twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం మాట్లాడాలో తెలియటం లేదంటూ పవన్ స్పీచ్ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్: భక్తి టీవి కోటి దీపోత్సవం ఏడో రోజు కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్ విచ్చేసి తమ అనుగ్రహ భాషణాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. ఇక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కాగా, చాగంటి వారు తమ ప్రవచన ధారలతో దీపోత్సవ ప్రాంగణంలో ఆధ్మాత్మిక జల్లులు కురిపించారు.

    ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఏం మాట్లాడాలో కూడా తనకు తెలియడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. నిజానికి తాను గురూజి రవి శంకర్ మాట్లాడడాన్ని వినడానికి వచ్చానని..మీతో పాటు కూర్చోవాల్సిన వాడినే తప్ప...వేదికపై మాట్లాడగలిగేంత వాడిని కాదని పవన్ వినయంగా అన్నారు. ఆ మాటలు మీరు వినండి..

    ఇక కార్యక్రమంలో భాగంగా ఆధ్యాత్మికవేత్తలకు ప్రతీ రోజు వేస్తున్న సింహాసనం వంటి కుర్చీనే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కు కూడా ఆఫర్ చేసారు. అయితే పవన్ దానిని సున్నితంగా తిరస్కరించి సాధారణమైన ప్లాస్టిక్ కూర్చున్నారు.

    Pawan Kalyan Speech At 7th Day Bhakthi TV Koti Deepothsavam

    మనిషి జీవనానికి ఆధారం దీపం. మనిషిలో వెలిగే దీపం ఒకటైతే.. మనిషికి వెలుగునిచ్చే దీపం మరొకటి. బయట వెలిగే దీపం గురువైతే, లోపల వెలిగే దీపం భగవంతుడు. అందుకే దీప జ్యోతిని భగవంతుని స్వరూపంగా చెబుతారు. అలాంటి దీపాలు ఒకటి రెండూ కాదు.. ఏకంగా కోటి దీపాలు వెలిగించి, ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మజ్యోతుల వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన కోటి దీపోత్సవం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

    తెలుగు రాష్ట్రల్లోనే కాక, దేశ వ్యాప్తంగా కోటి దీపోత్సవం ఓ ఆధ్యాత్మక ప్రభంజనమే సృష్టించింది.
    వేదఘోషతో ప్రారంభమైన కార్యక్రమం చాంగటి వారి ప్రవచన ధారలతో ముందుకు సాగింది. దీపం ప్రాధ్యాన్యతను, దీపారాధనలోని విధానాలను కోటి దీపోత్సవం విశిష్టతను, కార్తిక దీపారాధన అవసరాన్ని తెలియజేశారు. మహా ప్రాంగణంలో శివలింగానికి ప్రదోషకాల మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుమంగళి పూజ నిర్వహించి, ఆది దంపతులకు కోటిదీపోత్సవ ప్రాంగణంలో గజవాహన సేవను నిర్వహించారు.

    English summary
    Pawan Kalyan gave a speech at Koti Deepothsavam held at Hyderabad by Bakthi Channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X