»   » నిన్న నీహారిక, ఇప్పుడు ప్రదీప్ కూడా...ఇంకెవరెవరు?

నిన్న నీహారిక, ఇప్పుడు ప్రదీప్ కూడా...ఇంకెవరెవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను' టీవీ పోగ్రాంతో హై సక్సెస్ అయిన యాంకర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అప్పటి వరకు టీవీ రంగంలో సుమ, ఝాన్సి వంటి లేడీ యాంకర్లదే రాజ్యం అనుకున్న సమయంలో ప్రదీప్ దూసుకువచ్చి తన మాటకారి తనంతో , తన స్మార్ట్ నెస్ తో నెంబర్ వన్ స్దాయికి ఎదిగాడు. ఇప్పుడు సినిమా హీరోగా కూడా చెయ్యబోతున్నారు.

రేడియో మిర్చీలో ఆర్జేగా పనిచేస్తున్న ప్రదీప్ రాకతో తెలుగు టీవీ తెర మీద మగయాంకర్ల ప్రస్థానం కూడా మొదలయింది. మహిళామణుల్నందరినీ టీవీలకు కట్టి పడేసేలా యాంకరింగ్ చేసే ప్రదీప్ గడసరి అత్త... సొగసరి కోడలు, ప్రదీప్ దర్బార్ వంటి లేడీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్‌తో టీవీ రంగంలో సంచలనమయ్యాడు.

కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అంటూ టాప్ స్టార్లందరి సీక్రెట్స్ తెలుసుకుంటూ,మనకి చెప్తూ మోస్ట్ వాంటెడ్ యాంకర్‌గా మారిపోయాడు.తాజాగా అతను ఓ తమిళ రీమేక్ లో నటించబోతున్నట్లు సమాచారం.

తమిళంలో వచ్చిన ముందాసిపట్టి తెలుగు రీమేక్ లో హీరోగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రంలో సుధీర్ బాబుని హీరోగా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ లోకి ప్రదీప్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కథ 1980 లో జరుగుతుంది. పూర్తి స్దాయి కామెడీగా ఉన్న ఈ చిత్రంలో ఇంకెవరెవరు నటించబోతున్నారు..దర్శక,నిర్మతాలు వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఇక ఇప్పటికే టీవీలనుంచి సినిమాల మీదకు వచ్చిన యాంకర్స్...

రెజీనా

రెజీనా

సీత... సీతిక్కడ.. సీతతో అంత ఈజీ కాదు అంటూ తెలుగు ప్రేక్షకుల మనసులో సీతగా ముద్ర వేసుకున్న రెజీనా.. ఎస్‌ఎమ్మెఎస్ సినిమాతో సుధీర్‌తో జతకట్టి తెలుగు తెరకు పరిచయమైంది. అంతకంటే ముందు కానల్ నీర్ అనే షార్ట్ ఫిలిమ్‌లో కనిపించింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే కిడ్స్ ఛానల్‌ లో చేసింది.

జబర్దస్త్ రష్మీ..

జబర్దస్త్ రష్మీ..

వెల్‌కమ్ టు జబర్దస్త్ అంటూ ఈటీవీ తెర మీద జబర్దస్తీగా యాంకరింగ్ చేసి జబర్దస్త్ రష్మీగా టీవీ ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకుంది రష్మీ. గుంటూర్ టాకీస్‌తో హీరోయిన్‌గా పరిచయ్యింది. ఆ తర్వాత అంతం అంటూ పలకరించింది. జబర్దస్త్ కంటే ముందు యువ అనే సీరియల్‌లో కనిపించింది.

కలర్స్ స్వాతి

కలర్స్ స్వాతి

మా టీవీలో ప్రసారమైన కలర్స్ ప్రోగ్రాంతో స్వాతి తన ప్రసానం మొదలెట్టింది. స్వాతి మొదటి సినిమా డేంజర్. సుబ్రహ్మణ్యపురం అనే తమిళ సినిమాలో తన నటనతో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నది స్వాతిరెడ్డి. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే తమిళ, మళయాల సినిమాలు కూడా చేసింది. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు, 100% లవ్, స్వామిరారా వంటి సినిమాలకు ప్లేబాక్‌లో గొంతు కూడా విప్పింది ఈ కలర్స్ యాంకర్.

నీహారిక

నీహారిక

వెల్‌కమ్ టూ అల్టిమేట్ డ్యాన్స్ షో... ఢీ అంటూ డాన్స్ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా మొదలుపెట్టిన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, ఈ మధ్యనే ఒక మనస్సు చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

చలాకీ చంటి..

చలాకీ చంటి..

జబర్దస్త్ తో పాపులర్ అయిన చలాకీ చంటి మొదట రేడీయో జాకీగా అందరికీ పరిచయం. చంటీ..... ఏంట్రా బంటీ...? అంటూ రేడియో సిటీలో వినిపించిన చంటీ ఎన్నో తెలుగు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో కనిపించాడు. భీమిలీ కబడ్డీ జట్టులో గడ్డంతో కనిపించే చంటి రియల్‌లైఫ్‌లో కూడా ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తూ సినిమాలు చేసాడు. జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్‌తో టీవీ అభిమానులందరినీ ఆకట్టుకున్న చంటి ఎన్నో కామెడీ స్కిట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం నా షో... నా ఇష్టం అంటూ కామెడీ చేస్తున్నారు.

శివాజి

శివాజి

ఎన్నో కామెడీ చిత్రాల్లో నటించిన హీరో శివాజి ... మొదట తన ప్రస్దానాన్ని జెమెనీ లో పాటల పోగ్రాంకు యాంకర్ గా చేసాడు. ఆ తర్వాతే సినిమాలకు పరిచయమయ్యాడు.

శ్రీనివాస రెడ్డి

శ్రీనివాస రెడ్డి

సినిమాల్లో కామెడీ రోల్స్ చేసే శ్రీనివాస రెడ్డి ఈటీవిలో యాంకర్ గా చేసేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి, గీతాంజలి చిత్రంతో హీరోగానూ మారారు.

సుమ

సుమ

ప్రముఖ యాంకర్ సుమ ని తెలయని తెలుగు వాళ్లు ఉండరు. ఆమె కూడా చిన్న తెర నుంచి పెద్ద తెరకు వచ్చి కళ్యాణప్రాప్తిరస్తు చిత్రంలో హీరోయిన్ గా చేసింది.

ఝాన్సి

ఝాన్సి

తెలుగు తెరను ఏలుతున్న మరో ప్రముఖ యాంకర్ ఝాన్సి కూడా ఎన్నో పాత్రలను తెరపై నటించి పండించింది. ఇప్పటికీ అవకాసం ఉన్నప్పుడల్లా ఆమె వెండితెరపై మెరుస్తూనే ఉంది.

భార్గవి

భార్గవి

టీవిలో ఎన్నో టీవీ ప్రోగామ్ లకు యాంకరింగ్ చేసిన భార్గవి తర్వాత ‘బలాదూర్‌' చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. ‘తీన్‌మార్‌', ‘గాలిపటం', ‘ఒక లైలా కోసం', ‘అత్తారింటికి దారేది' చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. పది సినిమాల దాకా చేశారామె.

English summary
Popular TV show host Pradeep Machiraju is all set to turn solo hero with a feature film. Pradeep has chosen to remake the Tamil hit film Mundasupatti for his solo hero film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu