్ లో ఈ సినిమాను కూడా షూట్ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. హీరో మీద కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలు షూట్ చేస్తారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి దేవీశ్రీ స్వరాలు సమకూరుస్తున్నాడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్ .

English summary
It is coming out that Pawan Kalyan will be a commentator for a program in ETV which is designed on the lines of Bollywood star Amir Khan's Satyameva Jayate.
Please Wait while comments are loading...