పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఒరిజినల్ స్టోరీ ఇదా.. రివీల్ చేసిన డైరెక్టర్ క్రిష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరి హర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు. టాప్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి ఆశించిన మేర ఫలితం రాలేదు. దీంతో ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా అప్సెట్ అయ్యారు.
అయితే, హరి హర వీరమల్లు చిత్రానికి సంబంధించిన కథ పెద్దగా ప్రేక్షకులకు నచ్చలేదని, విజువల్స్, గ్రాఫిక్స్ కూడా పేలవంగా ఉందని ప్రేక్షకుల నుంచి అభిప్రాయలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా అసలు ఆ సినిమా కథ సినిమా ప్రారంభంలో ఉన్నదేనా? లేకా? మరేదైనా ఉందా అనే సందేహాలు సినీ ప్రముఖుల్లో వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలో హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన మొదటి డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తాజాగా క్రిష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు.

హరిహర వీరమల్లు చిత్రం కథ మీదేనా? కాదా అనే ప్రశ్నకు ఇలా స్పందించారు. 'నేను చెప్పిన స్క్రిప్ట్ పూర్తిగా వేరు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథకు మొదటి కథకు చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను షూట్ చేసిన సీన్లు ఎక్కువ శాతం ఢిల్లీ దర్బార్ లో ఉంటాయి. అందుకోసం మేం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ ను కూడా నిర్మించాలని ప్లాన్ చేశాం. ఒక సెట్ కూడా వేశాం. ఒక నిర్మాత ఏఎం రత్నం గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన ఇంత సరిపోతుందిలే మనం చెప్పినా కూడా ఆయన పర్లేదు ఇంకా పెద్దఎత్తున చేయండి చెబుతుంటారు. చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. గ్రేట్ ప్రొడ్యూసర్. విజనరీ.
ఎర్రకోటలోని దర్బార్ ను, కాస్ మహాల్ ను ఎగ్జాక్ట్ గా ఏర్పాటు చేశాం. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణితో పెద్ద పెద్ద సెట్స్ వేశాం. మహిర్ సింహాసనాన్ని చేయించాం. అయితే ఈ కథలో తాజ్ మహాల్ కు ఎంత ఖర్చు అయ్యిందో, షాజహాన్ తన కోసం మహిర్ సింహాసనాన్ని చేయించుకున్నారు. చాలా పెద్ద సింహాసనం. దాని మీద ఒక కొహినూర్ వజ్రాన్ని పెట్టారు. దాంతో ఆయన కూర్చొనే సింహాసనం వెలతో తాజ్ మహాల్ ను కట్టడం చాలా సులువు. అయితే దాన్ని ఔరంగజేబ్ పట్టుకెళ్లారు. అగ్రా నుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సీన్ ను నేను ఫస్ట్ తీశాను.
పవన్ కళ్యాణ్ గారెతో మేము తీసిన సీన్లు అన్నీ చాలా అసాధారణంగా ఉంటాయి. అయితే మేం తీసిన సన్నివేశాలన్నీ ఢిల్లీ వెళ్లిన తర్వాత కథను తీశాను. అయితే ఈ ఢిల్లీ దర్బార్ సీన్ సెకండ్ పార్ట్ లో 40 నిమిషాలు ఉంటుంది. ఇక మొదటి పార్ట్ లో 30 నిమిషాల వరకు నేనే షార్ట్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ షాండ్లియర్ నుంచి చేసిన అద్భుతమై స్టంట్స్ కూడా ఉన్నాయి. కళ్యాణ్ గారు ఎక్ట్రా ఆర్డినరీ స్టంట్స్ చేశారు. ఆయన కోహినూర్ ను దొంగలించడం, ఆ తర్వాత సింహాసనంపై కూర్చొవడం, ఔరంగజేబ్ కు సవాల్ విసరడం, ఔరంగజేబ్ కోర్టుకు వెళ్లడం ఇలాంటి సన్నివేశాలన్నీ తీశాం. ఇదంతా ఫుటేజీ స్టోర్ లో ఉంది. త్వరలో బయటకి వస్తుంది... అంటూ హరిహర వీరమల్లు కథను చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











