»   »  అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్, లుక్ అదిరిపోయింది... (ఫోటోస్)

అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్, లుక్ అదిరిపోయింది... (ఫోటోస్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Anchor Anasuya Birthday Celebrations

  యాంకర్ అనసూయ.... ఇపుడు ఇలా పిలిస్తే ఆమె అభిమానులు ఒప్పుకోరేమో? ఎందుకంటే ఆమె ఆ స్థాయిని దాటి తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటిగా ఎదుగుతోంది. ఇటీవల విడుదలైన 'రంగస్థలం' తర్వాత అనసూయ రేంజి మరింత పెరిగింని చెప్పక తప్పదు. ఇందులో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమా విడుదలై చాలా రోజులైంది కదా... ఇపుడు అనసూయ ప్రస్తావన ఎందుకు... అనుకుంటున్నారా? ఇందుకు కారణం అనసూయ పుట్టినరోజు వేడుక. మంగళవారం ఈ హాట్ యాంకర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా జరుపుకుంది.

   అనసూయను కామెంట్లతో ముంచెత్తిన ఫ్యాన్స్

  అనసూయను కామెంట్లతో ముంచెత్తిన ఫ్యాన్స్

  అనసూయకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేధికల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె బర్త్ డే సందర్భంగా అభిమానులో కామెంట్లతో ముంచెత్తారు. ఆమె ఫోటోలను షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

   బుల్లితెర సంచలనం

  బుల్లితెర సంచలనం

  బుల్లితెర ప్రపంచంలో అతి తక్కువ కాలంలో సంచలనం అయిన వారిలో అనసూయను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ క్రమక్రమంగా బుల్లితెర రంగంలో టాప్ యాంకర్‌గా ఎదిగారు. వరు సటీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడిపే రేంజికి వెళ్లిపోయారు.

  అనసూయ కెరీర్ టర్నింగ్ పాయింట్

  అనసూయ కెరీర్ టర్నింగ్ పాయింట్

  అనసూయ కెరీర్ మలుపు తిప్పిన కార్యక్రమం 'జబర్దస్త్' కామెడీ షో. ఈ షో తర్వాత అనసూయ పాపులారిటీ మరింత పెరిగింది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుంటూ టాప్ హీరోల సినిమా పంక్షన్లను హోస్ట్ చేసే స్థాయికి ఎదిగారు.

  అనసూయ్ ప్లస్ పాయింట్ అదే

  అనసూయ్ ప్లస్ పాయింట్ అదే

  చిలిపి చేష్టలు, ముద్దొచ్చే హావభావాలు, ఆకట్టుకునే యాంకరింగ్ స్కిల్స్‌ అనసూయ ప్లస్ పాయింట్స్. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లకు భిన్నమైన శైలి ప్రదర్శించడం, ప్రేక్షకులకు ఆమె తెగనచ్చేయడంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

   అందంతో వారందరినీ వెనక్కి నెట్టి

  అందంతో వారందరినీ వెనక్కి నెట్టి

  అనసూయ కంటే సీనియర్ యాంకర్ల సుమ, ఝాన్సీ, శిల్పా శెట్టి తదితరులు అప్పటికే ఉన్నప్పటికీ అనసూయ మాదిరి ఫాలోయింగ్ సంపాదించుకోలేక పోయారు. అందుకు కారణం అనసూయ అందం కూడా ఓ కారణం అని చెప్పక తప్పదు.

   సినిమా రంగంలోనూ సత్తా చాటుతున్న అనసూయ

  సినిమా రంగంలోనూ సత్తా చాటుతున్న అనసూయ

  కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా సినిమా రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. క్షణం మూవీలో విభిన్నమైన విలన్ పాత్ర పోషించిన అనసూయ, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన ‘రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర పోషించి ఎలాంటి పాత్రలైనా తాను చేయగలను అని నిరూపించుకుంది. అనసూయ మున్ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుండో చూడాలి.

  English summary
  Anasuya Birthday Celebrations 2018. Anasuya Bharadwaj is an Indian television presenter and actress. After working as a news presenter for Sakshi TV, Bharadwaj appeared as a TV anchor on Jabardasth, a comedy show. The show elevated her career. After this, she got an opportunity to act in film opposite Akkineni Nagarjuna in Soggade Chinni Nayana. Later, in the same year, she made her debut with Kshanam in which she portrayed a negative lead role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more