For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ కమెడియన్‌కు ప్రమాదం: పైనుంచి పడిపోవడంతో.. అంబులెన్స్‌లో తరలింపు

  |

  తెలుగు బుల్లితెరపై కొంత కాలంగా ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. అయితే, అందులో అన్ని షోలూ ప్రేక్షకుల ఆదరణను మాత్రం అందుకోవడం లేదు. కానీ, కొన్ని మాత్రం భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. అలాంటి వాటిలో సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ఒకటి. సెలెబ్రిటీలతో సందడి సందడిగా సాగే ఈ షోకు ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది.

  దీంతో నిర్వహకులు కొత్త కొత్త సెలెబ్రిటీలను తీసుకొచ్చి మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ షోలో జబర్ధస్త్ కమెడియన్‌కు ప్రమాదం జరిగింది. ఏకంగా పైనుంచి పడిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  ప్రత్యేకంగా నిలుస్తోన్న క్యాష్ షో

  ప్రత్యేకంగా నిలుస్తోన్న క్యాష్ షో

  ఈటీవీలో ప్రసారం అవుతోన్న క్యాష్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా నడుస్తూ ఉంటుంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, ఈ కార్యక్రమాన్ని లెజెండరీ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

  హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

  సుమ వల్లే దీనికి మరింత క్రేజ్

  సుమ వల్లే దీనికి మరింత క్రేజ్

  యాంకర్ సుమ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో ‘క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తూ క్రేజ్ తెచ్చింది.

  వచ్చే వారం నాలుగు జంటలు

  వచ్చే వారం నాలుగు జంటలు

  వచ్చే శనివారం ప్రసారం కానున్న ‘క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సాయి - నైనికా, అజార్ - రితూ చౌదరి, బషీర్ - ఫయిమా, నరేష్ - యోధలు జంటలుగా వచ్చారు. వీళ్లతో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వాళ్లు కూడా ఈ టాప్ యాంకరమ్మకు సమానంగానే పంచులు వేశారు. దీంతో ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.

  Bigg Boss Non Stop: మొగుడంటూ అతడితో బెడ్‌పై అషు రచ్చ.. అలాంటి సైగలు.. బూతులతో దారుణంగా!

  సుమకే పంచ్‌లు.. అదిరిందిగా

  సుమకే పంచ్‌లు.. అదిరిందిగా

  క్యాష్ షోలో సాదారణంగా సుమ వచ్చిన సెలెబ్రిటీలకు పంచ్‌లు వేస్తూ ఆట పట్టిస్తుంటుంది. ఆమె దెబ్బకు అందరూ బిత్తరపోతుంటారు. అయితే, తాజాగా విడుదలైన ప్రోమోలో పిల్లలే ఈ యాంకరమ్మకు చుక్కలు చూపించారు. బీపీ వస్తదని సుమ అంటే టాబ్లెట్ ఉందని బషీర్ పంచ్ వేశాడు. ఆ తర్వాత కళ్ల గురించి మాట్లాడగా.. కళ్లజోడు పెట్టుకోమని యోధ సెటైర్ వేసింది.

  పొట్టి నరేష్ స్పెషల్ అట్రాక్షన్

  పొట్టి నరేష్ స్పెషల్ అట్రాక్షన్

  ఈ ఎపిసోడ్‌లో యోధతో కలిసి జంటగా వచ్చిన జబర్ధస్త్ కమెడియన్ పొట్టి నరేష్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. తెగ పంచులు వేయడంతో పాటు సాయి - నైనికా జంటను ఆట పట్టిస్తూ డైలాగులు వదిలాడు. అంతేకాదు, మిగిలిన సెలెబ్రిటీలకు కూడా సెటైర్లు వేశాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ మొత్తంలో అతడు హల్‌చల్ చేసినట్లు తాజాగా వచ్చిన ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది.

  డ్రెస్ తీసేసి మరీ రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా అస్సలు తగ్గకుండా!

  సుమను ప్రేమించమని రచ్చ

  క్యాష్ ప్రోమోలో పొట్టి నరేష్ కొంత ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. అతడికి సుమ కూడా జత కలిసి లవ్ ట్రాక్ అన్నట్లుగా కొన్ని సీన్స్ చేశారు. ‘మేడం క్యాష్‌కు ఆరుసార్లు వచ్చాను. మిమ్మల్ని చూసిన ప్రతిసారీ కొత్తగా ఉంది. ఐలవ్యూ' అంటూ గులాబీ ఇచ్చాడు. దీంతో సుమ అతడిని కొట్టి ‘నీ బాడీ ఇక్కడే పాతి పెట్టి.. దాని మీద పువ్వు పెడతాడురా మా ఆయన' అని బదులిచ్చింది.

  Recommended Video

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  నరేష్‌కు ప్రమాదం.. ఆస్పత్రికి

  నరేష్‌కు ప్రమాదం.. ఆస్పత్రికి

  క్యాష్ షోలో ఫైనల్ రౌండ్ ఆడేటప్పుడు వస్తువులన్నీ పైనుంచి కిందకు పడుతున్నట్లు చూపిస్తారు. ఇక, తాజా ప్రోమోలో నరేష్.. సుమను ప్రేమించమని అడుగుతూ అక్కడకు వెళ్లాడు. ఆ సమయంలో కాలు జారి కింద పడిపోయాడు. ఆ వెంటనే అంబులెన్స్ సౌండ్‌ను ప్లే చేశారు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది. అయితే, ఇదంతా టీఆర్పీ పెంచుకునే స్కిట్ అని తెలుస్తోంది.

  English summary
  Potti Naresh, Basheer, Faima, Yodha and Rithu Chowdary participated in Anchor Suma Cash Show Upcoming Episode. Comedian Naresh Met With an Accident in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X