నా బట్టలు.. నా ఇష్టం.. నాకు ఫ్రీడమ్ లేదా? ప్రియాంక జైన్ ఎమోషనల్
ఇండస్ట్రీ అంటేనే గ్లామర్! ఆ గ్లామర్‌కి పరిమితులు ఉండవని మనందరికీ తెలుసు. స్టార్ హీరోయిన్లైనా, సీరియల్ హీరోయిన్స్ అయినా తన లుక్స్‌తో లైమ్‌లైట్‌లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. నేమ్, ఫేమ్ వచ్చేదాకా చాలా మంది హీరోయిన్‌లు గ్లామర్ ప్రదర్శన చేస్తుంటారు. అలా ఇటీవల సీరియల్ బ్యూటీ ప్రియాంక జైన్ ( Priyanka Jain)ఓ షోలో ప్రియాంక మెరుపులాంటి జిగేల్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ, మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. 'ఇది ఎంట్రా ఇలా?' 'సీరియల్ హీరోయిన్‌కీ ఇంత గ్లామర్ అవసరమా?'అంటూ కామెంట్లు చేశారు. ఆ ట్రోలింగ్ పై ప్రియాంక కూడా తనదైన అటిట్యూడ్‌లోనే రిప్లై ఇచ్చింది ఇంతకీ ఏమన్నారంటే?
టాలీవుడ్ టెలివిజన్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు ప్రియాంక జైన్ ( Priyanka Jain). మౌనరాగం, జానకి కలగనలేదు వంటి హిట్ సీరియల్స్‌తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది ఈ కన్నడ బ్యూటీ. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తరువాత బిగ్‌బాస్ సీజన్-7 లో పాల్గొని ఫినాలే వరకు నిలిచి మరింత పాపులర్ అయ్యింది. తాజాగా ప్రియాంక తన వ్యక్తిగత జీవితంపై గుడ్‌న్యూస్ పంచుకుంది. సీరియల్ నటుడు శివకుమార్‌తో ఆమె ప్రేమలో ఉందన్న విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని సమాచారం.

బిగ్‌బాస్ తర్వాత కొత్త సీరియల్స్ చేయకపోయినా, టీవీ షోలు, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ మధ్యకాలంలో ప్రియాంక ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే 'డ్యాన్స్ ఐకాన్ 2' షోలో పాల్గొంది. అయితే ఆ షోలో ఆమె వేసుకున్న గ్లామరస్ ఔట్‌ఫిట్‌పై నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. "ఇది ప్రియాంకేనా?" "ఇంత గ్లామర్ ఎందుకు?" అంటూ కామెంట్లు కురిపించారు. ఈ విమర్శలపై జబర్దస్త్ వర్ష హోస్ట్ చేసిన 'కిస్సిక్ టాక్' షోలో ప్రియాంక స్పందించింది. వర్ష అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రియాంక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రియాంక జైన్ ట్రోలింగ్స్ పై స్పందిస్తూ.. "నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ట్రోల్స్ చూసి షాక్ అయ్యాను. ఏంటి ప్రపంచం మొత్తం ఆగిపోయిందా? అన్నట్లుగా నాపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారు. నేను నటించిన క్యారెక్టర్‌లో ఉన్నంతసేపు మాత్రమే ఆ లుక్‌లో ఉంటాను. ఆ పాత్ర అయిపోయాక మళ్లీ అలాగే ఉండడం సాధ్యం కాదు. నేను ఒక యాక్టర్‌ను.. నాకు కూడా ఫ్రీడం ఉంది. నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడంలో తప్పేముంది?" అంటూ ప్రియాంక ప్రశ్నించింది.
ప్రియాంక ఇంకా మాట్లాడుతూ.. 'కొంతమంది మాత్రం ఆడపిల్లని చూడకుండా, సెన్స్ లేదా? మ్యానేర్స్ లేదా?అంటూ దారుణంగా కామెంట్లు చేశారు. కొన్ని కామెంట్లు చూసి నా మీద నాకే అసహ్యం వేసింది. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాలేదు' అంటూ భావోద్వేగానికి గురైంది. అయితే ఈ సమయంలో తనకు మోరల్ సపోర్ట్‌గా తన లవర్ శివ్ నిలిచారని చెప్పుకొచ్చింది. "నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి శివ్. 'వాటిని ఎందుకు చదువుతున్నావ్? ఎందుకు పట్టించుకుంటున్నావ్? వదిలేయ్'అంటూ నన్ను ఓదార్చాడు," అని తెలిపింది.
'డ్యాన్స్ ఐకాన్ 2 షోలో నేను వేసుకున్న డ్రెస్సింగ్‌లో అతిగా ఏమీ చూపించలేదు. ఎక్కడ ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో నాకు తెలుసు. ఇతరులు విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదు'అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేసింది. అలాగే.. "నా డ్రెస్సింగ్‌పై అమ్మ నన్ను కొట్టిందట అని రాసారు. అది పూర్తిగా అబద్ధం. రాయాలనుకున్నవాళ్లు ఏదో రాస్తారు. అలాంటి వాస్తవం లేదు," అని క్లారిటీ ఇచ్చింది.
అలాగే బిగ్‌బాస్ తర్వాత డ్రెస్సింగ్‌పై విమర్శలు ఎక్కువయ్యాయని వర్ష ప్రశ్నించగా.. "బిగ్‌బాస్‌కి ముందు నేను సీరియల్స్‌లో నటించేదాన్ని. ఇప్పుడు షోలు, ఈవెంట్స్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో పాల్గొంటున్నాను. అందుకే తగిన విధంగా డ్రెస్సింగ్ చేస్తున్నాను. అప్పటి ప్రియాంక వేరు, ఇప్పటి ప్రియాంక వేరు. ఇది నా ప్రొఫైల్, ఇది నా స్టైల్. నచ్చితే ఫాలో చేయండి, నచ్చకపోతే అన్‌ఫాలో చేయండి. కానీ గలీజ్‌గా కామెంట్ చేయొద్దు. మేం కూడా మనుషులమే, మాకూ ఫీలింగ్స్ ఉంటాయి. మీ కామెంట్స్ చూసి మేము కూడా కన్నీళ్లు పెట్టుకుంటాం," అని చెప్పి ఎమోషనల్ అయ్యింది.


Click it and Unblock the Notifications











